
ఓటర్లకు సవాలే..!

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) పెద్ద సవాల్‌గా మారనుంది. 2002లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ జాబితాతో 2025 ఓటర్ల జాబితాలోని పేర్లు 30 శాతం వరకు మ్యాపింగ్ జరగలేదు. మ్యాపింగ్ జరిగిన పలువురు ఓటర్ల వివరాల్లోనూ లోపాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. వీరందరిపైనా ఈ నెల 25 నుంచి జరిగే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రభావం చూపనుంది. 2025 జాబితాలో 3,38,29,018 మంది ఓటర్లు ఉండగా 2,36,54,232 మంది మ్యాపింగ్ మాత్రమే జరిగింది. వీరిలోనూ 89,44,713 మంది వివరాల్లో వివిధ తేడాలను అధికారులు గుర్తించారు. ఈ ఓటర్లు తగిన గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లలో మరో 1,01,74,786 మందిని అన్‌మ్యాపింగ్ జాబితాలో చేర్చారు.
ఈ ఓటర్లలోనూ చాలా మంది ఎన్యూమరేషన్ పత్రాలను నింపితే నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారూ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్లలో అన్‌మ్యాపింగ్‌తోపాటు మ్యాపింగ్‌లో లోపాలు గుర్తించిన ఓటర్లు మొత్తం 1,91,19,499 మంది ఉన్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్ ప్రక్రియ సరిగా జరగకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావం ఓటర్లపై పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.
చాలా నియోజకవర్గాల్లో ఓటర్లపై ప్రభావం..
- నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,95,581 మంది ఓటర్లు ఉండగా 4,23,118 మంది ఓటర్ల(85.38 శాతం)ను మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలోనూ 1,87,149 మంది వివరాల్లో వివిధ లోపాలను గుర్తించారు. అన్‌మ్యాపింగ్‌లో మరో 72,463 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో వలస కార్మికులు, పేదలు అధికంగా ఉంటారు. రాబోయే ఎస్‌ఐఆర్‌లో వీరిపై ప్రభావం అధికంగా ఉంటుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్‌లో 2,64,309 మంది ఓటర్లు ఉండగా 2,12,270 మందిని మ్యాపింగ్ చేశారు. వీరిలో 95,439 మంది ఓటర్ల వివరాల్లో తేడాలను గుర్తించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,50,455 మంది ఓటర్లకుగాను 1,61,056 మంది మ్యాపింగ్ చేయగా.. వీరిలో 71 వేల మంది వివరాల్లో లోపాలను గుర్తించారు.
- నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 14,39,900 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్‌వోలు 12,53,284 మంది మ్యాపింగ్ చేశారు. వీరిలో 5,07,143 మంది వివరాల్లో లోపాలను గుర్తించారు.
- రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఓటర్ల వివరాల్లో భారీ తేడాలు ఉన్నాయి. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 29,78,532 మంది ఓటర్లు ఉండగా.. 12,89,802 మంది మ్యాపింగ్ చేపట్టారు. ఇందులోనూ వివరాల్లో లోపాలున్న 8,38,150 మంది ఎన్నికల సంఘం ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
- మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా మ్యాపింగ్ జరిగిన ఓటర్ల వివరాల్లో పలు తేడాలు ఉన్నాయి.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆర్థికం.. అతలాకుతలం తెలంగాణపై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి రూ.6,89,021 కోట్లని కాగ్ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది.
- నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 19వ తేదీ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
- మెట్రో రెండో దశ అంచనాలు పైపైకి మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం గతేడాది అంచనాలతో పోలిస్తే రూ.1,915 కోట్లు పెరిగింది. ప్రాజెక్టుకు అనుమతులు రావడం జాప్యమయ్యేకొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- ఉదారతలో శిబి చక్రవర్తిని మించిపోయారు! బ్యాంకు అధికారులు వితరణలో శిబి చక్రవర్తిని మించిపోయారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామన్న భూమిపై హైకోర్టు స్టే ఉండగా, అదే భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా మంజూరు చేస్తారంటూ ఎస్‌బీఐని నిలదీసింది.
- కోకాపేటలో ‘బుల్లెట్’ రైలు స్టేషన్ కష్టమేనా? బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లపై నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్)కు కీలక మార్పులను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
- సంక్షిప్త వార్తలు (17) పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని గుర్తుచేశారు.
- పిల్లలకు మంచి మాటలు చెప్పడం రాదా..? ‘ఆరుట్లలో పాఠశాల ప్రారంభోత్సవంలో నాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.
- కిషన్‌రెడ్డిపై సీఎం తప్పుడు ప్రచారం: రామచందర్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
- కోతులు బెదిరి.. అడవి పందులు అదిరి..! ఒకప్పుడు.. కోతులు, అడవి పందులు ఆ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవి.
- ‘ఇప్పొల్ ఎంగనేయుంది?.. నిమ్మదు కర్ణాటకా?’ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రి గడప తొక్కిన వారికి చికిత్సతోపాటు ఓదార్పూ ముఖ్యం.
- ఈ దారుల్లో ప్రయాణం ప్రమాదం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్ల (ప్రమాదకర ప్రదేశాలు) వద్ద ప్రమాదాల నివారణ కోసం నిర్మించ తలపెట్టిన వంతెనలు, అండర్‌పాస్‌ల ప్రతిపాదనలు ప్రణాళికలకే పరిమితమవుతున్నాయి.
- ఏఐజీలో ‘పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్’ చికిత్స అందుబాటులోకి మారిన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గుండె లయ తప్పి ప్రాణాంతకంగా మారే ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అనే సమస్యకు ఏఐజీలో సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది.
- టీజీఎంఎస్‌ఐడీసీ టెండర్లలో పారదర్శకతకు విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
- మీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తాం! సంక్షేమశాఖలలో సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు సవాల్ విసిరారు.
- 3,39,96,239.. రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఇది రాష్ట్రంలో ఆహారభద్రత భారీగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకురేషన్ కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో అవసరం మేరకు చేర్పులు చేస్తోంది.
- మీనం దక్కాలంటే.. తాళం తప్పదు ఇంటికి తాళం వేస్తాం.. బైక్ తాళం వేస్తాం.. కానీ ఇక్కడ చేపలకు తాళం వేస్తున్నారు.
- కాళేశ్వరంలో దర్శనాలు ఇకపై బాలాలయంలో... దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం నుంచి పూజలు, భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు.
- కీటకాల వేటగాడు... కవ్వాల్‌లో దిగాడు! గోరింక పరిమాణంలో ఉండే చిన్న గుడ్లగూబ ఇది. ఆకురాల్చే అరణ్యాలు, టేకుచెట్లతో కూడిన మిశ్రమ అడవుల్లో ఆవాసాలు ఏర్పరుచుకునే ఈ పక్షి జాతి...
- మేలుజాతి సన్నరకాలకు ప్రోత్సాహం వ్యవసాయం లాభదాయకం కావాలని.. రైతులు ఆర్థికంగా ఎదగాలని.. పేదలు సన్నబియ్యం తినాలని.. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న 7 మేలుజాతి సన్న రకాల సాగును ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఐఎస్‌వో గుర్తింపు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాలుగు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ఐఎస్‌ఓ) గుర్తింపు ఇచ్చింది.