ఉచ్చు బిగించాడు.. ఉసురు తీశాడు

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 19 Aug 2026 12:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, రాజమహేంద్రవరం: కాకినాడకు చెందిన రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు ప్రస్తుతం కీలక మలుపులు తిరిగింది. 45 రోజుల క్రితం అనారోగ్యంతో నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి చెందారని అంతా భావించినా.. అతనిపై విష ప్రయోగం జరిగిందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భర్తకు సాధిక్‌ విష పదార్థమిచ్చి చంపేశాడని స్వయంగా భార్య సౌజన్య రాసిన లేఖ లభ్యమైంది. అటు నూకరాజు రాసిన మరణ వాంగ్మూలం, ఇటు ప్రాణాలతో బయటపడ్డ పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, మరోవైపు సౌజన్య లేఖ సాధిక్‌ కిరాతకాన్ని బయటపెట్టాయి. రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు, కాకినాడ అధికారులకు సమాచారమిచ్చి సాధిక్‌ నివాసానికి వెళ్లగా అప్పటికే అతను పరారైనట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అతని గురించి గాలిస్తున్నాయి.

ఏఈ నూకరాజు అందరితో సౌమ్యంగా ఉండే వ్యక్తి. భార్య మీనా, కుమారుడు, కుమార్తె, అల్లుడు, మనుమడితో ప్రశాంతంగా సాగిపోయే జీవనం. ఆ కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా కకావికలమైంది. కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, జులై 2న అల్లుడు మృతి, ఇప్పుడు చివరకు ఆ కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకడం.. వరుస పరిణామాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక్క పదేళ్ల చిన్నారి మాత్రమే మిగిలాడు. మరోవైపు నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్యల కోసం నదిలో విస్తృతంగా గాలించినా మంగళవారం వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్డీఆర్‌ఎఫ్, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది ఓ వైపు, డ్రోన్లతో పోలీసులు మరోవైపు గాలిస్తున్నారు.

నూకరాజు సోదరుడు, సోదరితోపాటు, వారి పిల్లలు, వియ్యంకుడు, ఇతర బంధువులంతా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇంత కష్టాన్ని ఎలా భరించారని, కనీసం మాటవరుసకైనా తమకు చెప్పలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. 

  • నూకరాజు మృతదేహం లభించినా, మిగతా ఇద్దరు ఆచూకీ తెలియకపోవడంతో స్థానికంగా హోటళ్లలో ఉంటూ ఏ క్షణాన ఏ కబురు వినాల్సి వస్తోందనని ఆందోళన చెందుతున్నారు. 
  • నూకరాజు కారులో వదిలేసిన చరవాణుల్లోని కాల్‌డేటాను విశ్లేషిస్తే సాధిక్‌ కుట్రలు, ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశాలపై స్పష్టత వస్తుందని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

ఆకుటుంబంలో నూకరాజు మినహా మరో పెద్ద దిక్కు లేకపోవడం, పరువు కోసం బతికేవారు కావడాన్ని నిందితుడు సాధిక్‌ ఆసరాగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. బాలుడు షూటింగ్‌లో శిక్షణకు చేర్చినప్పుడు, సౌజన్యతో ఏర్పడిన పరిచయాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నట్లు తెలుస్తోంది. జగదీశ్వరరెడ్డి మృతి చెందిన తరువాత సాధిక్‌ వేధింపులు మరింత పెరిగాయి. ఆస్తుల స్వాధీనంతో పాటు, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ కుటుంబం అల్లాడిపోయి మృత్యువే శరణ్యమనుకుంది. 

