విద్యాధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపాలి: దీప్కే

- A
- A+
- A++

హింగోలి: విద్యా విభాగం అధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా తప్పనిసరి చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం డిమాండ్ చేశారు. పల్లెల్లో విద్యార్థుల కష్టాలు, చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే వారి దైన్యాన్ని అర్థం చేసుకునేందుకు మంత్రులు, రాజకీయ నాయకులు తమ చిన్నారులను గ్రామాల్లోని బడులకు ఒక్క రోజైనా పంపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పాఠశాలలను మెరుగుపరచండి’ పేరిట గత వారం దీప్కే ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన సొంత జిల్లా హింగోలిలోని లింబాలాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హింగోలి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది లేదని తెలిపారు. అంతకుముందు ఓ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోతున్న వీడియోను సామాజిక మాధ్యమంలో దీప్కే పోస్టు చేశారు. ఆ టీచర్‌ను మంగళవారం అధికారులు సస్పెండ్ చేశారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 09:17 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ హైకోర్టు దుస్థితి ఎలా ఉందో చూడండి: సుప్రీంకోర్టు ‘న్యాయవిద్య కళాశాలల్లో తొలి ఏడాదే విద్యార్థులకు నేర్పే న్యాయసూత్రాలివి. ఇలాంటి తీర్పులు మా వద్దకు రావడం ఇదే తొలిసారి కాదు.
- ‘నీలి డ్రమ్ము’ హత్యకేసులో ఆమెకు, ప్రియుడికి మరణశిక్ష దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీలి డ్రమ్ము’ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
- పండగ వ్యాపారాన్ని కాపాడండి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోరుతూ సాగుతున్న నిరసనోద్యమం సందర్భంగా ప్రజా నియంత్రణలపై దేశంలోని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తంజేశాయి.
- తిహాడ్ జైలుకు సీజేపీ నేతలు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు.
- రైల్వే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 బోనస్ రాబోయే దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రైల్వేలోని 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- విద్యార్థులకు అడ్డు రావొద్దు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు అడ్డు రావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ హితవు పలికారు.
- ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో, మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది.
- సంక్షిప్త వార్తలు (7) ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దాడి చేయడం సరికాదని హార్వర్డ్ విద్యావేత్తల బృందం పేరుతో విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.
- డేటా సెంటర్ల అనుమతులకు పంచ సూత్రాలు రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చే సమయంలో ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది.
- పరిహారం కోరే హక్కు ఆ కుటుంబాలన్నిటికీ ఉంది రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన భారతీయుల కుటుంబాలు పరిహారం, సహాయం కోరేందుకు ముందుకు వచ్చేలా బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.
- ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు(2023) వీడియో రికార్డుల ఫుటేజీ లభించడంలేదన్న ఎన్నికల సంఘం (ఈసీ) సమాధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- నిందితుడికి రాజ్యాంగ పదవా? హత్య కేసులో నిందితుడిగా ఉన్న వీఐపీకి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ పదవి ఇచ్చి రక్షణ కల్పించిందని, ఆ కేసులో బాధితులకు నాలుగేళ్లయినా ఇంతవరకూ న్యాయం చేయలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
- తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.
- మోదీ గుడి నిర్మించేదాకా.. రాముడు 400 ఏళ్లు గుడారంలోనే ఉన్నాడు: బిహార్ సీఎం ప్రధాని మోదీ అయోధ్యలో ఆలయం కట్టించేవరకూ శ్రీరాముడు 400 ఏళ్ల పాటు టెంట్లోనే ఉన్నాడని బిహార్ సీఎం సమ్రాట్ చౌధరీ వ్యాఖ్యానించారు.
- కనుపాప సమస్య ఉన్న వారికి బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ ఎలా? రాయితీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కి బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
- అకోయిజంను అరెస్ట్ చేయాలి: ఏబీవీపీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి తొలగింపునకు గురైన మణిపుర్ కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ బుధవారం జేఎన్‌యూ వద్ద నిరసనలు ప్రారంభించింది.
- ఫోన్ రిపేర్‌కు రూ.300 లంచం తీసుకున్న అధికారికి ఏడాది జైలు ల్యాండ్ లైన్ ఫోన్ రిపేర్ కోసం రూ.300 లంచం తీసుకున్నందుకు హైదరాబాద్‌కు చెందిన టెలికాంశాఖ అధికారిపై సీబీఐ నమోదుచేసిన కేసులో కింది కోర్టులు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.
- ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీలోని అతి పెద్ద చమురు సంస్థ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హూతీలు దాడులు చేశారు.
- పోటీ భోజనంబు.. అహహ్హ నేనే ముందు! ఈ చిత్రంలోని మహిళలంతా ఏదో వేడుకలో విందారగిస్తున్నారనుకుంటే పొరపాటే! వీరంతా రాగి ముద్దలు తినే పోటీలో పాల్గొంటున్నారు.
- సన్యాసదీక్షలో ఉన్న క్యాథలిక్ ఫాదర్ల సంపాదన కుటుంబానికి చెందదు మతపరంగా సన్యాసదీక్ష స్వీకరించిన తర్వాత క్యాథలిక్ చర్చి ఫాదర్ల సంపాదన వారి వారసులకు చెందదని, సదరు మత సంస్థకే వెళ్తుందని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది.