ఔషధ ఉత్పాదక రంగంలో కీలకపాత్ర భారత్‌దే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

సాగర్‌నగర్: గీతం డీమ్డ్ వర్సిటీ వేదికగా ల్యాబొరేటరీ యానిమల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (లాసా) 13వ అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి ఈ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఔషధ ఉత్పాదక రంగంలో భారతదేశం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన ఔషధాలు మానవాళికి అందాలంటే నైతికవిలువలు, ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తూ పరిశోధనలు చేపట్టాలన్నారు. ఔషధ ప్రయోగాలకు ఉపయోగించే జంతువులకు ప్రత్యామ్నాయ పరిజ్ఞానంపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశాల్లో దేశవిదేశాలకు చెందిన జంతుశాస్త్రవేత్తలు, ఔషధరంగ నిపుణులు, వెటర్నరీ సైన్స్ పరిశోధకులు, కేంద్ర పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు తదితర 600 మందికిపైగా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :