Work life balance: మంగళవారం ఐదైతే పనికి ఫుల్‌స్టాప్.. 30 ఏళ్లుగా పాటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

work life balance | ఇంటర్నెట్ డెస్క్: వర్క్‌లైఫ్ బ్యాలెన్స్.. చాలా మంది బాస్‌లు దీన్ని కొట్టిపారేస్తుంటారు. అదంతా ఉత్తిదే అని వాదిస్తుంటారు. గడియారం చూసుకుంటూ పనిచేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించలేం.. పైకెదగలేం అంటారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ అంశంపై ఎడతెగని చర్చ నడుస్తోంది. ఉద్యోగ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతూకం ఉండాలనేది ఉద్యోగుల వాదన. వారం చివర పనిచేస్తేనే ‘ఫ్యూచర్’ ఉంటుంది అంటారు బాస్‌లు. కానీ, గడిచిన 30 ఏళ్లుగా వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌కు పెద్దపీట వేస్తున్నారు నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్. మంగళవారం సాయంత్రం ఐదైతే ‘పెన్‌డౌన్’ పాటిస్తున్నారు.
ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ను ( Netflix) స్థాపించిన వారిలో ఒకరైన రాండోల్ఫ్ మూడు దశాబ్దాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నా సాయంత్రం ఐదు గంటలు కాగానే తన విధులు ముగిస్తానని తన లింక్డిన్ పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ పాతదే అయినా ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. తన జీవితమంతా ఎంతో కష్టపడి పనిచేశానని, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ కోసం మాత్రం ఆ ఒక్కరోజు తనకు నచ్చినట్లు గడుపుతానంటూ తన పోస్టులో చెప్పుకొచ్చారు.
- 25+ ఏళ్ల జియో యూజర్లకూ ఫ్రీ గూగుల్ జెమినీ ప్లాన్
‘‘ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటలు కాగానే నా పని ముగిస్తా. గడిచిన 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నా. ఆ రోజు ఎండైనా వానైనా సరే ప్లాన్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. ఆ రోజు నా స్నేహితుడితో కలిసి సినిమాకో, డిన్నర్‌కో వెళతా. ఏమీ లేకపోతే విండో షాపింగ్ చేస్తా. ఆ రోజు ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్సూ పెట్టుకోను. ఎంత పెద్ద చిక్కొచ్చినా 4.55 గంటలకల్లా నా పనిని ముగించుకుంటా’’ అంటూ రాండోల్ఫ్ చెప్పుకొచ్చారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, దృష్టికోణంలో మార్పు ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను ‘సరిపోదా మంగళవారం’ రూల్‌ను పాటిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.
సిలికాన్ వ్యాలీలో ఉండే వేరే సీఈఓల్లో చాలా మంది రాండోల్ఫ్ వర్క్‌లైఫ్ ఫిలాసఫీని కొట్టిపారేస్తున్నారు. అంకిత భావంతో పని గంటలతో సంబంధం లేకుండా పనిచేస్తేనే విజయం వరిస్తుందని భావిస్తుంటారు. అదే సమయంలో రాండోల్ఫ్ తరహాలో కుటుంబ బంధాలు, వ్యక్తిగత ఆరోగ్యం కోసం పని జీవితంలో విశ్రాంతి అవసరం అని చెప్పే సీఈఓలూ లేకపోలేదు. ఇంతకీ మీ అభిప్రాయమేంటి?
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :