ఆ ‘నెయ్యి’.. అర్జంటుగా మానెయ్యి..

Eenadu icon
By Telangana News Desk Published : 19 Aug 2026 04:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: పాలు, వెన్న లేకుండానే భారీఎత్తున కల్తీ నెయ్యి తయారు చేసి రాజధానిలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న తీరును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్ట్రేషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (హెచ్‌-ఫాస్ట్‌), ఆహారభద్రత విభాగం సంయుక్తంగా ఇటీవల 130 తయారీ, విక్రయ కేంద్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో 36 టన్నుల కల్తీనెయ్యిని, ప్రమాదకరమైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి రాకెట్‌ నడుస్తున్న తీరును.. నగర సీపీ వీసీ సజ్జనర్‌ మంగళవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో.. అదనపు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్, జాయింట్‌ సీపీ విజయ్‌కుమార్, హెచ్‌ఫాస్ట్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్, ఇన్‌స్పెక్టర్లు రంజిత్‌కుమార్‌గౌడ్, అంజయ్య, ఎస్సైలు రమ్య, అఖిల్, శంకర్, కృష్ణలతో కలసి.. మీడియాకు వెల్లడించారు. ప్రయోగశాలల్లో పరీక్షించినా.. కల్తీ గుట్టు బయటపడకుండా నిందితులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన తెలిపారు. బ్రాండ్‌ లేని.. తక్కువ ధరకు లభించే నెయ్యిని వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని వినియోగదారులకు సీపీ సూచించారు. చుక్క కూడా పాలు వినియోగించకుండా.. కేవలం రసాయనాలు, పామాయిల్, రవ్వతో టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని డీసీపీ గైక్వాడ్‌ చెప్పారు. సీపీ మాట్లాడుతూ.. ‘‘100 శాతం ఫ్యూర్, ప్రీమియం, ఫామ్‌ఫ్రెష్, నేచురల్‌ నెయ్యి తదితర పేర్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌షాపులు, ఆయుర్వేద మందుల దుకాణాలు, కేటరింగ్‌ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యిలో 99.5 శాతం ఫ్యాట్‌ ఉండాలి. కల్తీ నెయ్యిలోనూ దాన్ని చూపేందుకు నిందితులు పామాయిల్‌ వాడుతున్నారు. ల్యాబ్‌ పరీక్షల ఆధారంగా కల్తీనెయ్యి తయారీలో రసాయనాలు వాడినట్టు నిర్ధారణ అయ్యింది. దీని ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

కల్తీని పసిగట్టే వీలు లేకుండా..

