Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/01/2026)

Eenadu icon
By National News Team Published : 26 Jan 2026 00:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తిచేయాలి. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య ధ్యానం శుభప్రదం.

వృషభం

మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. ఆంజనేయ దర్శనం మేలు చేస్తుంది.

మిథునం

చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య కార్యాల్లో బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. ఇష్టదైవ స్తోత్రం శుభప్రదం.

కర్కాటకం

చేపట్టే పనుల్లో శుభం కలుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్య కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది.

సింహం

మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోద, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.

కన్య

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగాలి. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు రావచ్చు. దుర్గా స్తోత్రం శుభప్రదం.

తుల

శుభ భవిష్యత్తు సూచితం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్రం శుభప్రదం.

ధనుస్సు

చేపట్టిన పనుల్లో విజయసిద్ధి ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సూర్య స్తోత్రం మేలు చేస్తుంది.

మకరం

మిశ్రమ కాలం. పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త. ఓర్పు అవసరం. అనవసర భయాందోళనలకు దూరంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కుంభం

శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్యసాధనకు ఇతరుల సహకారం అవసరం. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు. శని ధ్యానం మేలు చేస్తుంది.

మీనం

మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగాలి. గోవింద నామ జపం శుభప్రదం.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :