Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Dec 30, 11:43 PM
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
Eenadu Dec 30, 11:43 PM
న్యూ ఇయర్‌ వేళ క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు సజ్జనార్‌ హెచ్చరిక
Eenadu 🌍 International Dec 30, 11:43 PM
జర్మన్‌ బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.316 కోట్లు లూటీ
Eenadu Dec 30, 11:43 PM
అంతా ప్రేమమయం ప్రేమ... అమూల్యమైన భావన. దివ్యమైన అనుభూతి. విశ్వమంతా నిండి ఉన్నది ఈ పరమ పవిత్రమైన ప్రేమే. శిశువులు ఓలలాడేది మాతృప్రేమ సాగరంలోనే. సృష్టి స్థితులకు మూలకారణం ప్రేమ తత్వమే.
Eenadu Dec 30, 11:43 PM
వైరభక్తులూ వీరభక్తులే! భక్తులు రెండు రకాలని... వారిలో కొందరు వీరభక్తులని, మరికొందరు వైరభక్తులని అంటుంటారు. కానీ అది సరికాదు. వైరభక్తులూ వీరభక్తులే. ఇంకా చెప్పాలంటే వీరాతివీర భక్తులు, పరమాత్ముణ్ని వెన్నంటి ఉన్నవాళ్లు. వైరభక్తి కేవలం నటన. మూడు యుగాలను అనితరసాధ్యంగా ప్రభావితం చేసిన నటన.
Eenadu Dec 30, 11:43 PM
వైకుంఠుడి ఏకాదశి ‘వికుంఠం’ అనే పదానికి ‘విష్ణులోకం’ అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి- శ్రీమన్నారాయణుడికి ‘వైకుంఠుడు’ అనే పేరు స్థిరపడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికుంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే- వైకుంఠం.
Eenadu Dec 30, 11:43 PM
బ్రహ్మజ్ఞాని... భక్తకవి అచంచల భక్తికి, అపార జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం రమణ మహర్షి. ఆయన ఎంతటి పూర్ణజ్ఞానులో, అంతటి భక్తిపూర్ణులు. పరమభక్తులకు భాగవతోత్తముడిగా, పారమార్థిక పిపాసితులకు జ్ఞానమూర్తిగా దర్శనమిచ్చే మహానుభావుడు. ఆ మౌనర్షి ఓ మహాకావ్యం. ఆస్వాదించ గలిగినంత ఆస్వాదించడమే. అది మన అర్హత, యోగ్యతలను బట్టి ఉంటుంది. రమణులను ఆశ్రయించినవారు ఎవరూ నిరాశగా తిరిగి వెళ్లరు.
Eenadu Dec 30, 11:43 PM
మాట్లాడుకోవాలి! ఒకప్పుడు ఒంటరిగా నడచిన మనిషి చక్రం వచ్చాక గుంపులో ప్రయాణం మొదలుపెట్టాడు. కథలు చెప్పుకొన్నాడు. కబుర్లు పంచుకున్నాడు. బస్సులూ రైళ్లూ వచ్చాయి. ప్రయాణం నేటి జీవన విధానమైంది.
Eenadu 🇮🇳 National Dec 30, 11:43 PM
ప్రాచీన భారత వైజ్ఞానిక పాటవమిది! చరిత్ర అనగానే రాజులు, యుద్ధాలు, విప్లవాలు వంటివాటి ప్రస్తావనే ఉంటుంది. కానీ, ఆ బాహ్య పరిణామాల వెనక చింతనలో, మేధస్సులో జరిగే పరిణామాలు కూడా బలమైన ప్రభావం కలిగి ఉంటాయి. అందుకని, ఆయా దేశాల రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో, వాటి వైజ్ఞానిక- మేధోచరిత్ర కూడా అంతే ముఖ్యం. 
Eenadu 🇮🇳 National Dec 30, 11:43 PM
కొత్త ఒప్పందాలు సరికొత్త అవకాశాలు ట్రంప్‌ సుంకాల బాదుడుకు అంతర్జాతీయ వాణిజ్యం కుదేలైంది. దీంతో ఆయా దేశాలతో విడివిడిగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) జోరందుకున్నాయి. ఈ విషయంలో ఇండియా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలతో చర్చలు సాగిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తోనూ ఒప్పందంపై సంతకం చేసింది. 
Eenadu Dec 30, 11:43 PM
విపత్తు నామ సంవత్సరం! ముప్పు ముంచుకొస్తోందని తెలిసీ చేతులు ముడుచుకుని కూర్చోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. తరుముకొస్తున్న ప్రమాద తీవ్రతను మరింత పెంచేలా వ్యవహరించడమైతే ఏకంగా ఆత్మహత్యా సదృశమవుతుంది. శిలాజ ఇంధనాలను ఇష్టమొచ్చినట్లు వాడేస్తుండటంతో కర్బన ఉద్గారాలు కట్టుతప్పుతున్నాయి. వాటి మూలంగా అంతకంతకూ పెరిగిపోతున్న భూతాపంతో వేగవంతమవుతున్న వాతావరణ మార్పులే పెనువిపత్తులై విరుచుకుపడుతున్నాయి.
Eenadu 📍 Telangana Dec 30, 11:43 PM
ఫ్యూచర్‌ సిటీకి పోలీస్‌ కమిషనరేట్‌ జీహెచ్‌ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసింగ్‌ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న మూడు కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ రానుంది. దాంతోపాటు ప్రస్తుత రాచకొండ కమిషనరేట్‌ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చనున్నారు.
Eenadu 📍 Telangana Dec 30, 11:43 PM
కలిసి చదివి...కలల ప్రపంచానికి చేరి.. స్నేహితురాళ్ల విషాదాంతం గ్రామంలో ఒకటో తరగతి మొదలు.. అమెరికాలో ఎంఎస్‌ దాకా కలిసి చదువుకున్న ఇద్దరు యువతులు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. వారి మరణ వార్త తెలిసి మహబూబాబాద్‌ జిల్లా గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
Eenadu 📍 Telangana Dec 30, 11:43 PM
సభలో తగ్గేదే లే...! భారాస చెప్పేవన్నీ అసత్యాలని.. శాసనసభ సమావేశాల్లో మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు బలమైన వాదనల ద్వారా ప్రజల ముందుంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం సభ వాయిదా పడిన అనంతరం ఆయన తన ఛాంబర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు.
Eenadu 📍 Telangana Dec 30, 11:43 PM
5 వరకు సమావేశాలు శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి ‘బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)’లో నిర్ణయం తీసుకుంటారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 30, 11:43 PM
క్యాబినెట్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై రాయచోటి ఎమ్మెల్యే, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై అధికారులు ప్రజంటేషన్‌ ఇస్తున్న సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 30, 11:43 PM
తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా వస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓడరేవు ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని ఆదేశించారు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
నేరాలు తగ్గాయ్‌.. శిక్షలు పెరిగాయ్‌ ఆంధ్రప్రదేశ్‌లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గుముఖం పట్టగా.. ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, పగటిపూట ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరిగాయి. సైబర్‌ నేరాల కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆయా ఘటనలపై వేలల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి.
Eenadu 📍 Andhra Pradesh Dec 30, 11:43 PM
కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది.
Eenadu Dec 30, 11:43 PM
యూట్యూబ్‌ రీల్స్‌తో తొలి సంపాదన..!‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి..’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. అయితే ఈ మాటల్ని యువతే కాదు.. 50 ఏళ్లు పైబడిన వారూ తమ ట్యాలెంట్‌తో నిజం చేసి చూపిస్తున్నారు. తద్వారా ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే!’ అని రుజువు చేస్తున్నారు.