
తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఐపీఎస్‌లు

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: ఏఐ ఆధారిత నేరాలు, సైబర్ ముప్పు, డార్క్‌నెట్, బ్లాక్ చెయిన్ సాంకేతికత రూపంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా యువ ఐపీఎస్ అధికారుల్ని తీర్చిదిద్దుతున్నట్లు జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే తెలిపారు. ఈ నెల 17న 78వ ఆర్ఆర్(రెగ్యులర్ రిక్రూట్) బ్యాచ్ ఐపీఎస్ అధికారుల దీక్షాంత్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

‘మారుతున్న నేరాల సరళికి అనుగుణంగా ఐపీఎస్‌ల శిక్షణ సిలబస్‌లో మార్పులు చేశాం. పీబీఏ(ప్రోగ్రెసివ్ స్కిల్ బెంచ్ మార్క్ అసెస్మెంట్), క్యూబీఏ(క్వాలిఫైయింగ్ బెంచ్‌మార్క్ అసెస్మెంట్) విధానంతో అభ్యర్థుల శక్తిసామర్థ్యాలను అంచనా వేస్తున్నాం. సైబర్, ఆర్థిక మోసాలపై ప్రత్యేక కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నాం. 78వ ఆర్ఆర్ బ్యాచ్‌లో మొత్తం 151 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 135 మంది ఐపీఎస్‌లు కాగా 16 మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన అధికారులు ఉన్నారు. మొత్తం 37 మంది మహిళా అధికారులున్నారు. తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఎంపికయ్యారు. దీక్షాంత్ పరేడ్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ హాజరవుతారు’ అని తెలిపారు. శిక్షణలో ఉన్న మహిళా అధికారికి లైంగిక వేధింపుల కేసు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ ఘటన నేను బాధ్యతలు తీసుకోవడానికి ముందు జరిగింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు విశాఖ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున దానిపై వ్యాఖ్యానించలేను’ అని పేర్కొన్నారు.



గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాగు.. తాగునీటికి కటకట ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
- కేసీఆర్ ఫాంహౌస్‌కు ఆ వెసులుబాటు ఎందుకు? రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాటు కేసీఆర్‌కు ఎందుకు? కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి.. అక్కడి నుంచి ఆయన ఫాంహౌస్‌లోకి సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ సీఈపై వేటు విద్యుదుత్పత్తి, సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
- ఇంటర్ విద్యార్థులకు ‘నకిలీ’ తిప్పలు రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేల మంది ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రతి సంవత్సరం అఫిలియేషన్(అనుబంధ అనుమతి) సమస్య వెంటాడుతూనే ఉంది.
- విదేశీ బొగ్గు దిగుమతిలో భారీ కుంభకోణం విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
- కేటీఆర్ లేఖపై ఏ విచారణకైనా సిద్ధం యాదాద్రి పవర్ ప్లాంటుకు విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించి 2016లోనే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్ విదేశీ బొగ్గు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
- సంక్షిప్త వార్తలు (20) పువ్వులనే దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప పండగ బతుకమ్మని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
- ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
- ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
- మ్యూల్ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
- మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.
- మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం మద్రాస్ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
- రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- స్పర్శ్ హాస్పీస్ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్ హాస్పీస్’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
- మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
- ట్రాన్స్ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండుతో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
- మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజెక్టుల ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.