క్లిక్కుల్లో దృశ్య కావ్యం

- A
- A+
- A++
ఒకప్పుడు ఫొటో అంటే.. అరుదైన అద్భుతం. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక... తినే తిండి.. తిరిగే ఊరు.. కొనే చొక్కా.. కలిసే మనిషి ఇలా ప్రతి క్షణం ఫొటోగా మారిపోతోంది. ఈ క్లిక్కుల ట్రాఫిక్‌లో ప్రతిదీ కావ్యం కాదు. సంధ్యాస్తమయ సమయాల్లో అందాలను బంధించడానికి, శ్రామికుల శ్రమ సౌందర్యాన్ని కళ్లకు కట్టడానికి, రెప్పపాటులో జారిపోయే జీవవైవిధ్యాలను ఒడిసిపట్టుకోవడానికి ఎంతో నిరీక్షణ, తపన కావాలి. అందుకే ఫొటోలు ఎంత సులువైపోయినా.. కొన్నే అద్భుతాలవుతాయి. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘ఈనాడు’ బంధించిన అలాంటి కొన్ని చిత్రాల సమర్పణ.

చీకట్లు తొలగుతూ తెలవారుతున్న సమయంలో.. పాలనురగ లాంటి కెరటాలు తీరాన్ని తాకుతున్న వేళ సముద్రాన్ని తాబేలు ముద్దాడుతున్నట్లున్న ఈ సుందర దృశ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక సమీప సాగర తీరంలోనిది. అప్పుడే పుట్టిన ఆలివ్‌రిడ్లే తాబేలు పిల్ల తన ప్రపంచమైన సముద్రంలోకి వెళ్తున్నప్పుడు కెమెరాకు పని చెప్పగా.. ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

ఆహారం కోసం పక్షులు పడే శ్రమ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు సమీపంలోని చెరువులో తీసిన ఈ చిత్రం ఆ కోవలోనిదే.
1. కొంగజాతికి చెందిన పక్షి చెరువులో అమాంతం మునిగిపోయింది.
2. అడుగున ఉన్న చేపను చటుక్కున నోట కరుచుకుంది.
3. తన గూటికి ఎగిరిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ వేటను ‘ఈనాడు’ కెమెరాలో బంధించింది.

ప్రకృతిని మనం పరిశీలించాలే గాని ఒక్కో జీవిది ఒక్కో వైవిధ్యం. ఇక్కడ నేలపై కర్రపుల్లలను మోస్తూ పాకుతూ, గోడకు అంటిపెట్టుకుని, చెట్టుకు అతుక్కుని కనిపిస్తున్న ఈ జీవి పేరు కర్రపురుగు/కొమ్మపురుగు. శత్రువులకు కనపడకుండా, పక్షులు, బల్లులు నుంచి తనను తాను కర్రపుల్లల రక్షణతో కాపాడుకుంటుందని.. చెట్లు, పొదలు, ఆకుల మధ్య జీవించే ఇవి శాకాహార జీవులని, చెట్ల ఆకులను తింటూ బతుకుతాయని కానూరుకు చెందిన బయాలజీ నిపుణులు ఎన్.గోకర్ణేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో ఇవి కనిపించాయి.


చేతిలో పెద్ద కెమెరా పట్టుకుని కనిపిస్తున్న ఈయన పేరు గంగుల ఎల్లేశ్వరరావు. కడప నగరానికి చెందిన ఈయన ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేసి, ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. ఫొటోగ్రఫీపై మక్కువతో 1920 నాటి వాగేశ్వరి వంటి ప్రాచీన కెమెరా నుంచి నేటి వరకు దాదాపు 70 అరుదైన ఫిల్మ్ కెమెరాలు సేకరించారు. పాత కెమెరాలు ఇప్పటికీ పని చేస్తున్నాయని, వాటితో తీసిన చిత్రాలు ఏళ్ల పాటు భద్రంగా ఉంటాయని ఎల్లేశ్వరరావు చెప్పారు.

కరీంనగర్‌లోని పద్మానగర్ సమీపంలోని ఓ చెట్టుపై ఆడ పక్షికి నోటితో ఎర్రటి పండును తినిపిస్తూ మురిసిపోతోంది ఇండియన్ గ్రే హార్న్‌బిల్. సంతానోత్పత్తి కాలంలో ఆడ పక్షిని ఆకర్షించేందుకు మగ పక్షి ఇలా ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తుంది. ఇవి జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయి.

చిత్రంలోని గ్రే హెరాన్ పక్షిని చూస్తే... రోడ్డు దాటుదామా.. ఏ కారో రాదుగా అని ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. కానీ, అది రోడ్డు కాదు.. ఉషోదయాన సూర్యుడి లేలేత కిరణాలకు అలా కనిపిస్తున్న హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువు. అలాగే హెరాన్ రోడ్డు దాటడానికి కాదు.. దాని బ్రేక్‌ఫాస్ట్ చేప కోసం నీటిలో తీక్షణంగా చూస్తోంది.

