Aamir Khan: అలా విడుదలై ఉంటే.. ‘ధురంధర్’ కలెక్షన్లు ఇంకా పెరిగేవి: ఆమిర్‌ఖాన్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1300+ కోట్ల కలెక్షన్ల (Dhurandhar Collections)తో రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఇంకా ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమై ఉంటే.. మరిన్ని వసూళ్లు రాబట్టేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో థియేటర్లు లేవని, వాటి సంఖ్య పెరిగినప్పుడే ఇండస్ట్రీలో మార్పొస్తుందని పేర్కొంటూ రీసెంట్ హిట్ ‘ధురంధర్’ను ఉదాహరణగా చెప్పారు. 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు.
- ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘ధురంధర్’.. పాక్‌లో నెం.1
భారత్‌తో మరిన్ని థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమిర్ వ్యాఖ్యానించారు. ‘‘చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు ఉంటే.. మన వద్ద 9 వేలకుపైగా ఉన్నాయి. చైనాలో విడుదలయ్యే సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. గతేడాది విడుదలైన చైనీస్ మూవీ ‘నె ఝా 2’ సినిమా కలెక్షన్లు 2+ బిలియన్ డాలర్లు (18వేల కోట్లు+). భారత్‌లో ‘ధురంధర్’ వసూళ్లు 115 మిలియన్ డాలర్లు (రూ.1000+ కోట్లు)’’ అని అన్నారు. థియేటర్ల గురించి ఆమిర్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. భారత్‌లో థియేటర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని గత ఇంటర్వ్యూల్లోనూ పేర్కొన్నారు.
‘ధురంధర్’లాంటి సినిమాలు ఎన్ని?: ఎగ్జిబిటర్
ఆమిర్ కామెంట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదికి చెందిన ఓ ఎగ్జిబిటర్ స్పందిస్తూ.. ‘ధురంధర్’లాంటి సినిమాలు ఏడాదికి ఎన్ని విడుదలవుతున్నాయో గ్రహించాలన్నారు. నిజంగానే థియేటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ స్థాయిలో సినిమాలు రావాలన్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :