బీఎల్‌వోలు నోటీసులుఇచ్చేందుకు వెళ్తారని గ్యారంటీ ఏమిటి?

Eenadu icon
By Telangana News Desk Updated : 19 Aug 2026 09:18 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: సర్‌లో భాగంగా పోలింగ్‌ బూత్‌ అధికారి(బీఎల్‌వో) ఇంటికి వచ్చి నోటీసులు అందిస్తూ ఫొటో దిగే వరకు ఓటర్లలో అయోమయ పరిస్థితి అలాగే ఉండనుంది. నోటీసులు అందుకునే ఓటర్ల వివరాలను పబ్లిక్‌ డోమైన్‌లో పెట్టే ఉద్దేశం ఎన్నికల సంఘం అధికారులకు లేదు. అభ్యంతరాలు లేని జాబితాలో ఏ ఓటర్లు ఉన్నారు? అనామలీస్‌ ఓటర్లు ఎవరు? సర్‌-2002తో మ్యాపింగ్‌ చేయని ఓటర్లు ఎవరు అనే విషయాలు రాజకీయ పార్టీలకు కూడా తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. నోటీసు వస్తేనే తాను ఏ జాబితాలో ఉన్నదీ ఓటరుకు తెలుస్తుంది. నెల రోజుల్లో నోటీసు రాకుంటే ఓటు సరిగ్గా ఉన్నట్టు. ఈ పరిస్థితులపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నోటీసులు అందుకునే ఓటర్ల వివరాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారిని కలిసి ప్రత్యేక జాబితా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల అధికారులు ఈ విషయం తమ చేతిలో ఏమీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై లేఖ రాస్తామని చెప్పినట్లు తెలిసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది వివరాలతో ముసాయిదా జాబితాను రూపొందించి ఎన్నికల అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచారు. జిల్లాల్లోని ఈఆర్వో, ఏఈఆర్వో, పోలింగ్‌బూత్‌ల వద్ద కూడా ప్రదర్శించారు. 

నోటీసులు రాకుంటే పరిస్థితి ఎలా? 

సర్‌ సర్వేలో పలువురు బీఎల్‌వోలు ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్‌ పత్రాలను అందించలేదు. ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్లాలన్న నిబంధన చాలా చోట్ల అమలు కాలేదు. వాటిని వారు తమ వద్దే ఉంచుకుని ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చారని పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన ఓటర్ల వద్దకు బీఎల్‌వోలు వెళ్లకపోతే పరిస్థితి ఏంటనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. సోమవారం ఎన్నికల అధికారులు తెలియజేసిన ప్రకారం మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉంది. సర్వే సమయంలో నెలకొన్న పరిస్థితే ఇప్పుడూ ఏర్పడితే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యే ప్రమాదరం ఉందని వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎల్‌వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇస్తారన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 వెబ్‌సైట్‌లో ఏఎస్‌డీడీ ఓటర్ల జాబితా 

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో రాష్ట్రంలో ఏఎస్‌డీడీ(ఆచూకి లభించని వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మృతి చెందినవారు, డూప్లికేట్‌) ఓటర్ల జాబితా ఆప్షన్‌ను మంగళవారం నుంచి అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలో ఉన్న మొత్తం 73.39 లక్షల మంది ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించగా ఆ వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హులైన ఓటర్లు ఉంటే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయిస్తామని రాజకీయ పార్టీలు అంటున్నాయి. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 04:32 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆపద గుర్తిస్తుంది.. అర క్షణంలో స్పందిస్తుంది! ‘ఎవరైనా అత్యవసర సాయం కోసం ఫోన్‌ చేస్తే కాల్‌సెంటర్‌కు కాల్‌ వెళ్తుంది. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌(ఐవీఆర్‌ఎస్‌) బటన్లను నొక్కిన అనంతరం అక్కడి కాల్‌టేకర్‌ స్పందిస్తారు..
  • కొనకుండా ఇచ్చేవాళ్లు దొరి‘కారు’ కారు కొనకుండానే సొంతమయ్యే మార్గం ఉండగా ఇక దిగులే అవసరం లేదు. కొత్త కార్లను పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో ఇస్తున్నాయి.
  • రయ్‌ రయ్‌ వద్దోయ్‌.. లైసెన్స్‌ రాదోయ్‌! కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు బైక్‌ ఇచ్చి కిరాణా దుకాణంలో పాలో, పప్పో తీసుకురా అని పంపుతుంటారు. ఇంటి దగ్గరే కదా పిల్లాడికి బండి అలవాటైనట్లుంటుందని కొందరనుకుంటే.. మరికొందరు అప్పుడే మా వాడు బైక్‌ నడిపేస్తున్నాడని ముచ్చట పడుతుంటారు.
  • ‘పాము..’ ప్రాణ సంకటం కాకుండా..! ఇందౌర్‌లో ఒకరి ఇంట్లో టాయిలెట్‌ కమోడ్‌ నుంచి పాము బయటకు వచ్చింది... హైదరాబాద్‌ కందికల్‌గేట్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంటి వెనక ఖాళీ స్థలంలో ఏకంగా నాలుగు పాములు కనిపించాయి… కొన్నిసార్లయితే కార్లు, బైక్‌ల హ్యాండిళ్లలో దూరి హడలెత్తిస్తుంటాయి.
  • ఇవి జెన్‌జీలు మెచ్చిన రుచులు! నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి.
  • దయచేసి వినండి... మీ ప్రయాణం సురక్షితం కావాలంటే.. రైలు ప్రయాణం వేగవంతమైంది... సౌకర్యాలు పెరిగాయి... అదే సమయంలో ఆపదలూ పెరిగాయి... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలూ ముంచుకొస్తాయి... ఒక్క క్షణం నిర్లక్ష్యం...
  • పులి భయం... కూలీలకు రైతుల కాపలా ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి, సికినాపూర్‌ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
  • ‘అధిక’ధరకు కరెంటు కొంటారా! సాధారణంగా ఎవరైనా ఏదైనా వీలయినంత తక్కువ ధరకే కొనాలని చూస్తారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ జెన్‌కో చేపడుతున్న విద్యుత్‌ కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
  • కంటికి రెప్పలా కాపాడుకునేలా! ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు లక్ష్యం తగ్గగా.. ప్రస్తుతమున్న పంటలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
  • సభ జరగకుండా ఆ రెండు పార్టీలు నాటకం: ఏలేటి శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీ సేవలు అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.
  • సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని శాసన మండలి భారాస ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసమే మండలిని నడిపినట్లు ఉందని ఆరోపించారు.
  • ఆ రెండు పార్టీలు.. ఆశలను వమ్ము చేశాయి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా గద్దెనెక్కిన భారాస, ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల ఆశలను వమ్ము చేశాయని జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు విమర్శించారు.
  • ఆపరేషన్‌ పోలోతోనే భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనం ఆపరేషన్‌ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్‌ నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధ ట్యాంక్‌ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
  • ఉమ్మడి కుటుంబం ఒక బలమైన సామాజిక వ్యవస్థ ఉమ్మడి కుటుంబం అనేది బలమైన సామాజిక వ్యవస్థ అని.. ఆ విలువలను కొత్త తరానికి అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
  • ఉదయం కడగళ్లు.. మధ్యాహ్నం పరవళ్లు సూర్యాపేట జిల్లాలోని నూతనకల్‌ మండలంలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది.  దీంతో పాలేరు వాగు పొంగిపొర్లి.. వెంకేపల్లి, తాళ్లసింగారం, యడవెల్లిలోని చెక్‌డ్యాంలు వరదనీటితో కళకళలాడాయి.
  • న్యాయం అందించడంలో వేగం పెరగాలి న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే కాకుండా సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌ పిలుపునిచ్చారు.
  • బంబార వేరుసెనగ సాగుకు తెలంగాణ అనుకూలం ఆఫ్రికా దేశానికి చెందిన బంబార రకం వేరుసెనగ సాగుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని కిర్క్‌హౌస్‌ ట్రస్టు, ఇంగ్లాండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డా.క్లాడియా కానలెన్‌ హోల్జైస్, దిల్లీ (ఎన్‌బీపీజీఆర్‌) ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు డా.కుల్దిప్‌ త్రిపాఠి పేర్కొన్నారు.
  • 17న తిమ్మాపూర్‌లో ‘సేవా అభియాన్‌’: కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ 25 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘సేవా అభియాన్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • పశుసంపదకు బ్రాండింగ్‌ ముర్రా, గిర్, సాహివాల్, రెడ్‌ సింధీ, ఒంగోలు, పుంగనూరు దేశంలో పేరొందిన ఆవుజాతులు. ముర్రా, జాఫరాబాదీ పేరొందిన గేదె జాతులు. ఇప్పుడీ జాబితాలో తెలంగాణ పశుసంపద కూడా చేరనుంది.