► Read latest East godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 04:04 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి [ 15-10-2026] కాట్రేనికోనలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
  • కార్తిక వేడుక.. యాప్‌తో తేలిక [ 15-10-2026] విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సందర్భంగా సమగ్ర సమాచారం, సేవలను భక్తులకు అందించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా-2026 పేరుతో యాప్‌లో దుర్గమ్మ క్షేత్రానికి వచ్చే భక్తజనం తేలికగా వినియోగించుకునేలా దీన్ని రూపొందించారు.
  • నిబంధనలకు నీళ్లొదిలేశారు!! [ 15-10-2026] స్వచ్ఛమైనా.. నాణ్యమైన తాగునీరు అందిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చెబుతున్న మాటలు నీటి మూటలవుతున్నాయి. పలు పట్టణాల్లోని పురపాలక సంఘాలు రక్షిత నీటి పథకాల నుంచి కుళాయిల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంలో విఫలమవుతున్నాయి.
  • మోగిన స్థానిక నగారా..! [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది. తొలుత పురపాలక ఎన్నికలకు సంబంధించి 16న నోటిఫికేషన్‌ ఇచ్చి ఆ రోజు నుంచే నిర్దేశిత కేంద్రాల్లో నామపత్రాలు (నామినేషన్లు) స్వీకరిస్తారు.
  • ఎడాపెడా బాదేస్తున్నారు.. [ 15-10-2026] ఇసుక స్టాక్‌ పాయింట్లపై అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఉచితం మాటున పలువురు దర్జాగా దోచేస్తున్నారు. లోడింగ్, ఇతరŸ ఛార్జీల పేరిట ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
  • మెరుగైన వైద్య సేవలే లక్ష్యం [ 15-10-2026] అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల వద్ద ఉద్యోగులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ కె.రాంబాబు హెచ్చరించారు.
  • నిధులున్నా నిర్లక్ష్యమే.. [ 15-10-2026] కాకినాడ-పోలవరం జిల్లాలను అనుసంధానించే ఏలేశ్వరం మండలం తూర్పులక్ష్మీపురం నుంచి జె.అన్నవరం ప్రధాన ర.భ.శాఖ రహదారి ప్రమాదకరంగా మారింది. దీని అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చించినా.. అధికారుల తీరుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
  • జడ్పీటీసీ.. ఆ స్థానాలపైనే గురి [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నేపథ్యంలో మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
  • మండల పీఠాలు.. మహిళలే రాణులు [ 15-10-2026] మండల ప్రథమ పౌరులుగా అభివృద్ధిలో కీలక పాత్రం పోషించే మండల పరిషత్‌ అధ్యక్షులుగా జిల్లాలో సగానికిపైగా మహిళలకే కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి రిజర్వేషన్లు ఖరారు చేశారు.
  • ప్రాదేశిక పోరులో జనరల్‌ స్థానాలే ఎక్కువ..! [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పురపాలికలు మొదలుకొని ఎంపీటీసీ స్థానాల వరకు  సోమవారం నుంచి రిజర్వేషన్లను ఖరారు చేస్తు గెజిట్‌ విడుదల చేస్తున్నారు. పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయింది.
  • గడువు ముగిస్తే మాకేంటి..? [ 15-10-2026] గడువు ముగిస్తే మాకేంటి.. అన్న చందంగా ఉంది జిల్లాలోని కొందరు సీఎంఆర్‌ మిల్లర్ల వ్యవహార శైలి. రబీలో ఏప్రిల్, మే నెలల్లో పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని మరపట్టించి బియ్యం రూపంలో ఇవ్వడానికి సీఎంఆర్‌ మిల్లర్లకు సరకును చేరవేశారు.
  • ఆగని అక్రమం.. అడగని యంత్రాంగం [ 15-10-2026] గోదావరి నదీపాయల్లోంచి అక్రమంగా ఇసుకను తవ్వి పడవల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలోకి ఎగుమతి చేసి పట్టపగలే తరలించేస్తున్నారు. నిత్యం నిరాటంకంగా సాగుతున్న ఇసుకదందాపై అధికారులు ఉదాసీనంగా ఉండడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
  • నిర్ణయాత్మక శక్తిగా ఆమె [ 15-10-2026] జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే పురపాలక ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్‌ విభాగాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆశావహులు టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
