Nalgonda: సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. భార్య మృతదేహం లభ్యం..

Eenadu icon
By Telangana Dist. Team Updated : 08 Feb 2026 12:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిడమానూరు: నల్గొండ జిల్లాలో సాగర్‌ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గాలింపు కొనసాగుతోంది. నిడమానూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో త్రిపురారం మండలం కంపాసాగర్‌కు చెందిన దంపతులు పుల్లయ్య, పద్మ కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం కాల్వ నుంచి కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. అందులో పద్మ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరగ్గా.. కారు డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. 

► Read latest Nalgonda Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 10:52 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హస్త‘గిరి’..! [ 17-02-2026] నల్గొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. తొలి మేయర్‌ పీఠం కాంగ్రెస్‌ను వరించింది. కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉండగా 27 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • 45 రోజుల్లో లెక్కలు చెప్పాల్సిందే.. [ 17-02-2026] పురపాలక సంఘం ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసిన అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు రూ.లక్ష లోపు చేయాల్సి ఉంది. అభ్యర్థి నామినేషన్‌ సమర్పించిన నాటి నుంచి ఎన్నికల ఫలితం వరకు చేసిన ఖర్చును నమోదు చేయాల్సి ఉంటుంది.
  • మాటకు కట్టుబడు.. అభివృద్ధికి పాటుపడు..! [ 17-02-2026] ఉమ్మడి జిల్లాలో నల్గొండ కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల నూతన పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఎవరికి వారు ప్రకటించారు.
  • అంత్యక్రియలకు వస్తూ.. అనంత లోకాలకు [ 17-02-2026] హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఆలేరు మండలం టంగుటూరు శివారులో సోమవారం క్వాలిస్‌ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..
  • క్షణం ఆగు.. ముందుకు సాగు [ 17-02-2026] క్షణికావేశం, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల ఫలితాలు అనర్థాలకు దారితీస్తాయి. ఎదుటి వ్యక్తికో లేదా నిర్ణయం తీసుకున్న వ్యక్తికో తీరని నష్టాన్ని మిగిలిస్తాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు ఘటనలే దీనికి ఉదాహరణ.
  • తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష: జగదీశ్‌రెడ్డి [ 17-02-2026] రాష్ట్రంలో విచిత్రపాలన నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తిరుమలగిరి పుర ఛైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
  • పీఠంపై ‘చెయ్యే’సే..! [ 17-02-2026] జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికలు సోమవారం సజావుగా ముగిశాయి. ఉదయం 11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణం స్వీకారం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక పూర్తిచేసి.
  • వనితల‘పురం’..! [ 17-02-2026] పురపాలికల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికతో మున్సిపల్‌ ఎన్నికల ఘట్టం పరిసమాప్తమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోచంపల్లి మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్‌ ఛైర్మన్‌ పీఠాలను కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
  • అధికారం చెరిసగం : ఎమ్మెల్యే కుంభం [ 17-02-2026] కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజేతలుగా నిలిచిన ఇద్దరు మహిళా కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకుంటారని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.