Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🇮🇳 National Jan 3, 10:12 PM
ప్రకృతి హెచ్చరిస్తోంది... వింటున్నారా? భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం ఏడాదికేడాది ఉద్ధృతమవుతోంది. నిరుడు జనవరి నుంచి నవంబరు వరకు 334 రోజులు ఉంటే, వాటిలో 331 రోజులపాటు దేశంలో ఎక్కడో ఒకచోట తుపానులు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వంటివి ఎక్కువగా సంభవించాయి.
Eenadu Jan 3, 10:12 PM
తాగునీరే గరళమై... జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. ఊరికే జబ్బుపడకూడదంటే జనావాసాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ఉండటంతో పాటు ప్రతిఒక్కరూ సురక్షితమైన తాగునీటికి నోచుకోవాలి. ఈ రెండూ కరవైన చోట రోగాలు విజృంభించి అకాల మరణాలకు మూలమవుతాయి.
Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
స్థాయి పెంచారు సరే.. హెచ్‌ఎంలు ఏరి? పదో తరగతి వరకు బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో (హైస్కూళ్లలో) ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)ల పాత్ర అత్యంత కీలకం. పాఠశాలల అభివృద్ధి.. విద్యార్థుల ప్రగతి.. ఉత్తమ ఫలితాల సాధన వంటివాటికి హెచ్‌ఎంల అవసరం ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు.. గత దశాబ్దకాలంగా రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు మంజూరు కాలేదు.
Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల్లో రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున నియమించింది.
Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
ట్రైబ్యునల్‌ తీర్పు తర్వాతే.. ‘పాలమూరు-రంగారెడ్డి’ డీపీఆర్‌ పరిశీలన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు తర్వాతే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను పరిశీలించగలమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.
Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
మూసీపై ముందుకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశ అంచనాలను మార్చి 31 నాటికి ఖరారు చేసి, ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మొదటిదశలో గండిపేట, హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపడతామని చెప్పారు.
Eenadu 🌍 International Jan 3, 10:12 PM
తెలుగు వెలుగుల వేడుక మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది.
Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
ఏప్రిల్‌లో ‘వీబీ జీ రామ్‌ జీ’! ఈ ఏడాది మార్చి వరకు పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నారు.
Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
జల అంశాలపై కేంద్ర కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల అంశాలను చర్చించి పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
అర్జీ ఆగొద్దు దీర్ఘకాలంగా భూ వివాదాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో రీసర్వే చేసిన వైకాపా ప్రభుత్వం.. రైతుల భూములను కబ్జా చేసే కుట్రతో అనేక అవకతవకలకు పాల్పడింది.
Eenadu Jan 3, 10:12 PM
Kaamya Karthikeyan: ఇక ఉత్తర ధ్రువమే మిగిలింది!ఎక్స్‌ప్లోరర్స్‌ గ్రాండ్‌స్లామ్‌.. ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన శిఖరాలు అధిరోహించడంతో పాటు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు చేరుకోవడంతో పూర్తయ్యే సాహస యాత్ర ఇది. ఈ ఘనతకు అడుగు దూరంలో నిలిచింది 18 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌.
Eenadu Jan 3, 10:12 PM
మనకి ఎమోషనల్‌ కంట్రోల్‌ అవసరం బాసూ!కోపం వస్తే వెంటనే కోప్పడతాం. ఎవరైనా కోప్పడితే దాని గురించి ఆలోచిస్తూ ఏడ్చేస్తాం. ఏదైనా మనకు నచ్చని విషయం జరిగినప్పుడు బాధ పడతాం. ఇలా ప్రతి భావోద్వేగాన్ని ప్రదర్శించడం సహజం. కానీ, ప్రస్తుత కాలంలో మనుషులకు సహనం ఉండట్లేదు. భావోద్వేగాలను అవసరమైన దానికన్నా ఎక్కువగా చూపిస్తున్నారు.
Eenadu 💼 Business Jan 3, 10:12 PM
‘నెలకు ₹21 వేలు సంపాదన’.. గిగ్‌ మోడల్‌ను వెనకేసుకొచ్చిన దీపిందర్‌ గోయల్‌ Deepinder Goyal on Gig work model: జొమాటో, బ్లింకిట్‌ సంస్థల వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) గిగ్‌ వర్క్‌ మోడల్‌ను మరోసారి వెనకేసుకొచ్చారు.
Eenadu 💼 Business Jan 3, 10:12 PM
ఈవీ బ్యాటరీలకు ఆధార్‌ తరహా నంబర్.. దేనికంటే?Aadhaar like number for EV batteries: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ నంబర్ లాంటి విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
తిలక్ వర్మ సెంచరీ.. ఎట్టకేలకు బోణీ కొట్టిన హైదరాబాద్‌ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదురైన తర్వాత శనివారం ఛండీగడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
బంగ్లాదేశ్‌ టూర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!భారత్‌, బంగ్లాదేశ్‌ (IND vs BAN) మధ్య రోజురోజుకూ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీమ్ఇండియా బంగ్లాదేశ్‌ పర్యటనను తాత్కాలికంగా నిలిపిచేయాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.
Eenadu 🎬 Entertainment Jan 3, 10:12 PM
మూకీ సినిమా ‘గాంధీ టాక్స్‌’.. ఇప్పుడు వర్కవుట్‌ అవుతుందా? పుష్పక విమానం’.. భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన ప్రయోగం. మాస్‌, కమర్షియల్‌ కథలు రాజ్యమేలుతున్న సమయంలో సింగీతం శ్రీనివాసరావు, నటుడు కమల్‌ హాసన్‌ చేసిన ప్రయోగానికి ప్రేక్షకలోకం ఫిదా అయింది.
Eenadu 🎬 Entertainment Jan 3, 10:12 PM
చంద్రబోస్‌కు రూ.10లక్షలు సంపాదించి పెట్టిన పాట ఇది! తెలుగు పాటకు ప్రపంచ యవనికపై పట్టం కట్టేలా చేసిన గేయ రచయిత చంద్రబోస్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ‘నాటు నాటు’కు ఉత్తమ గేయ రచయితగా, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి చంద్రబోస్‌ ఆస్కార్‌ను అందుకున్నారు.
Eenadu Jan 3, 10:12 PM
‘నైలాన్ మాంజా’ వల్ల ప్రమాదాలు.. ఏడబ్ల్యూసీఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నైలాన్ మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఎనిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్ల్యూసీఎస్‌) ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ బర్డ్స్’ రన్‌ను సికింద్రాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌ వద్ద నిర్వహించారు.
Eenadu Jan 3, 10:12 PM
మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి ఫులే ఆదర్శం మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి ఫులే ఆదర్శమని సర్పంచి అరిగే ధర్మతేజ పేర్కొన్నారు.