ఔషధ ఉత్పాదక రంగంలో కీలకపాత్ర భారత్‌దే!

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 19 Dec 2025 18:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సాగర్‌నగర్‌: గీతం డీమ్డ్ వర్సిటీ వేదికగా ల్యాబొరేటరీ యానిమల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (లాసా) 13వ అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి ఈ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఔషధ ఉత్పాదక రంగంలో భారతదేశం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన ఔషధాలు మానవాళికి అందాలంటే నైతికవిలువలు, ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తూ పరిశోధనలు చేపట్టాలన్నారు. ఔషధ ప్రయోగాలకు ఉపయోగించే జంతువులకు ప్రత్యామ్నాయ పరిజ్ఞానంపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశాల్లో దేశవిదేశాలకు చెందిన జంతుశాస్త్రవేత్తలు, ఔషధరంగ నిపుణులు, వెటర్నరీ సైన్స్ పరిశోధకులు, కేంద్ర పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు తదితర 600 మందికిపైగా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

India is a key player in pharmaceutical manufacturing sector!

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 19 Dec 2025 18:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Sagarnagar: 13th International Conference of Laboratory Animal Scientists Association (LASA) is being organized at Geetam Deemed University. Dr. Varaprasada Reddy, founder of Shantha Biotech, who was the chief guest on Friday, inaugurated these meetings. Speaking on this occasion, he said that India plays a vital role in the pharmaceutical manufacturing sector in the world. In this context, if quality medicines are to be provided to humanity, research should be carried out following ethical values ​​and high standards. Researchers are advised to focus on alternative knowledge for animals used in drug experiments. More than 600 representatives of foreign zoologists, pharmaceutical experts, veterinary science researchers, scientists of central research institutes and others participated in these meetings. These meetings will continue for two days.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :