నేనే భయం-భయమే ‘నేను’

Eenadu icon
By Editorial Team Published : 24 Jan 2026 03:16 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విష్యత్తులో ఏమవుతుందో అన్న అనిశ్చితి నుంచి మరణభయం వరకూ- మనిషికి అనేక భయాలుంటాయి. ప్రతి సమస్యకీ సులభమైన పరిష్కారం, దగ్గర దారి వెతకడం మనసు సహజ లక్షణం. అందుకే భయాన్ని అవగాహన చేసుకోవడానికి బదులు ‘నమ్మకం’ అనే షార్ట్‌కట్‌ను ఆశ్రయిస్తుంది. చుట్టూ సమాజంలో కూడా దాదాపు అందరూ అదే దారిలో నడుస్తుంటారు. అలా నమ్మకం చాలా సహజమైన విషయంగా, అలవాటుగా మారిపోతుంది.

మనిషి లోపలి భయాలూ కోరికల బయటి రూపమే నమ్మకం. అది ఇచ్చే భరోసాతోనో, ఆచారాలూ ప్రార్థనలతోనో, నిర్ణయాలు వాయిదా వేసో, వినోద కాలక్షేపాలతోనో మన భయాలను దారి మళ్లించాలని చూస్తూంటాం. నమ్మకం ఉన్నప్పటికీ ఆశించినట్లుగా అన్నీ జరగవు. అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. ఏదీ మన చేతుల్లో లేదన్న అశక్తత ఒకవైపు, నమ్మకం లాంటిదేదో ఊతంగా ఉంటే బాగుంటుందన్న ఆశ మరోవైపు - ఇలా జీవితం పరాధీనంగా, సంఘర్షణామయంగా అయిపోతుంది. భయం నుంచి పారిపోవడమో, దానితో పోరాడటమో భయానికి పరిష్కారం కాదంటారు జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికులు. భయం వెనక కారణాలను మేధోపరంగా విశ్లేషించి తేల్చుకోవడం ఒక స్థాయి. ధ్యానం లాంటి పద్ధతులతో మానసిక ఆందోళనలను ఒకింత నియంత్రించవచ్చు. అయితే ఈ ఉపశమనాలు తాత్కాలికమైనవి. మరోవైపు, ధైర్యం అనే సుగుణం అలవరచుకుంటేనో, నేను ధైర్యశాలినని పదే పదే మనసుకు చెప్పుకొంటేనో భయం పోదు. మరేం చేయాలి? 

భవిష్యత్తులో ఏం జరగనుందో అని వర్తమానంలో కలత చెందడమే ‘భయం’. అంటే ప్రస్తుత క్షణంలో ఉండకపోవడం వల్ల కలిగే అనేక అనర్థాల్లో భయం కూడా ఒకటన్నమాట. గత జ్ఞాపకాన్ని, అభద్రతనూ భవిష్యత్తులోకి చొప్పించే ఆలోచనే ‘మానసిక’ కాలాన్నీ, భయాన్నీ సృష్టిస్తుంది. భయం పుడుతున్నప్పుడే దాని తీరును ఎరుకతో గమనించాలి. ఏ పేరూ పెట్టకుండా, ఏ నిరోధం, అణచివేతా లేకుండా దానికి ముఖాముఖీ నిలబడాలి. అలాంటి జాగరూక పరిశీలనలో ఆ మానసిక కదలిక తన స్వరూపాన్ని ప్రకటిస్తుంది. అదే ఎరుకలో భయానికి మూలమైన ఆలోచన తన శక్తినీ, పట్టునూ కోల్పోతుంది. ఇది ఏ పద్ధతీ, సాధన ద్వారా కాదు; తర్కం, విశ్లేషణ ద్వారా కాదు; వర్తమాన క్షణంపై ఎరుక వల్ల వచ్చే సహజ పరిణామం.

‘నేను’ వేరు, ‘ఇతరం’ వేరు అన్న ‘ద్వైత’ భావనే భయానికి మూలం అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. బాహ్యప్రపంచం దృష్ట్యానే కాకుండా ఈ విభజన అంతర్గతంగానూ పనిచేస్తుంది. భయపడే ‘నేను’, భయం వేరు వేరని మన భావన. నిజానికి రెండూ ఒకటే. భయపడేవాడే భయం! నిరంతర భద్రత, స్వీయ కొనసాగింపు కోసం పాకులాడే ‘నేను’ అన్న ఆలోచనలో భాగమే భయం కూడా. ఆ విభజనే లేదని, అది మనసు కల్పించే భ్రాంతి అన్న అవగాహనతోనే సంఘర్షణకు తెర పడుతుంది. భయం అంతమవుతుంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.
  • దర్శనకళ ‘దర్శనం’ అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నా, అంతరార్థం చాలామందికి బోధపడని పదమది. ఉదాహరణకు ‘మీరు దేవుణ్ని చూశారా’ అనే ప్రశ్న ఎదురైతే, మనలో చాలామందిమి బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం.