ముంగిట నీటి విపత్తు

Eenadu icon
By Telangana News Desk Published : 16 Oct 2026 04:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
7 min read

ఎల్‌నినోతో ఏర్పడిన ప్రకృతి విపత్తును అందరం కలిసి సమైక్యంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జలాశయాల్లో 460 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితుల్లో.. 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. 251 టీఎంసీల నీటి లోటుందని.. దేనినైనా కొనొచ్చు కానీ నీళ్లను కొనుక్కోలేమన్నారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం గురువారం ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది అత్యంత ఆందోళనకరమైన సందర్భమని.. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు.

తాగునీటికే మొదటి ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. రైతులు పెద్ద మనసు చేసుకుని.. యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలని కోరారు. ముఖ్యంగా వరి వేయొద్దని.. వేస్తే నారుమడి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే అవకాశముందని చెప్పారు. ప్రజలు నీటిని వాహనాలు కడుక్కోవడానికి వాడొద్దని.. చుక్క.. చుక్క నీటినీ ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ కష్టకాలంలో కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సాయం అందించాలని...60:40 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలన్నారు. దసరా తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని.. సీఎం నేతృత్వంలో నవంబరులో ప్రధానమంత్రి వద్దకు రాష్ట్ర బృందం వెళ్తుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. 

  

ప్రతి జీవరాశికి వచ్చిన సమస్య ఇది

‘‘ఈ రోజు రాష్ట్రంలోని ప్రజానీకానికి ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మనం ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. మొదటి ప్రభావం చూపించేది రైతులపైనే. వర్షాలు లేకపోవడం వల్ల సాగు, తాగునీటి సమస్య రావడంతో పాటు.. విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇదే సమయంలో కరెంటు వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో రోజు వారీ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి వచ్చిన సమస్య ఇది. వానాకాలంలోనే ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశాం. తెలంగాణలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. వరికి నీటి అవసరం చాలా ఎక్కువ. 13 లక్షల ఎకరాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేశారు. అయినా 56 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 

20 వేల మెగావాట్లకు పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

అక్టోబరులో ఒక రోజులో 15 వేల మెగావాట్లు ఉండాల్సిన విద్యుత్తు డిమాండ్‌ 20 వేల మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల పంపుసెట్లు ఆన్‌ అయ్యాయి. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబరులో ఉంది. రోజుకు 38 డిగ్రీలు నమోదవుతోంది. చలికాలం ఎండాకాలంలా ఉంది. ఈ రోజు 20,003 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్తు శాఖ సమర్థంగా పనిచేసి.. రైతులకు, ఇతర అవసరాలకు కరెంటు సరఫరా చేస్తోంది. మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వస్తాయి. చేతికొచ్చిన పంట ఎండిపోకూడదన్న లక్ష్యంతో.. మార్కెట్‌లో ఏ ధరకు దొరికినా కొనుగోలు చేసి విద్యుత్తును రైతులకు అందిస్తున్నాం.

కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా విద్యుత్తు కొరతతో ఉన్నాయి. ఈరోజు ఎంత ధర చెల్లించడానికి ముందుకొచ్చినా.. ఉత్పత్తి కంటే అవసరాలు పెరిగిపోవడం వల్ల విద్యుత్తు దొరకని పరిస్థితి వచ్చింది. ఈ కష్టకాలంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా.. మా ప్రభుత్వం విద్యుత్తును సరఫరా చేస్తోంది. వీలైనంత మేరకు గృహ అవసరాలకు తగినట్లుగా అందిస్తున్నాం. అందుకే కరెంటును పొదుపుగా వాడాలి. 

11, 12 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు

కృష్ణా బేసిన్‌లో 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. 23 శాతం లోటు వర్షపాతం ఉంది. అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి. 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి. తాగునీటికే ఈరోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది. వచ్చే 8 నుంచి 10 నెలల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే దానిపై ఈరోజు సమావేశంలో చర్చించాం. 11, 12 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో పంటను ఎండిపోనివ్వొద్దని అధికారులను ఆదేశించాం. ఇప్పుడు ఈ కష్టకాలంలో కూడా ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రైతులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

రైతు కూలీలకు ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ పనులు

 రైతు కూలీలకు ఇబ్బంది కలగకుండా ఉపాధి హామీ పనులను చేపట్టాలని నిర్ణయించాం. గత ఏడాది ఈ సమయంలో 25 వేల మంది ఉపాధి హామీ పనులు చేస్తే.. ప్రస్తుతం 2.5 లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు. చెరువులు, కుంటలకు ప్రాధాన్యమివ్వాలి. వానాకాలంలో నష్టపోయిన పంటతో పాటు.. వచ్చే సీజన్‌లో పంట వేయకుండా నష్టపోయిన రైతులను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉదారంగా సాయం తీసుకునే అంశంపై అధికారులు నివేదికలు తయారు చేయాలి. ఓవర్‌లోడ్‌ వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం జరుగుతోంది. విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి తీసుకుని.. మిగిలిన రాష్ట్రాలకు తక్కువ ధరకు కేంద్రం అందించాలి. 

రాజకీయాలకు అతీతంగా సహకరించాలి

కొవిడ్‌ సమయంలో ప్రధాని మోదీ ఏం చేయమన్నా ముక్తకంఠంతో ఏకమై చేశాం. ఆ రోజు విధానాలు, జెండాలు మేం చూడలేదు. ఒకే విధానంలో ముందుకు వెళ్లాలన్న ప్రధాని అప్పీల్‌కు అనుగుణంగా ముందుకొచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు అదే స్ఫూర్తితో వ్యవహరించాలి. అన్ని పార్టీలు, ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ సూచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ప్రకృతి విపత్తును కలిసికట్టుగా నిలబడి ఎదుర్కోవాలి. అందరి సహకారం ప్రభుత్వానికి కావాలి. మీడియా సహకారం ప్రభుత్వానికి వందకు వంద శాతం అవసరం. ప్రభుత్వం నుంచి మీడియా కోసం నోడల్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావును నియమించాం. టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇస్తాం. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అత్యంత ముఖ్యం. లేకుంటే పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిస్తాం. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు.. అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లి.. కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తాం. ప్రజలను చైతన్యపరచడానికి కళాజాతాలను ఏర్పాటు చేస్తాం. సీనియర్‌ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి. సినీ నటుడు విజయ్‌ దేవరకొండ ఎల్‌నినోపై ఒక విజ్ఞప్తి చేశారు. అలాగే మిగిలిన సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తాం. అందరి సహకారంతో ఈ సమస్యను ఎదుర్కోవడంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

ఒక కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో మీకు భాగస్వామ్యం ఉందని భారాస నేతలు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించగా.. ‘‘అదే హాస్పిటల్‌ను కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా ప్రారంభించారు. ఏదైనా ఆధారం ఉంటే దానిపై మాట్లాడమనండి. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య గురించి మాట్లాడుతున్నా. అవినీతి గురించి ఏ రోజైనా చర్చించడానికి నేను సిద్ధం’’ అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

అంతకు ముందు సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు ఎల్‌నినోపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణపై వివిధ శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సాగు.. తాగునీటికి కటకట ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
  • కేసీఆర్‌ ఫాంహౌస్‌కు ఆ వెసులుబాటు ఎందుకు? రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాటు కేసీఆర్‌కు ఎందుకు? కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి.. అక్కడి నుంచి ఆయన ఫాంహౌస్‌లోకి సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
  • యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ సీఈపై వేటు విద్యుదుత్పత్తి, సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
  • ఇంటర్‌ విద్యార్థులకు ‘నకిలీ’ తిప్పలు రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వేల మంది ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రతి సంవత్సరం అఫిలియేషన్‌(అనుబంధ అనుమతి) సమస్య వెంటాడుతూనే ఉంది.
  • విదేశీ బొగ్గు దిగుమతిలో భారీ కుంభకోణం విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.
  • కేటీఆర్‌ లేఖపై ఏ విచారణకైనా సిద్ధం యాదాద్రి పవర్‌ ప్లాంటుకు విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించి 2016లోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్‌ విదేశీ బొగ్గు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (20) పువ్వులనే దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప పండగ బతుకమ్మని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.
  • ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
  • ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
  • మ్యూల్‌ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్‌ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
  • మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్‌ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ పేర్కొన్నారు.
  • మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణం మద్రాస్‌ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
  • రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
  • స్పర్శ్‌ హాస్పీస్‌ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్‌ హాస్పీస్‌’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
  • మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
  • ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండుతో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
  • మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్‌ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • జాతీయ ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ ప్రాజెక్టుల ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.