పన్నుల్లేని ఈవీ రయ్..రయ్

- A
- A+
- A++

జీవితకాల పన్ను లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు..
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఈ రాయితీలు భారీగా ఊతమిస్తున్నట్లు తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల కొనుగోళ్లు గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. ఏకంగా 91,107 విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు రవాణాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వీటి మొత్తం ఇన్వాయిస్ విలువ రూ.6,283 కోట్లుగా నివేదికలో వివరించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్.. మొత్తం అన్ని రకాలవి కలిపి ఏడాదిలో మొత్తం 10,37,227 కొత్త వాహనాలు రిజిస్టర్ అయితే.. వాటిలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వాటా 8.8 శాతం. ప్రత్యేకించి కార్ల విభాగంలో అది ఏకంగా 12.5 శాతం. 243 విద్యుత్ బస్సులు కూడా రోడ్డెక్కాయి.
జీవో 41తో భారీ మార్పు..
రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 16న జారీ చేసిన జీవో 41తో.. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుకు 100 శాతం మినహాయింపు వచ్చింది. అంతకుముందు ప్రోత్సాహకాల్లో వాహనాల సంఖ్యపై పరిమితి ఉండగా.. జీఓ 41తో ప్రభుత్వం ఈవీలకు సంఖ్యతో సంబంధం లేకుండా మినహాయింపు కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఈ మినహాయింపు ఉంది.
ఏయే వాహనాలకు?
ఎలక్ట్రిక్- ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు కార్లు, ఆటోలు, ట్యాక్సీలు, టూరిస్టు క్యాబ్స్ వంటి కమర్షియల్ ప్రయాణికుల వాహనాలు.. మూడు సీట్ల ఆటోలు, తేలికపాటి గూడ్సు వాహనాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు. అదేవిధంగా- ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సులకు జీవితకాల మినహాయింపు. కంపెనీలు తమ ఉద్యోగులకు నడిపే వాహనాలకు సైతం.
- 2025-26లో రిజిస్టరైన ఈవీల్లో ఏకంగా 68 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు మిగిలిన జిల్లాల కంటే ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
- అక్టోబరులో, తర్వాత ఫిబ్రవరిలో అత్యధిక ఈవీలు రిజిస్టరయ్యాయి. మొత్తం ఏడాదిలో 91,107 రిజిస్టరయితే అక్టోబరులో ఆ సంఖ్య 10,705. దసరా, దీపావళి పండగల వేళ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు దీనికి ఒక కారణం కావచ్చని అంచనా.
- ఏడాదిలో 62,565 విద్యుత్ ద్విచక్ర వాహనాలు రిజిస్టరయ్యాయి. 2025-26 మొత్తం ఈవీల్లో ఇవి సుమారు 68 శాతం.


గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘పాము..’ ప్రాణ సంకటం కాకుండా..! ఇందౌర్‌లో ఒకరి ఇంట్లో టాయిలెట్ కమోడ్ నుంచి పాము బయటకు వచ్చింది... హైదరాబాద్ కందికల్‌గేట్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంటి వెనక ఖాళీ స్థలంలో ఏకంగా నాలుగు పాములు కనిపించాయి… కొన్నిసార్లయితే కార్లు, బైక్‌ల హ్యాండిళ్లలో దూరి హడలెత్తిస్తుంటాయి.
- ఇవి జెన్జీలు మెచ్చిన రుచులు! నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి.
- దయచేసి వినండి... మీ ప్రయాణం సురక్షితం కావాలంటే.. రైలు ప్రయాణం వేగవంతమైంది... సౌకర్యాలు పెరిగాయి... అదే సమయంలో ఆపదలూ పెరిగాయి... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలూ ముంచుకొస్తాయి... ఒక్క క్షణం నిర్లక్ష్యం...
- పులి భయం... కూలీలకు రైతుల కాపలా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి, సికినాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
- ‘అధిక’ధరకు కరెంటు కొంటారా! సాధారణంగా ఎవరైనా ఏదైనా వీలయినంత తక్కువ ధరకే కొనాలని చూస్తారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ జెన్కో చేపడుతున్న విద్యుత్ కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
- కంటికి రెప్పలా కాపాడుకునేలా! ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు లక్ష్యం తగ్గగా.. ప్రస్తుతమున్న పంటలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
- సభ జరగకుండా ఆ రెండు పార్టీలు నాటకం: ఏలేటి శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలు అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
- సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని శాసన మండలి భారాస ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసమే మండలిని నడిపినట్లు ఉందని ఆరోపించారు.
- ఆ రెండు పార్టీలు.. ఆశలను వమ్ము చేశాయి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా గద్దెనెక్కిన భారాస, ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ప్రజల ఆశలను వమ్ము చేశాయని జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు విమర్శించారు.
- ఆపరేషన్ పోలోతోనే భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం ఆపరేషన్ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధ ట్యాంక్ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
- ఉమ్మడి కుటుంబం ఒక బలమైన సామాజిక వ్యవస్థ ఉమ్మడి కుటుంబం అనేది బలమైన సామాజిక వ్యవస్థ అని.. ఆ విలువలను కొత్త తరానికి అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
- ఉదయం కడగళ్లు.. మధ్యాహ్నం పరవళ్లు సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలంలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది. దీంతో పాలేరు వాగు పొంగిపొర్లి.. వెంకేపల్లి, తాళ్లసింగారం, యడవెల్లిలోని చెక్‌డ్యాంలు వరదనీటితో కళకళలాడాయి.
- న్యాయం అందించడంలో వేగం పెరగాలి న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే కాకుండా సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ పిలుపునిచ్చారు.
- బంబార వేరుసెనగ సాగుకు తెలంగాణ అనుకూలం ఆఫ్రికా దేశానికి చెందిన బంబార రకం వేరుసెనగ సాగుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని కిర్క్హౌస్ ట్రస్టు, ఇంగ్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.క్లాడియా కానలెన్ హోల్జైస్, దిల్లీ (ఎన్‌బీపీజీఆర్) ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు డా.కుల్దిప్ త్రిపాఠి పేర్కొన్నారు.
- 17న తిమ్మాపూర్‌లో ‘సేవా అభియాన్’: కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ 25 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘సేవా అభియాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- పశుసంపదకు బ్రాండింగ్ ముర్రా, గిర్, సాహివాల్, రెడ్ సింధీ, ఒంగోలు, పుంగనూరు దేశంలో పేరొందిన ఆవుజాతులు. ముర్రా, జాఫరాబాదీ పేరొందిన గేదె జాతులు. ఇప్పుడీ జాబితాలో తెలంగాణ పశుసంపద కూడా చేరనుంది.
- మహాపూజకు వేళాయే.. ఖైరతాబాద్ మహా గణపతి పూర్తి రూపంతో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. సోమవారం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి.
- ఏకదంతాయ.. సూక్ష్మరూపాయా కేవలం 100 మైక్రాన్ల వెడల్పు ఉన్న తల వెంట్రుకపై 150 మైక్రాన్ల ఎత్తులో అతి సూక్ష్మ గణపతి శిల్పాన్ని రూపొందించారు వరంగల్‌కి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్‌కుమార్.
- తటాలున వేట.. తటాకాలే నివాసాలంట! నీలిరంగు తోకతో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పక్షి పేరు బ్లూ-టెయిల్డ్ బీ-ఈటర్. కళ్లకు అడ్డంగా నల్లని పట్టీలు, గొంతు, ఉదర భాగాలు పసుపు, గోధుమ రంగులో ఉండటం వీటి ప్రత్యేకత.