Tata Motors: విద్యుత్‌ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్‌.ఈవీ

Eenadu icon
By Business News Team Published : 23 Dec 2025 18:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Tata Motors | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) అరుదైన మైలురాయిని సాధించింది. టాటా రూపొందించిన నెక్సాన్‌.ఈవీ (Nexon.ev) లక్ష విక్రయాలు సాధించిన తొలి విద్యుత్‌ కారుగా నిలిచింది. మొత్తంగా 2.50 లక్షల విద్యుత్‌ కార్లను కంపెనీ ఇప్పటి వరకు విక్రయించింది. తద్వారా విద్యుత్‌ కార్లలో టాటా మోటార్స్‌ తన అగ్రస్థానాన్ని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దేశంలో విక్రయించే ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాల్లో మూడింట రెండొంతుల వాటా (66 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. 

టాటా మోటార్స్‌ ప్రస్తుతం టియాగో.ఈవీ, పంచ్‌.ఈవీ, నెక్సాన్‌.ఈవీ, కర్వ్‌.ఈవీ, హ్యారియర్‌.ఈవీలను విక్రయిస్తోంది. ఫ్లీట్‌ సెగ్మెంట్‌లో XPRES-T EVని విక్రయిస్తోంది. వీటిలో నెక్సాన్‌.ఈవీ విక్రయాల్లో దూసుకెళుతోంది. టాటా విక్రయించే ప్రతి 10 కార్లలో 4 నెక్సాన్.ఈవీ మోడల్‌కు చెందిన కార్లు ఉండడం గమనార్హం. రాబోయే ఐదేళ్లలో ఐదు కొత్త విద్యుత్‌ మోడళ్లను తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా 2029-30 నాటికి రూ.16-18 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. 

  • ఐపీఓ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌: 103 కంపెనీలు.. ₹1.76 లక్షల కోట్లు!

కొత్త ఉత్పత్తులతో పాటు, దేశవ్యాప్తంగా 10 లక్షల ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. వచ్చే ఏడాది సియారా.ఈవీ, కొత్త పంచ్‌.ఈవీని లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. 2030 నాటికి ప్రీమియం మోడల్‌ అయిన అవిన్యా కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. తద్వారా అన్ని వర్గాల వారికి ఈవీని అందుబాటులో ఉంచడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పోటీ మార్కెట్‌లో 45-50 శాతం మార్కెట్‌ వాటా ఉండాలన్నది తమ లక్ష్యమని వివరించారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఎలక్ట్రిక్‌ టూవీలర్ల మార్కెట్‌లో టీవీఎస్‌, బజాజ్‌, హీరో హవా Electric two wheeler: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల విషయంలో నిన్న మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన స్టార్టప్‌ కంపెనీలు చతికిలపడ్డాయి.
  • తొలి యమహా ఈవీ స్కూటర్‌.. ధర ఎంతంటే..? ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ యమహా మోటార్‌ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈసీ-06ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
  • నెలకు రూ.49 వేలతో ఇంటికి టెస్లా వై Tesla offers: ఎలాన్‌ మస్క్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) దేశీయంగా తన విక్రయాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది.
  • 3 లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన యమహా.. మోడళ్లు ఇవే Yamaha recall: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా 3 లక్షల స్కూటర్ల రీకాల్‌ చేపట్టింది.
  • టయోటా నుంచి తొలి ఈవీ.. సింగిల్‌ ఛార్జ్‌తో 543 km Toyota Urban Cruiser Ebella: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) దేశంలో తొలి విద్యుత్‌ కారును విడుదల చేసింది. అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది.
  • కొరవడిన అమ్మకాలు.. టెస్లా Yపై ₹2 లక్షల వరకు డిస్కౌంట్‌ Tesla discount: ఎన్నో అంచనాల మధ్య భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లాకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.
  • వాహనాల టైర్లు కేవలం నలుపు రంగులోనే ఎందుకుంటాయి? వాహనాల టైర్ల రంగు ఎందుకు నలుపు రంగులోనే ఉంటుంది. దీనికి కార్బన్‌ బ్లాక్‌ ప్రధాన కారణం.
  • బజాజ్‌ నుంచి చేతక్‌ కొత్త EV.. ధర రూ.లక్షలోపే! Bajaj chetak c25: ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌.. సీ25 పేరిట కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.91,399 (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించింది.
  • టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల.. ధర ₹5.59 లక్షల నుంచి ప్రారంభం Tata Punch Facelift:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌.. టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.59 లక్షల (ఎక్స్-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.
  • సుజుకీ ఇ-యాక్సెస్‌ వచ్చేసింది.. ధర రూ.1.88 లక్షలు Suzuki e-Access: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. తన విజయవంతమైన మోడల్‌ యాక్సెస్‌ను.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో ఇ-యాక్సెస్‌ పేరుతో లాంచ్‌ చేసింది.
  • మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO ఈవీ.. ధరెంత? Mahindra XUV 3XO: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీని (Mahindra XUV 3XO) మంగళవారం లాంచ్‌ చేసింది.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ.. ధరల శ్రేణి రూ.13.66- 24.11 లక్షలు మహీంద్రా అండ్‌ మహీంద్రా, కొత్తగా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. ఏఎక్స్, ఏఎక్స్‌3, ఏఎక్స్‌5, ఏఎక్స్‌7, ఏఎక్స్‌7టీ, ఏఎక్స్‌7ఎల్‌ వేరియంట్లలో ఈ వాహనం లభ్యం కానుంది.
  • మార్కెట్‌లోకి కొత్త కియా సెల్టోస్‌.. ధర ₹10.99 లక్షల నుంచి ప్రారంభం New Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను (Kia Seltos) దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
  • జనవరి 1 నుంచి ఏథర్‌ ఈవీ ధరలకు రెక్కలు Ather price hike: ఏథర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఈవీ ధరలను సవరించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
  • జనవరి నుంచి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ కార్ల ధరలు పైకి JSW MG Motor price hike: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా (JSW MG Motor) తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
  • మారుతీ వ్యాగన్‌ఆర్‌లో స్వివెల్‌ సీటు వృద్ధులు, దివ్యాంగులు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేలా, మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ కారులో స్వివెల్‌ సీటు అమర్చుతోంది.
  • ఏథర్‌ రిజ్తా విక్రయాల్లో దూకుడు.. 20 నెలల్లో 2 లక్షల మైలురాయి Ather Rizta: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీకి (Ather energy) చెందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రిజ్తా (Ather Rizta) అరుదైన మైలురాయిని సాధించింది.
  • కొత్త కియా సెల్టోస్‌ వచ్చేసింది.. ఫీచర్లు, బుకింగ్‌ వివరాలు ఇవే! Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను ఆవిష్కరించింది. గట్టి పోటీ ఉన్న మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యాధునిక హంగులతో 2026 మోడల్‌ సెల్టోస్‌ను తీసుకొచ్చింది.
  • టాటా సియారా వచ్చేసింది.. ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం Tata Sierra: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) తన ఐకానిక్‌ మోడల్‌ సియారాను (Tata Sierra) మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
  • బైకులన్నింటికీ ABS తప్పనిసరి.. ఇప్పట్లో లేనట్లే! Two wheeler ABS: టూవీలర్స్‌ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.