Anil Ravipudi: దర్శకుడు అనిల్‌ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి

Eenadu icon
By Entertainment Team Published : 26 Jan 2026 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). ఈ సంక్రాంతికి చిరంజీవి ( Chiranjeevi) కథానాయకుడిగా ఆయన రూపొందించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  రూ.300 కోట్లకుపైగా వసూళ్లును రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో అనిల్‌ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. ఇటీవల దర్శకులకు కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ అల్ట్రా ప్రీమియర్‌ రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్ కారును చిరు కానుకగా ఇచ్చారు. దీంతో అనిల్ ఆనందానికి అవధుల్లేవు. కారు ఇచ్చిన సందర్భంగా చిరు కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్‌ చేయాలని అన్నారు. కారు నచ్చిందా?అని చిరు అడగ్గా ‘మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్‌’ అంటూ అనిల్‌ నవ్వులు పంచారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :