భూమిని సొంతం చేసుకోవాలనే ప్రాణాలు తీసింది

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 19 Aug 2026 09:30 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

కందనూలు, న్యూస్‌టుడే: బిజినేపల్లి మండలంలోని ఇప్పలతండాలో ఈనెల 15న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఇప్పలతండాకు చెందిన చిట్టెమ్మ మామ (భర్త తండ్రి) హర్యకు అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉందన్నారు. చిట్టెమ్మ భర్త జంపాలియా మూడు సంవత్సరాల కిందట చనిపోయాడన్నారు. ఆమెకు సంతానం లేకపోవడంతో భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె గ్రామంలో ఒంటరిగా ఉంటూ తన భాగానికి వచ్చిన భూమిని ముగ్గురు మరుదులకు కౌలుకు ఇచ్చిందన్నారు. ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో ఓ మరిది భార్య కేతావత్‌ హీరమ్మ చిట్టెమ్మను హత్య చేయడానికి పథకం రచించిందన్నారు. హీరమ్మ భర్త లక్ష్మణ్‌ అనారోగ్యంతో 15 సంవత్సరాల కిందట చనిపోయాడని, నాటి నుంచి నుంచి ఆమె పిల్లలతో ఉంటోందన్నారు. చిట్టెమ్మను చంపే పథకంలో భాగంగా ఈనెల 15న ఆమె ఇంటికి వెళ్లిన హీరమ్మ కలసి మద్యం తాగారన్నారు. తర్వాత హీరమ్మ కత్తితో చిట్టెమ్మ గొంతు కోసి ఆమె దగ్గర ఉన్న వెండి కడియాలు, కాళ్ల పట్టీలను తీసుకెళ్లి దాచిందన్నారు. ఆ తర్వాత ఈనెల 16న చిట్టెమ్మ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారన్నారు. చిట్టెమ్మ బంధువు ముడావత్‌ వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి...మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐ అశోక్‌రెడ్డి, బిజినేపల్లి ఎస్సై శంషోద్దీన్‌ పాల్గొన్నారు. 

► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 09:30 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు [ 15-10-2026] మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు మల్లాపూర్, వడియాల, దోనూరు, వసుపుల, అయ్యవారిపల్లి, వేముల, బైరంపల్లి గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
  • చేతుల శుభ్రతకూ ఓ లెక్కుంది.. [ 15-10-2026] జోగులాంబ జిల్లాలో ఓ బాలిక మట్టిలో ఆడుకుంటూ.. చేతులు శుభ్రం చేసుకోకుండా చిరుతిళ్లు తినేది. కొన్ని రోజులకు అతిసారం బారిన పడటంతో చికిత్స చేయించాల్సి వచ్చింది.
  • కోషిగుట్టను కొట్టేద్దామని పన్నాగం [ 15-10-2026] సహజ వనరులను కొందరు స్వలాభం కోసం కొల్లగొడుతుంటే.. అధికారులు కిమ్మనడం లేదు. గుట్టలు, కొండలను పిండి చేసి మట్టిని అమ్ముకుని, ప్రభుత్వ భూమిలో పాగా వేస్తున్నారు.
  • అచ్చొచ్చిన దందా.. అదే పంథా [ 15-10-2026] విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి.. భారీగా వ్యత్యాసం ఉన్న మిల్లులపై గతంలోనే కేసులు నమోదైన విషయం తెలిసిందే.
  • 24 గంటల విద్యుత్తు ఏమైంది? [ 15-10-2026] రైతులకు 24 గంటలు నిరంతర విద్యుత్తు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.
  • తూకం, తరుగు పేరిట నిలువు దోపిడీ [ 15-10-2026] వర్షాభావ పరిస్థితులు, చీడపీడలను తట్టుకొని వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే పత్తి రైతులకు తిప్పలు తప్పడంలేదు. పేట జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 1,66,447 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
  • మట్టిని ఫిల్టర్‌ చేసి.. ఇసుక దందా [ 15-10-2026] ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మట్టిని ఫిల్టర్‌ చేసి ఇసుకగా మార్చి అక్రమ దందాలకు తెరతీశారు.
  • ‘సూపర్‌ ఎల్‌నినో’పై అప్రమత్తంగా ఉండాలి [ 15-10-2026] సూపర్‌ ఎల్‌నినో పట్ల విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు.
  • ‘రాజకీయ లబ్ధికే భారాస దుష్ప్రచారం’ [ 15-10-2026] పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో భారాస నాయకులు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.
  • కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా [ 15-10-2026] అయిజ పురపాలికలో ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కౌన్సిలర్‌ శేక్షావలి ఆచారి పేర్కొన్నారు.
  • ఆసుపత్రుల్లో అడ్డగోలు వసూళ్లు! [ 15-10-2026] అనారోగ్యం అంటేనే సామాన్యులు భీతిల్లే పరిస్థితి కన్పిస్తోంది. సామాన్యుడి సంగతి దేవునికెరుక.. మధ్య తరగతి ప్రజలు సైతం బిల్లుల దెబ్బకు ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కాలంటే వెనుకంజ వేస్తున్నారు.
  • బతుకమ్మకు కష్టమొచ్చింది [ 15-10-2026] తెలంగాణ సంప్రదాయ పండగ బతుకమ్మకు పూల కొరత ఏర్పడింది. అడవుల్లో సహజంగా దొరికే తంగేడు, గునుగు, గడ్డిపూలు తదితర ప్రకృతి పూలు ఈ ఏడాది ఎక్కువగా పూయలేదు.
  • ఆశలదీపాలు ఆరిపోయాయి [ 15-10-2026] ముద్దులొలికే చిన్నారులను చూసి ఆ తల్లిదండ్రులు ముచ్చటపడేవారు. వారి అల్లరితో కుటుంబ సభ్యులు సంతోషపడేవారు. చిన్నారుల భవష్యత్తుకు ఎన్నో కలలు కన్నారు.
  • రైతులకు నష్టపరిహారం చెల్లించాలి [ 14-10-2026] తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని అచ్చంపేట సీపీఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు డిమాండ్‌ చేశారు.
  • బాటిల్‌ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల బాలుడి మృతి [ 14-10-2026] మంచినీళ్ల బాటిల్‌ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందాడు.
  • పాడితోనే ఆర్థిక అభివృద్ధి [ 14-10-2026] తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయానికి అనుబంధంగా పాడిని ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని మండల పశువైద్యాధికారి శివరాజ్ రైతులకు సూచించారు.
  • రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు: మంత్రి జూపల్లి [ 14-10-2026] రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
  • ట్యాంకర్ల ద్వారా సాగు నీటి సరఫరా [ 14-10-2026] ఎండల తీవ్రత అధికంగా ఉండటం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా వరి పొలాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
  • పత్తి షెడ్డర్ యంత్రం వినియోగంపై అవగాహన [ 14-10-2026] ఆధునిక పద్ధతులతో లాభదాయక సాగు చేయాలని శాస్త్రవేత్త డాక్టర్‌ కె.కల్యాణి అన్నారు.
  • నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే సాగు చేయండి [ 14-10-2026] ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో అన్నదాతలు నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారి రమేష్ అన్నారు.
  • దళితుల భూములు లాక్కుంటే ఊరుకోం [ 14-10-2026] రాయపురం గ్రామంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పేరిట దళిత రైతుల భూములను లాక్కునే యత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ స్పష్టం చేశారు.
  • గట్టు వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ మహాచండీ దేవి పూజలు [ 14-10-2026] మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
  • మాజీ మంత్రులకు బాలానగర్‌లో ఘన స్వాగతం [ 14-10-2026] గద్వాల జిల్లాకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లకు బుధవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరాస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
  • కన్నేసి.. కన్నమేసి [ 14-10-2026] మహబూబ్‌నగర్‌ బాలాజీ నగర్‌లో నారాయణపేటలో పనిచేసే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో వారం రోజుల కిందట చోరీ జరిగింది.
  • శస్త్రచికిత్స మినహా అన్నీ అక్కడే! [ 14-10-2026] ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో అర్హతకు మించి వైద్యసేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం జరిపిన దాడుల్లో గుర్తించారు.
  • కౌకుంట్లలో ‘బోరు’బోరు [ 14-10-2026] ఎల్‌నినో ప్రభావం  కౌకుంట్ల మండల రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటలు ఎండిపోకూడదని ఒక్కో రైతు రెండు మూడు బోర్లు తవ్వించినా వేలాది రూపాయలు ఖర్చు తప్ప ఫలితం లేకపోయింది.
  • ఆ విలయం మరువలేనిది.. గోడు పట్టనిది [ 14-10-2026] తుంగభద్ర, కృష్ణా నదుల విలయతాండవానికి అక్టోబరు 2తో పదిహేడేళ్లు గడిచాయి.
  • ఈ-వ్యర్థాలు భూమికి భారం [ 14-10-2026] విద్యార్థులకు ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణ)పై స్పష్టమైన అవగాహన కల్పించేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
  • మధుర జ్ఞాపకం.. బతుకమ్మ సంబరం [ 14-10-2026] తెలంగాణ ఆడపడుచుల మధుర జ్ఞాపకం బతుకమ్మ పండగ. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండగలో చిన్నారులు మొదలు వృద్ధుల వరకు మమేకమవుతారు.
  • మెక్కేశారు.. లెక్క తేల్చండి [ 14-10-2026] జిల్లాలో పంచాయతీల ప్రత్యేక పాలనలో 2024-25, 2025-26 రెండేళ్ల కాలంలో వివిధ రకాల పన్నుల కింద రూ.7.16 కోట్లు వసూలు చేసినట్లు ఆన్‌లైన్‌ రికార్డులు చెబుతున్నాయి.
  • ఆప‘కొండ’ తవ్వకాలే [ 14-10-2026] ప్రకృతి సంపదపై అక్రమార్కులు కన్నేశారు.రాళ్ల గుట్టల్ని తవ్వి అమ్మేస్తున్నారు.
  • ధనార్జనే ధ్యేయం.. [ 14-10-2026] మేడ్చల్‌ డిపో మద్యాన్ని నారాయణపేటలోని ఓ మద్యం దుకాణంలో విక్రయిస్తున్నారు.
  • గ్యాస్‌.. బిజినెస్‌ [ 14-10-2026] జిల్లాలో డొమెస్టిక్‌ (గృహావసరాలకు వినియోగించే) సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి.
  • ఆయన చెబితేనే ఇసుక తోడేది [ 14-10-2026] ఉమ్మడి జిల్లా ప్రజల ఇసుక అవసరాలు తీర్చేది జోగులాంబ గద్వాలనే. కానీ అక్కడ తవ్వకాలు జరగాలంటే మాత్రం ఓ నేత ప్రాపకం పొందాల్సిందే.