SIR: ఎస్‌ఐఆర్‌కు సన్నద్ధం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. మూడో దశలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్ ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే వేగవంతం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్ సర్వే జరిగింది. నాటి ఓటర్ల జాబితాతోపాటు 2025 జాబితాను కూడా అధికారులు బీఎల్‌వోలకు అందించారు. దీని ఆధారంగా బీఎల్‌వోలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలోనూ ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. వారి సంతానం వివరాలను సేకరిస్తున్నారు. సంతానం పేర్లు ఓటరు జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నారు. పాత జాబితాలోని ఓటర్లు చనిపోయినా కొత్త జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ చేపడుతున్నట్లు ప్రకటన వెలువడితే ఈ మ్యాపింగ్ కీలకం కానుంది.
50శాతం ఓటర్లు కూడా కనిపించడం లేదు?
తాజాగా రాష్ట్రంలో చేపడుతున్న మ్యాపింగ్‌లో పలు చోట్ల 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50 శాతం కూడా స్థానికంగా ఉండడం లేదని బీఎల్‌వోల సర్వేలో వెల్లడవుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల 30 శాతానికి మించి కూడా లేనట్లు బీఎల్‌వోలు అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 620 మండలాలు, 13 పురపాలిక కార్పొరేషన్లు, 129 పురపాలికలు, 10,434 రెవెన్యూ గ్రామాలు, 12,769 గ్రామపంచాయతీల వివరాలను విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహిస్తే ఈ కుటుంబాల వారీగా ఇంటింటికి వెళ్లి బీఎల్‌వోలు ఓటర్ల జాబితాపై సర్వే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్రం గుర్తించిన మొత్తం 11 కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
11 కార్డులు ఇవే..
1. పాస్‌పోర్టు
2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగుల గుర్తింపు కార్డు
3. 01-07-1987 కంటే ముందు దేశంలో ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ఎల్‌ఐసీ జారీచేసిన ఆధారాలు
4. సాధికార సంస్థ జారీచేసిన జననధ్రువీకరణ పత్రం
5. కుల ధ్రువీకరణ పత్రం
6. గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం జారీచేసిన విద్యా ధ్రువీకరణ పత్రం
7. అధికారిక స్థిర నివాస ధ్రువీకరణ పత్రం
8. అటవీ హక్కుల పత్రం
9. జాతీయ గుర్తింపు కార్డు
10. స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం
11. ప్రభుత్వం ద్వారా జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్‌లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.