  • తాజా మాజీలకు చుక్కెదురు [ 15-10-2026] నగర పంచాయతీలో వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎవరు (సామాజిక వర్గం) ఎక్కడ పోటీ చేయాలనేదానిపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు ఆశావహులు కొన్ని వార్డులను ఎంపిక చేసుకుని అవి తమకే రిజర్వు అవుతాయని భావించి ముందు...
  • అనుమతులు లేకుండా బాణసంచా తరలింపు [ 15-10-2026] అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసి కంటైనర్‌లో తీసుకొచ్చిన రూ.10 లక్షల విలువైన బాణసంచాను విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని శివకాశీలో ఉన్న బాలాజీ క్రాకర్స్‌ అనే సంస్థ నుంచి విజయవాడకు..
  • కువైట్‌లో చిక్కుకున్న మహిళ.. మంత్రి చొరవతో స్వదేశానికి [ 14-10-2026] కడ వరకు తోడుంటాడునుకున్న భర్త ఇక లేరనే చేదు నిజం.. వేల మైళ్ల దూరంలో విదేశీ గడ్డపై చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సహాయత.. స్వదేశానికి వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్న యజమానులు.
  • మనసున్న మా‘రాజు’ [ 14-10-2026] నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు (ఏవీఎస్‌ రాజు) (89) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూయడంతో స్వగ్రామమైన అంతర్వేదిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
  • సుద్దకొండపై పెద్దపులి.. [ 14-10-2026] ఏడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి మంగళవారం గోపాలపురం మండలం పరిధిలోని నందిగూడెం కరగపాడు మధ్య ఉన్న సుద్దకొండ అటవీ ప్రాంతంలో నక్కినట్లు సమాచారం.
  • డబ్బు కోసమే బాలుడి అపహరణ [ 14-10-2026] డబ్బుకోసం ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు పన్నిన కుట్రను అనపర్తి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
  • సొంతింటి కలపై.. ధరాఘాతం [ 14-10-2026] ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో భవన నిర్మాణ గుత్తేదారుడు కొన్నాళ్ల క్రితం చదరపు అడుగుల లెక్కన సామగ్రితో కలిపి ఇంటి నిర్మాణానికి యజమానితో ఒప్పదం చేసుకున్నాడు. ప్రస్తుతం ధరలు అమాంతం పెరగడంతో సామగ్రిని యజమానినే కొనుగోలు చేసుకోమని, తయకు కూలి మాత్రం ఇవ్వాలని కోరాడు.
  • ఆశ.. నిరాశ [ 14-10-2026] పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో స్థానిక రాజకీయాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఏర్పడింది.
  • పుర పోరులో ఎవరు.. ఎక్కడ..? [ 14-10-2026] పురపాలికలకు రిజర్వేషన్లు సోమవారమే ఖరారయ్యాయి. ఇక అభ్యర్థుల ఎంపికే మిగిలింది. జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార కూటమిలో పార్టీల నుంచి ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయమై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.
  • జడ్పీ పీఠం.. మహిళకే..! [ 14-10-2026] పుర పోరు ముగిసిన వెంటనే పరిషత్తు ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీ, మండల పరిషత్తులకు రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేశారు. కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌ బీసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.
  • బరిలో ఆ ఇద్దరు..! [ 14-10-2026] రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో ఉంటామని దాదాపు నెల రోజులుగా కొందరు నాయకులు అనేక మందిని కలుస్తూ మద్దతు కూడగట్టుకుని..
  • ‘స్మార్ట్‌’ చిక్కులు! [ 14-10-2026] వేమగిరికి చెందిన ఓ మహిళ గతంలో కులధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. తాజాగా మరోసారి తీసుకోడానికి స్వర్ణ గ్రామ కార్యాలయానికి వెళ్లారు. ఒకసారి తీసుకుంటే మళ్లీ ఇవ్వలేమని మనమిత్ర యాప్‌ ద్వారా తీసుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు.
  • ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌ [ 14-10-2026] ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి కూటమి ప్రభుత్వం మంగళవారం రాత్రి షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
  • తొలి జడ్పీ పీఠం అతివకే [ 14-10-2026] జిల్లాల పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లా నుంచి జిల్లాపరిషత్‌ను విడదీస్తూ... కొత్త జిల్లాలవారీగా జడ్పీలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.