మొండిగోడల నడుమ పెరిగిన చెట్లు, మొక్కలతో పచ్చదనం సంతరించుకుని ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ ప్రాంతం విజయవాడ నగర శివారులోని కొండపల్లి ఖిల్లా. వర్షాకాలంలో ఈ ప్రాంతం తన సహజ అందాలతో పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతులు పంచుతోంది.

పచ్చదనం పరుచుకున్న కొండ, దాన్ని మధ్యలో చీల్చుకుంటూ కింద నుంచి పై వరకు పెయింటింగ్ వేశారేమో అన్నట్లున్న మెట్లతో మది దోచేస్తున్న ఈ ప్రదేశం పురాతన బౌద్ధక్షేత్రం బొజ్జన్న కొండ. అనకాపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని శంకరం వద్ద ఇది ఉంది. క్రీ.శ. 4 నుంచి 9వ శతాబ్దాల నడుమ ఒకే కొండను రెండు అంతస్తులుగా మలచిన స్తూపాలు, బుద్ధుని విగ్రహాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ప్రతి కనుమ పండుగనాడు ఘనంగా ‘బొజ్జన్న తీర్థం’ నిర్వహిస్తారు.

తెలంగాణకు సముద్ర తీరం లేని లోటును లోయర్ మానేరు తీరుస్తోంది. కరీంనగర్ వద్ద సూర్యాస్తమయ సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోతూ బీచ్‌ను తలపిస్తోంది.

సంచార గిరిజన సముదాయాల్లో ‘మధుల బంజారా సమాజం’ ఒకటి. ఇందులోని స్త్రీలు రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి, జుట్టును తలపైకి కొప్పు కట్టుకొని విభిన్నంగా కనిపిస్తారు. వీరి జానపద గేయాలు, నృత్యాలు ఎంతో ప్రత్యేకం. సాధారణ జీవన విధానానికి దూరంగా.. పశుపోషణ, వ్యవసాయంలో శ్రమిస్తూ ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. వీరు అతితక్కువ సంఖ్యలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పలు తండాల్లో కనిపిస్తారు.

ఊయలను ఆస్వాదించాలంటే.. ముందుగా అది తెగదనే ధీమా ఏర్పడాలి. అందుకే ఈ మధ్య పార్కుల్లో ఇనుముతో చేసినవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంలోని యువతి ఊగుతున్నది మాత్రం ఆర్గానిక్ ఊయల. ఎందుకంటే ఇది తాడుతోనూ.. ఇనుముతోనూ చేసింది కాదు. అది అడ్డాకు తీగ కాండం మాత్రమే. ఈ తీగలు భారీ పరిమాణంలో దృఢంగా పెరుగుతాయి. వాటి బలమైన కాండాలు సహజంగానే ఊయల మాదిరిగా కనిపిస్తాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం బిడకన్నే గ్రామంలో ఈ కాండాన్ని ఇలా ఊయలలా కట్టారు.

ఒక చేత్తో సంసార భారం మోస్తూ.. మరో చేత్తో మాతృత్వపు బాధ్యతను తీరుస్తూ.. కరీంనగర్ వీధుల్లో చంటిబిడ్డతో తిరుగుతూ వంట పాత్రలు విక్రయిస్తున్న ఈ తల్లి.. నిజాయతీతో కూడిన కష్టానికి, సహనానికి అద్దంపడుతోంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 06:24 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
- ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
- చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
- దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
- మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
- జగన్ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
- మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రజత్‌భార్గవ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
- ప్రత్యేక నామినేషన్ కేంద్రం ఏర్పాటు పిటిషన్‌పై వాదనలు పూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సాధారణ నామినేషన్ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
- మహాచండీదేవిగా జగన్మాత దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ.. మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రామరి నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- సీతా స్వయంవర అలంకారంలో శ్రీవారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
- న్యాయవాద వృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కోర్టులో ఎలా వ్యవహరించాలి, వాదనలు ఎలా చెప్పాలనే విషయాన్ని సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు.
- ఓఎంసీ కేసులో విశ్రాంత ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో 6వ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అభియోగాలను నమోదు చేసింది.
- ‘పోలవరం’ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. ప్రాజెక్టును ఈ బృందం సందర్శించడం ఇది ఎనిమిదోసారి. బృంద సభ్యులు రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్, డి సిస్కో, హించ్‌బెర్గర్‌లతో తొలుత పోలవరం అధికారులు, అథారిటీ అధికారులు సమావేశమయ్యారు.
- పరిశ్రమల అవసరాలకు శిక్షణ.. ఉపాధికి చేయూత: మంత్రి లోకేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంపొందించడమే తమ ప్రాధాన్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
- ఎర్రబస్సు రాదన్నారు.. అదే విమానాశ్రయంలో దిగారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌బస్ ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో మాట్లాడారని అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
- జడ్పీ ఛైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్ శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ కూటమి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయనను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.