అలాంటి చర్చలు అనవసరం: దేవదత్ పడిక్కల్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: భారత్ తరఫున టెస్టుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ సెంచరీ కొట్టాడు. ఆ ఘనతను సాధించిన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal). శ్రీలంకతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. సాయి సుదర్శన్ గైర్హాజరీలో వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లోనూ పడిక్కల్ శతకంతో మెరిశాడు. దీంతో మరో అద్భుతమైన వన్‌డౌన్ ప్లేయర్ దొరికాడని అభిమానులు పోల్చడం మొదలు పెట్టారు. అయితే, తాను ఇలాంటి రేస్‌కు దూరంగా ఉంటానని.. అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి సిద్ధమని పడిక్కల్ స్పష్టం చేశాడు.
‘‘మూడో స్థానం నాకే సుదీర్ఘం కాలం వచ్చేసినట్లు బయట చాలా చర్చ సాగుతోంది. కానీ, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. ఎప్పుడు అవకాశం వచ్చినా సిద్ధంగా ఉంటా. ఎక్కడ ఆడమన్నా ఓకే. అంతేకానీ, ఎంపిక గురించి నాకెలాంటి ఆందోళన లేదు. పోటీ తీవ్రమైన వేళ ఇక్కడ ఆటే కొలమానం. మనం బాగా ఆడకపోతే జట్టులో కొనసాగడం కష్టం. క్రీడల్లోనే కాదు.. ఉద్యోగంలోనూ అంతే. సరైన ప్రదర్శన ఇవ్వకపోతే అవకాశాలు రావు. ఛాన్స్ వచ్చినప్పుడు పరుగులు చేసేందుకు వందశాతం ప్రయత్నిస్తా. అలా చేస్తే మరిన్ని మ్యాచులు ఆడొచ్చని తెలుసు’’ అని పడిక్కల్ (Padikkal) తెలిపాడు.
- అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం
శ్రీలంకతో మొదటి టెస్టులో (IND vs SL) దేవదత్ పడిక్కల్ 167 పరుగులు, 44 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేయడంలో అతడిదే కీలక పాత్ర. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని మరీ పరుగులు రాబట్టడంతో మాజీల నుంచి ప్రశంసలు అందుకొన్నాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 08:40 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- భారత్ VS విండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ నెగ్గి బౌలింగ్‌ను ఎంచుకున్న భారత్.. విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతోంది. ఆ మ్యాచ్ ఫొటోలు మీకోసం..
- భారత్ - విండీస్ టీ20 మ్యాచ్.. సందడిగా ఉప్పల్ స్టేడియం ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ వేదికగా భారత్, విండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. ఆ ఫొటోలు మీ కోసం..
- విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
- నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ దూసుకొచ్చాడు.
- ఆ టోర్నమెంట్లో అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్ ధావన్ Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనధికారికంగా వాడుకోవడాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
- అభిషేక్ ఎఫెక్ట్.. సంజుపై ఒత్తిడి: పుజారా కీలక వ్యాఖ్యలు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఔట్ అవడంపై మాజీ క్రికెటర్ పుజారా (Cheteshwar Pujara) స్పందించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శాంసన్ మరికొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
- కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే.. రోహిత్ మంచి లీడర్: ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ సమిత్ పటేల్ (Samit Patel) ప్రశంసించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తాడని, నాయకుడిగానూ అతడు ఎంతో ప్రతిభావంతుడని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్ఇండియా తహతహలాడుతుంటే..
- ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్ గిల్.. భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు (సెప్టెంబర్ నెల) సాధించారు.
- ఆరేసిన తనయ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్ త్యాగరాజన్ (6/52) విజృంభించడంతో గ్రూప్-బి ఎలీట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.
- దిల్లీ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. మంగళవారం అతడు దిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
- సింధు, లక్ష్య ఔట్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. ఆమె తొలి రౌండే దాటలేకపోయింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 21-13, 23-25, 19-21తో యోనెలి (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
- రాజ్‌పుతానా ఘనవిజయం ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ అదిరే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు 6-0తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది.
- పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.
- క్రిషన్ బహదూర్ పునరాగమనం గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్ భారత హాకీ జట్టులో పునరాగమనం చేశాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు.
- సంక్షిప్త వార్తలు (3) సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు భంగపాటు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పేసర్ హేజిల్‌వుడ్ (6/49) ధాటికి కుదేలైన సఫారీ జట్టు 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
- ‘లింక్డిన్’లోకి కోహ్లీ ఎంట్రీ.. తొలి పోస్ట్ ఏంటో తెలుసా..? Virat Kohli: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, అభిమానులు ముద్దుగా ‘కింగ్’ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ.. ఆటలోనే కాదు సంపదలోనూ రారాజే..!
- రోహిత్, కోహ్లీ మాత్రమే ఆడితే సరిపోదు: మహమ్మద్ కైఫ్ ‘‘2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించాలంటే స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఆధారపడితే సరిపోదు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను పటిష్ఠం చేసుకోవడం చాలా కీలకం’’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) అభిప్రాయపడ్డారు.
- మళ్లీ ఒక్కటైన పృథ్వీషా.. నటి ఆకృతి భారత యువ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw), నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల కిందట నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఈ జంట.. తాజాగా బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది.
- ఏం ‘మాయ’ చేస్తుందో! కొత్త ఆశలు రేపుతున్న తమిళనాడు అమ్మాయి భారత్‌లో మహిళల టెన్నిస్.. ఈ పేరు చెప్పగానే గుర్తొకొచ్చేది సానియా మీర్జానే! ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ స్టార్.. ఈ ఆటలో తనదైన ప్రమాణాలు నెలకొల్పింది.