Himanta Biswa Sarma: పాకిస్థానీ ఏజెంట్‌తో సంబంధాలు.. గౌరవ్ గొగొయ్‌పై అస్సాం సీఎం తీవ్ర ఆరోపణలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్ (Gaurav Gogoi)పై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు. ఈమేరకు గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిమంత (Himanta Biswa Sarma) మాట్లాడారు.
‘‘పాకిస్థానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగొయ్, ఆయన సతీమణి, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత భారత్‌కు బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. అనంతరం ఆమె ఓ భారత సంస్థలో పనిచేస్తున్నప్పుడు.. ఆరు సార్లు ఇస్లామాబాద్‌కు వెళ్లారు. మరో స్వచ్ఛంద సంస్థలో చేరిన తర్వాత మూడుసార్లు పాక్‌ను ( Pakistan) సందర్శించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అటారీ సరిహద్దు మీదుగా మాత్రమే వెళ్లేవారు. ఎప్పుడూ విమానం ఎక్కలేదు.
ఎలిజబెత్‌కు చెల్లింపుల విషయంలో ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన జరిగింది. భారత్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆమె సేకరించి.. అలీకి నివేదికలు ఇచ్చేవారు. మోదీ ( PM Modi) అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణ చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించారు. మరోవైపు.. తన భార్యకు సంబంధించిన పాకిస్థానీ బ్యాంకు ఖాతా వివరాలను గొగొయ్ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు.
గొగొయ్ సైతం తన వివాహానికి ముందు 2013లో రహస్యంగా పాకిస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన అస్సాం ( Assam) సీఎం నివాసంలో ఉండేవారు. లాహోర్‌కు మాత్రమే వెళ్లేందుకు వీసా జారీ అయినప్పటికీ.. ఇస్లామాబాద్, కరాచీ సందర్శించారు. ఈ పర్యటన గురించి అస్సాం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తాను బస చేసిన 10 రోజుల పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. అక్కడ ఆయనకు ఏదో రకమైన శిక్షణ ఇచ్చారని అనుమానిస్తున్నాం. ఆ పర్యటన తర్వాత ఆయన పార్లమెంటు ( Parliament)లో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ ప్లాంట్లపై ప్రశ్నలు అడిగారు.
ఈ వ్యవహారంపై అస్సాం ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన తర్వాత.. పాక్ ఏజెంట్ తన అన్ని ట్వీట్లను డిలీట్ చేశాడు. గౌరవ్, ఆయన సతీమణికి ఆ ఏజెంట్‌తో సంబంధం ఉందని విశ్వసిస్తున్నాం. పొరుగు దేశంతో సంబంధాల విషయమై గొగొయ్‌ను మేం ఇప్పటివరకు విచారించలేదు. ఆయన పదవికి గౌరవం ఇస్తూ.. ఆ విషయాన్ని కేంద్రానికే వదిలిపెట్టాం. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నాం’’ అని తెలిపారు.
సీఎం మీడియా సమావేశం.. సూపర్ ఫ్లాప్: గొగొయ్
ముఖ్యమంత్రి హిమంత ఆరోపణలను ఎంపీ గౌరవ్ గొగొయ్ తీవ్రంగా ఖండించారు. సీఎం మీడియా సమావేశాన్ని ‘సూపర్ ఫ్లాప్’గా పేర్కొన్నారు. ‘‘రాజకీయ చతురత ఉందని చెప్పుకొనే ఆయన.. అన్నీ అర్థం లేని, నిరాధార ఆరోపణలే చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న భూముల వ్యవహారాన్ని బయటపెట్టడంలో మేం చేపట్టిన యాత్ర విజయవంతమైంది. దీనికి విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం విఫలమైంది’’ అని గొగొయ్ ట్వీట్ చేశారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 13:15 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కమల్‌హాసన్ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్ గుర్తు కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
- ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్ టాపర్ కబీర్ చిల్లర్ జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్ తెచ్చుకొన్న హరియాణాకు చెందిన 17 ఏళ్ల కబీర్ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
- డియర్ ఫ్రెండ్.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.
- ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు చేసి..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
- ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.