నిందితులు మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుల నుంచి మిల్క్‌క్రీమ్‌ దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి బొంబాయి రవ్వ, గంజి, పామాయిల్, వనస్పతిలను కలిపి నెయ్యి తయారు చేస్తున్నారు. వాసన కోసం.. కల్తీ అని పసిగట్టే వీలు లేకుండా బీటా-కెరోటిన్, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్, లాక్టిక్‌ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్‌ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఆవునెయ్యిగా నమ్మించేందుకు కృత్రిమ రంగును జోడిస్తున్నారు. కల్తీ నెయ్యి వాడకంతో గుండెజబ్బులు, పక్షవాతం, జీర్ణక్రియ సమస్యలతోపాటు కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టీజీసేఫ్‌తో సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు నిర్వహిస్తాం. కల్తీ నెయ్యి తయారీ సమాచారం తెలిస్తే.. డయల్‌ 112, హెచ్‌ఫాస్ట్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8712661212కు సమాచారం ఇవ్వాలి’’ అని సూచించారు. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు శంషాబాద్‌ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు రానున్నాయి. ప్రస్తుతం ఒబెరాయ్‌ గ్రూపు సంస్థలతో పాటు వెంకటేశ్వర హోటల్స్‌ యాజమాన్యం హోటళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.
  • వైద్యుడి చీటీ సమగ్రంగా ఉండాల్సిందే! వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక, రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కొత్త మార్గదర్శకాలతో కూడిన ‘ప్రిస్క్రిప్షన్‌ ఆడిట్‌’ తాజాగా విడుదల చేసింది.
  • గురుకులాల పనివేళలపై వివరణివ్వండి: హైకోర్టు తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనివేళల మార్పుతోపాటు ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడంపై వివరణివ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
  • నవంబరు 19 నుంచి ‘యువ వికాసం’ సాయం రాజీవ్‌ యువ వికాసం పథకం తొలి విడతగా నవంబరు 19 నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
  • తెలంగాణతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలి రాష్ట్రంతో ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ కొనసాగిస్తున్న అనుబంధాన్ని భవిష్యత్‌లో మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ను కోరారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో మంగళవారం ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
  • 2 వేల ఏళ్లనాటి టెర్రకోట డాబర్‌.. నల్గొండ జిల్లాలో లభ్యం శాతవాహనుల పూర్వకాలానికి చెందిన టెర్రకోట డాబర్‌ (తాపీలాంటి పరికరం)ను నల్గొండ జిల్లా అప్పాజిపేటలో తాజాగా గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌ మంగళవారం వెల్లడించారు.
  • నైతిక విలువలతోనే వ్యాపారంలో దీర్ఘకాలం రాణింపు వ్యాపార రంగంలో రాణించాలంటే కఠోర శ్రమ, సరైన ఆలోచనా విధానం, లక్ష్యంపై స్పష్టత కీలకమని మార్గదర్శి చిట్‌ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ అన్నారు.
  • తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 3.46 లక్షల గ్రామీణ ఇళ్లు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కొత్తగా 3,46,544 ఇళ్లు మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 2,25,788, తెలంగాణకు 1,20,756 ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు.
  • శాంతా శ్రీరాం కేసులో ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత హైదరాబాద్‌ లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదం కేసులో ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.
  • కేంద్ర ప్రకటనపై రాష్ట్రాలు స్పందించాలి: అసదుద్దీన్‌ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనను ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు.
  • రేపు నగరానికి ఉపరాష్ట్రపతి: సీఎస్‌ పరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 17న హైదరాబాద్‌ నగరంలో పర్యటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరం తెలుసుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరం యువత (జెన్‌జీ) తెలుసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.
  • న్యాయమూర్తి విచక్షణను ఏఐ భర్తీ చేయలేదు కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా దూసుకుపోతున్నా..న్యాయమూర్తి విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది భర్తీ చేయలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు.
  • పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల ఎస్సై(ప్రస్తుతం డీఎస్పీ)లకు డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
  • ఆర్‌సీఐ డైరెక్టర్‌గా తెలుగుతేజం డా.పి.శ్రీహరి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త డాక్టర్‌ పి.శ్రీహరి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని మండవల్లిలో ఆయన జన్మించారు.
  • ‘స్థానికత’పై హైకోర్టు తీర్పు సబబే ఒక అభ్యర్థి 7 నుంచి 10వ తరగతితోపాటు ఇంజినీరింగ్‌ కోర్సు రాష్ట్రంలోనే చదివినప్పటికీ.. 1 నుంచి 7వ తరగతి మధ్య వరుసగా నాలుగేళ్లు చదవలేదన్న కారణంతో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి స్థానికేతరుడిగా ప్రకటించడం కుదరదన్న హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ టీజీపీఎస్సీ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • నామమాత్రంగా గల్ఫ్‌ సలహా కమిటీ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గల్ఫ్‌ సలహా కమిటీ నామమాత్రంగా మారింది.
  • దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం చిల్లర ద్రవ్యోల్బణంలో ఆగస్టులో దేశవ్యాప్తంగా సగటున   4.82% ద్రవ్యోల్బణం నమోదు కాగా..తెలంగాణ 6.27%తో అగ్రస్థానంలో ఉంది.
  • మియాపూర్‌ భూములు స్వాధీనం చేయాలన్న పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం హైదరాబాద్‌ మియాపూర్‌ గ్రామ పరిధిలో 159 సర్వే నంబర్లలోని జాగీర్దారీ భూములను తమకు అప్పగించాలని 1976లో బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని కోరుతూ 76 మంది వ్యక్తులు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలను సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి.. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సన్మానం పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయనకు ఘనస్వాగతం పలికారు.