మార్గదర్శి

Eenadu icon
By Editorial Team Published : 26 Jan 2026 04:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సృష్టిలో సర్వోత్తమమైంది మానవ జన్మ. దానికి కారణం మనిషికి మాత్రమే ఉన్న బుద్ధిబలం. మనిషిలోని అంతర్గతమైన బుద్ధి ఒక నిర్ణయాత్మకమైన గుణవిశేషం. శక్తియుక్తులన్నీ అతడి బుద్ధిని అనుసరించే ఉంటాయి. మనిషి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా బుద్ధి అనేది కీలకం. లోకంలో ఎవరినైనా మంచి మార్గంలో నడిపించేది సకారాత్మకమైన బుద్ధి ఒక్కటే. అదే మార్గదర్శి. అదే అంతర్యామి.

సమాజంలో వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలంటే అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. పుట్టి పెరిగిన వాతావరణం, విద్య, సంస్కారం, జ్ఞానం వంటివన్నీ బుద్ధిబలాన్ని ఇనుమడింపజేస్తాయి. బుద్ధిమంతుడైన వ్యక్తి నిరంతరం ఎరుకతో ప్రవర్తిస్తాడు. తన చుట్టూ ఉన్న వాతావరణం పట్ల సరైన అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి వారు ధర్మబద్ధమైన జీవనాన్ని గడపడం ద్వారా లోకంలో మానవత్వాన్ని ఉద్దీపనం చేస్తారు.
సృష్టిలో రూపురేఖావిలాసాల్లో మనుషులందరూ ఎలా ఒకేలా ఉండరో, బుద్ధి పరంగానూ ఒకేలా ఉండరు. కొందరు మందబుద్ధి కలిగి ఉంటారు. మరికొందరు ఒక మోస్తరు తెలివిని, ఇంకొందరు చురుకైన బుద్ధిని కలిగి ఉంటారు. వారిది కుశాగ్రబుద్ధి లేదా బుద్ధికుశలతగా చెప్పవచ్చు. దర్భగడ్డి మొన ఎంత వాడిగా ఉంటుందో వారి బుద్ధి అంత పదునుగా ఉంటుందని అర్థం. అటువంటి వారు విషయాన్ని వెంటనే గ్రహిస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞానవంతులైన వారు ఎవరైనా ఇటువంటి బుద్ధికుశలతను కలిగి ఉంటారు. స్వామి వివేకానంద వంటివారు ఈ కోవలోకి వస్తారు.

బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, కబీర్‌ దాస్, పండిత రవిదాస్, గురునానక్‌ వంటి మహానుభావులు వారి బోధనల ద్వారా ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. ప్రత్యక్షంగా అనుభూతి చెందిందే సత్యం అన్నాడు బుద్ధుడు. అహింస, సత్యం మనుషుల జీవితాలను ఆనందమయం చేస్తాయన్నాడు వర్ధమాన మహావీరుడు. అంతర్గత శుద్ధి లేని హృదయం సకల దుర్గుణాలతో నిండి ఉంటుందని రవిదాస్‌ ప్రబోధించాడు.
ప్రేమ, సోదరభావం, సమానత్వం, ఆధ్యాత్మిక భావనలు మానవజాతి పురోగతికి దోహదం చేస్తాయన్నాడు గురునానక్‌. ఇలాగే ఇంకా చాలామంది మహానుభావులు లోకానికి మేలుచేసే బోధనలు చేశారు. వీరంతా మామూలు మనుషుల్లోంచి వచ్చినవారే. కానీ తమ బుద్ధికుశలతతో మానవ జీవితాన్ని కాచివడపోశారు. అందుకే వారి బోధనలు ఎప్పటికీ మనకు దారిదీపాలూ, మార్గదర్శకాలు.

సంస్కృత ధాతువైన బుద్ధి పదానికి సామాన్యంగా తెలివితేటలని అర్థం. ప్రాచీన కాలంలో ఈ తెలివితేటలను జీవన్ముక్తి, ఆధ్యాత్మిక చింతన కోసం వినియోగిస్తే, ఆధునికకాలంలో బతుకుతెరువుకు ఉపయోగిస్తున్నారు. బుద్ధి వక్ర మార్గంలో పడనంతవరకూ మనిషి చిరంజీవి. ఎందుకంటే రజస్తమో గుణాలు ఎప్పుడూ బుద్ధిని తప్పుదారి పట్టించడానికి పూనుకుంటాయి. అందుకే ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నారు పెద్దలు. వెరసి దేశకాలాలకు అతీతంగా మనిషిని నడిపించేది బుద్ధి ఒకటే. అదే మార్గదర్శి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.
  • దర్శనకళ ‘దర్శనం’ అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నా, అంతరార్థం చాలామందికి బోధపడని పదమది. ఉదాహరణకు ‘మీరు దేవుణ్ని చూశారా’ అనే ప్రశ్న ఎదురైతే, మనలో చాలామందిమి బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం.