సాగు.. తాగునీటికి కటకట

Eenadu icon
By Telangana News Desk Published : 16 Oct 2026 04:20 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లోటు వర్షపాతం కారణంగా 11.18 లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి కన్పించడం లేదనే అంచనాల నేపథ్యంలో.. వివిధ శాఖల పరిధిలోని పరిస్థితులపై నివేదికలను తెప్పించుకుని ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుపై కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని కరవు పరిస్థితిపై వివిధ శాఖలు గురువారం ప్రభుత్వానికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వడంతోపాటు.. పలు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించాయి. ఆ వివరాలిలా..

పంటలపై తీవ్ర ప్రభావం 

వరి సాగు విస్తీర్ణం గతేడాది 69.19 లక్షల ఎకరాలుకాగా.. ఈ ఏడాది 57.04 లక్షల ఎకరాల్లోనే సాగైంది. పత్తి, వరి పంటలపై నీటి ఎద్దడి ప్రభావం అధికంగా పడింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3.59 లక్షల ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 1.45 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 1.42, రంగారెడ్డి జిల్లాలో 1.29 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం పడింది. ప్రధానంగా 8.93 లక్షల ఎకరాల్లో పత్తి, 1.20 లక్షల ఎకరాల్లో వరిపై తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రత్యామ్నాయ ప్రణాళిక అమల్లో భాగంగా సూక్ష్మ సేద్యం, నూనె గింజల విత్తన రాయితీ, ఉద్యానవనం, పప్పుధాన్యాల విత్తన రాయితీ, కిసాన్‌ మేళాలు తదితరాలు కలిపి రూ.1,986.89 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అలాగే పశు సంవర్ధక శాఖ నుంచి రూ.86.39 కోట్లు అవసరమని పేర్కొన్నారు. 

మిగులు ఉన్న చోట ఒక తడికి..

రాష్ట్రంలో కృష్ణా ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270 టీఎంసీలకుగానూ.. 71 శాతం లోటుతో 78.5 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 145.7 టీఎంసీలకు 34 శాతం లోటుతో 96.0 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ప్రత్యేకించి సింగూరు జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకు గానూ ప్రస్తుత 3.924 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. అవి డిసెంబరు వరకే సరిపోతాయని అంచనా. రాష్ట్రంలోని 44.034 చెరువులకుగాను 40 శాతం వాటిలో పావు వంతు కన్నా తక్కువ నీరు ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటూ మిగులు ఉన్న చోట మాత్రం పంటలకు ఒక తడికి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. సింగూరు, ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల నుంచి నీటి విడుదలను వాయిదా వేయాలని సూచించారు. డిండి, ఎస్సారెస్పీల కింద ఉన్న ఎత్తిపోతల ద్వారా నీటి నిల్వలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టెలీమెట్రీల ఏర్పాటు, కృష్ణాలో న్యాయమైన వాటా కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. 

మిషన్‌ భగీరథ.. అదనపు పంపుల ఏర్పాటు

రాష్ట్రంలో 34 జలాశయాల నుంచి 24,001 గ్రామీణ ఆవాసాలకు, 145 పట్టణ స్థానిక సంస్థలకు నీటి సరఫరా జరుగుతోంది. సింగూరులో నిల్వ 3.92 టీఎంసీలకు పడిపోవడంతో అదనపు పంపులు ఏర్పాటుచేసి తరలించేందుకు రూ.84.14 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని జలాశయాల్లో ఏడాది కాలానికి తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు, పశువుల కోసం చెరువుల్లో తగిన నీటి నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర నీటి సరఫరా కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.కోటి నిధిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. 

హైదరాబాద్‌ మహానగరం పరిధిలో 14.5 లక్షల నల్లా కనెక్షన్ల ద్వారా 1.30 కోట్ల మందికి తాగునీరు సరఫరా అవుతోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి సింగూరు, మంజీరాల పరిధిలో సరఫరా లోటు ఏర్పడి 3 లక్షల కనెక్షన్లపై ప్రభావం పడొచ్చని అంచనా వేసి రూ.57.55 కోట్లతో తొమ్మిది ప్రత్యామ్నాయ ప్రణాళికల ఆమోదానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. క్యూర్‌ ప్రాంతంలో నిర్మాణ, గృహేతర వినియోగానికి భూగర్భ జలాలు, తాగునీటిని వినియోగించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కేసీఆర్‌ ఫాంహౌస్‌కు ఆ వెసులుబాటు ఎందుకు? రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాటు కేసీఆర్‌కు ఎందుకు? కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి.. అక్కడి నుంచి ఆయన ఫాంహౌస్‌లోకి సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
  • యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ సీఈపై వేటు విద్యుదుత్పత్తి, సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
  • ఇంటర్‌ విద్యార్థులకు ‘నకిలీ’ తిప్పలు రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వేల మంది ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రతి సంవత్సరం అఫిలియేషన్‌(అనుబంధ అనుమతి) సమస్య వెంటాడుతూనే ఉంది.
  • విదేశీ బొగ్గు దిగుమతిలో భారీ కుంభకోణం విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.
  • కేటీఆర్‌ లేఖపై ఏ విచారణకైనా సిద్ధం యాదాద్రి పవర్‌ ప్లాంటుకు విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించి 2016లోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్‌ విదేశీ బొగ్గు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (20) పువ్వులనే దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప పండగ బతుకమ్మని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.
  • ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
  • ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
  • మ్యూల్‌ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్‌ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
  • మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్‌ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ పేర్కొన్నారు.
  • మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణం మద్రాస్‌ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
  • రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
  • స్పర్శ్‌ హాస్పీస్‌ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్‌ హాస్పీస్‌’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
  • మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
  • ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండుతో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
  • మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్‌ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • జాతీయ ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ ప్రాజెక్టుల ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.
  • కిమ్స్, యూకే ఆరోగ్య సంస్థల మధ్య ఒప్పందం వైద్య పరిశోధనలు, వైద్య విద్య, చికిత్సా రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కిమ్స్‌ హాస్పిటల్స్, బ్రిటిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (బీఐఎంఎస్‌), యూకేలోని లివర్‌పూల్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.