
సింగరేణిని ప్రైవేటీకరించం

- A
- A+
- A++
హైదరాబాద్, న్యూస్‌టుడే: సింగరేణి తెలంగాణ ప్రజల గుండె. ఆ సంస్థను ప్రైవేటీకరణ చేయం, చేయనివ్వమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సింగరేణిని మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం, కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారాస హయాంలో కేంద్రం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసింది, గనుల ప్రైవేటీకరణకు భాజపా ప్రభుత్వం చట్టం తీసుకువస్తే సహకరించింది, సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడింది కేసీఆర్, భారాస కాదా..? అని నిలదీశారు. సీఎల్పీ మీడియా హాలులో గురువారం శ్రీధర్‌బాబు మాట్లాడారు.
సింగరేణిని ప్రైవేటీకరించనున్నారని, సైట్ విజిట్ పేరుతో కుంభకోణం జరిగిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఆధారాలుంటే బయటపెట్టాలని.. లేకుంటే సింగరేణి కార్మికుల, అధికారుల నిజాయతీపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ‘భారాస హయాంలో టెండర్లు, కమీషన్ల సంస్కృతిని మొదలుపెడితే ఇప్పుడు మేం అడ్డుకున్నాం. కొన్ని శక్తులకు కమీషన్లు ఆగిపోవడంతో కడుపుమంటతో ఊహాజనితమైన ఆరోపణలతో కేటీఆర్, ఆయన టీమ్ రాజకీయం చేస్తున్నారు. వారి హయాంలో విద్యుత్ సంస్థలకు పెట్టిన బకాయిలను కప్పిపుచ్చడానికి మాపై బురదజల్లుతున్నారు.
సింగరేణిని ఒకప్పుడు కాపాడింది, ఇప్పుడు కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే. క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. సింగరేణిని తమ జేబు సంస్థగా నడిపిన వారే ఇప్పుడు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. పారదర్శకంగా టెండర్లు తీసుకువస్తే తప్పులు బయటపడతాయన్న భయంతోనే ఆరోపణలు చేస్తున్నారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌కు జీ9 గ్రేడ్ బొగ్గు కావాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా సింగరేణితో ఒప్పందం చేసుకున్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది.. భారాస హయాంలోనూ ఉంది.. ఇప్పుడెలా తప్పు అవుతుంది’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాగు.. తాగునీటికి కటకట ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
- కేసీఆర్ ఫాంహౌస్‌కు ఆ వెసులుబాటు ఎందుకు? రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాటు కేసీఆర్‌కు ఎందుకు? కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి.. అక్కడి నుంచి ఆయన ఫాంహౌస్‌లోకి సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ సీఈపై వేటు విద్యుదుత్పత్తి, సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
- ఇంటర్ విద్యార్థులకు ‘నకిలీ’ తిప్పలు రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేల మంది ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రతి సంవత్సరం అఫిలియేషన్(అనుబంధ అనుమతి) సమస్య వెంటాడుతూనే ఉంది.
- విదేశీ బొగ్గు దిగుమతిలో భారీ కుంభకోణం విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
- కేటీఆర్ లేఖపై ఏ విచారణకైనా సిద్ధం యాదాద్రి పవర్ ప్లాంటుకు విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించి 2016లోనే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్ విదేశీ బొగ్గు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
- సంక్షిప్త వార్తలు (20) పువ్వులనే దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప పండగ బతుకమ్మని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
- ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
- ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
- మ్యూల్ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
- మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.
- మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం మద్రాస్ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
- రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- స్పర్శ్ హాస్పీస్ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్ హాస్పీస్’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
- మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
- ట్రాన్స్ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండుతో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
- మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజెక్టుల ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.