Russia: రష్యాలో భారతీయులపై దాడిచేసిన దుండగుడు ‘నియోనాజీ’

Eenadu icon
By International News Team Published : 08 Feb 2026 10:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా ( Russia) బాష్కోర్తోస్థాన్‌ రిపబ్లిక్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థుల హాస్టల్‌లో భారతీయులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి నియో-నాజీ సంస్థ భావజాలానికి ప్రభావితమైనట్లు తేలింది. అతడు వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ దాడిలో నలుగురు భారతీయులు సహా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు నిషేధిత వైట్‌ పవర్‌ లేదా నేషనల్‌ సోషలిజం సంస్థకు చెందినవాడిగా ఓ టెలిగ్రామ్‌ ఛానల్‌ పేర్కొంది. దీనిని రష్యా సుప్రీంకోర్టు 2012లోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 

దాడి సమయంలో నిందితుడు కొన్ని నినాదాలు చేశాడు. బాధితుల రక్తంతో అతడు డార్మెటరీ గోడలపై నాజీ గుర్తును చిత్రీకరించినట్లు రెన్‌టీవీ వెల్లడించింది. దాడి జరిగిన ప్రదేశం మొత్తం రక్తపు మడుగుగా మారింది.  నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడినట్లు మేజర్‌ జనరల్‌ ఇరిన వోల్క్‌ వెల్లడించారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బంగ్లాలో కొత్త ప్రభుత్వం వేళ.. ‘సారథి’ పయనం ఎటు..? క్లిష్ట సమయంలో దేశాన్ని ముందుండి నడిపించిన మహ్మద్‌ యూనస్‌, నూతన ప్రభుత్వంలో భాగస్వామి అవుతారా? ప్రత్యేక బాధ్యతలు అందుకుంటారా? అన్న విషయంపై చర్చ జరుగుతోంది.
  • అందుకు ఓకే అయితే.. న్యూక్లియర్‌ డీల్‌కు రెడీ: ఇరాన్‌ Iran: తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంటే.. అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ పేర్కొంది. 
  • ఐడీ చూపించండి.. జర్మనీలో మునీర్‌కు ఇబ్బందికర పరిస్థితి! Asim Munir: ఆసిమ్‌ మునీర్‌ విదేశాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన ఆయన్ను.. అక్కడ సిబ్బంది ఆపి ఐడీ కార్డు చూపించాలని కోరారు.
  • గ్రహాంతర జీవులు ఉన్నాయి.. కానీ: ఒబామా ఏరియా 51లో గ్రహాంతర జీవులను అమెరికా నిర్భందించిందనే ఊహాగానాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా స్పందించారు. 
  • సైన్యానికి బదులు పొట్టను పెంచుతున్నారు: హంగరీ పీఎంపై జెలెన్‌స్కీ హంగరీ ప్రధాన మంత్రి విక్టోర్‌ అర్బన్‌ (Hungary PM Viktor Orban)పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర విమర్శలు చేశారు. 
  • అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి USA: అమెరికా అదృశ్యమైన భారత్‌కు చెందిన విద్యార్థి సాకేత్‌ శ్రీనివాసయ్య మృతి చెందాడు.
  • షేక్‌ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే కీలకం బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీఎన్‌పీ ఛైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు.
  • కప్ప విషంతో నావల్నీ హత్య రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని రష్యా ప్రభుత్వం.. డార్ట్‌ ఫ్రాగ్‌ అనే ఒక జాతి కప్ప విషంతో చంపిందని ఐదు ఐరోపా దేశాలు ఆరోపించాయి.
  • రష్యా, ఉక్రెయిన్‌ల పరస్పర డ్రోన్‌ దాడులు యుద్ధాన్ని ముగించే దిశగా వచ్చేవారం చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం డ్రోన్‌ దాడులకు పాల్పడ్డాయి.
  • ఐరోపాతో అమెరికా మైత్రి శాశ్వతం ఐరోపాతో తమ స్నేహ బంధం శాశ్వతమైనదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చిరకాల మిత్రదేశాలకు భరోసా ఇచ్చారు.
  • ‘ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చండి’ ఇరాన్‌లో ప్రభుత్వ మార్పిడికై ఒత్తిడి తేవాలని విదేశాల్లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ రాజు కుమారుడు రెజా పహ్లవీ శనివారం ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు.
  • మాదక ద్రవ్యాల నౌకపై అమెరికా దాడి కరీబియన్‌ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఓ నౌకపై అమెరికా సైన్యం జరిపిన భీకర దాడిలో ముగ్గురు మరణించారు.
  • నావల్నీ మృతి కేసు.. అది విష ప్రయోగమే - ఐరోపా దేశాలు రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ రెండేళ్ల క్రితం జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
  • అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యం అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు (Indian Student Missing in USA). కర్ణాటకకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9 నుంచి కన్పించకుండా పోయాడు.