Mohammed Siraj: సూర్యా భాయ్‌.. జోక్‌ చేయకు: మహ్మద్‌ సిరాజ్‌

Eenadu icon
By Sports News Team Updated : 08 Feb 2026 11:35 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు టీ20 వరల్డ్‌ కప్‌ ( ICC Mens T20 World Cup) 2026కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మహ్మద్‌ సిరాజ్‌కు ( Mohammed Siraj) అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. అయితే ఆ సమయంలో లాలిగాలో రియల్‌ మాడ్రిడ్‌ - రియల్‌ సోసిడాడ్‌ మధ్య ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు స్పెయిన్‌ వెళ్లేందుకు అతడు సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఈ విషయమై సిరాజ్‌ తన అనుభవాన్ని పంచుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ( Suryakumar Yadav) తనతో జోక్‌ చేస్తున్నాడనుకున్నానని వివరించాడు.

‘‘రెండు రోజుల క్రితం సూర్యా భాయ్‌ నాతో ఏం మాట్లాడాడంటే... ‘మియా నీ బ్యాగులు సర్దుకుని వచ్చేయ్‌ (ముంబయి)’ అన్నాడు. దానికి నేను.. ‘అన్నా.. నువ్వు జోక్‌ చేయకు. ఇది అసంభవం’ అన్నాను. దానికి అతడు ‘నేను నిజమే చెబుతున్నా. గెట్‌ రెడీ’ అన్నాడు. 

  • కెప్టెన్‌.. ఏం కొట్టాడయ్యా!

ప్రజ్ఞాన్‌ ఓజా ఏమన్నాడంటే..!

సూర్య ఫోన్‌ కాల్‌ తర్వాత.. భారత సెలక్షన్‌ కమిటీ సభ్యుడు ప్రజ్ఞాన్‌ ఓజా.. సిరాజ్‌కు ఫోన్‌ చేశాడు. అతడు తనతో ఏమన్నాడో కూడా సిరాజ్‌ వివరించాడు. ‘‘ఓజా నాతో.. ‘దైవలిఖితాన్ని ఎవరూ మార్చలేరు’ అని నాతో అన్నాడు. నేను నిజానికి 15వ తేదీన స్పెయిన్‌లో.. లాలిగాలో రియల్‌ మాడ్రిడ్‌ - రియల్‌ సోసిడాడ్‌ మధ్య ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు సిద్ధమవుతున్నా. కానీ నేను వరల్డ్‌కప్‌లో ఆడాల్సి రావడం విధి లిఖితం..’ అని మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 11:14 IST