కైవల్యానికి ఆఖరి మెట్టు

Eenadu icon
By Editorial Team Published : 15 Jun 2026 02:33 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే, పరమాత్మ అంశ అయిన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోనే లీనమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని దైవానికి అర్పించడాన్నే ‘ఆత్మ నివేదనం’ అంటారు. ఇది భక్తికి పరాకాష్ఠ, మోక్ష సాధనలో చివరి మెట్టు. తొమ్మిది విధాల భక్తి మార్గాల్లో ఇది అత్యున్నతమైనది. ‘ఆత్మ’ అంటే తనను తాను, ‘నివేదనం’ అంటే సంపూర్ణంగా సమర్పించడం. తన జీవితం, కర్తవ్యాలు, సుఖదుఃఖాలు అన్నింటినీ భగవంతుడి చిత్తానికి అర్పించడమే ఆత్మ నివేదనకు అసలైన అర్థం. లోకంలో మనం చేసే పనులన్నింటినీ స్వార్థం కోసం కాకుండా, పనినే పూజగా భావించి ఆ దైవానికి నచ్చే సత్కార్యాలను చేసినప్పుడే నిజమైన సమర్పణ సాధ్యమవుతుంది. అప్పుడు భక్తుడికీ భగవంతుడికీ మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. లాభనష్టాలు, జయాపజయాలను దైవ సంకల్పానికి అప్పగించడమే ఆత్మ నివేదన తాలూకు పరమార్థం.

ఆత్మ నివేదనకు ప్రధాన అడ్డంకి అహంకారం. ‘నేనే చేస్తున్నాను, ఇది నాది’ అనే భావన ఉన్నంత కాలం పరిపూర్ణ శరణాగతి సాధ్యం కాదు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నకొద్దీ మనిషి తాను కేవలం నిమిత్తమాత్రుణ్ని అనే సత్యాన్ని గ్రహిస్తాడు. గంగానది సముద్రంలో కలిసినప్పుడు తన పేరు, రూపాన్ని కోల్పోయి కడలిగా మారినట్లు, భక్తుడు తన వ్యక్తిత్వాన్ని దైవంలో విలీనం చేయాలి.

వామనావతారంలో బలి చక్రవర్తి కథ ఆత్మ నివేదనకు గొప్ప నిదర్శనం. మూడు అడుగుల నేల కోరిన వామనుడు- మొదటి రెండు అడుగులతో భూమి, ఆకాశాన్ని కొలిచిన తరవాత మూడో అడుగుకు స్థానం అడిగినప్పుడు, బలి తన తలనే సమర్పించాడు. రాజ్యాన్ని మాత్రమే కాదు, తన అహంకారాన్ని కూడా అర్పించి చిరంజీవిగా నిలిచాడు. అలాగే శివభక్తుడు సిరియాళుడు ఆత్మ నివేదనకు అత్యున్నత ఉదాహరణ వంటివాడు. సర్వం ఈశ్వరుడిదే అనే అచంచల విశ్వాసం అతడి శరణాగతిని తెలియజేస్తుంది. దైవపరీక్షలో విజయం సాధించిన సిరియాళుడికి పరమశివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడన్నది పౌరాణిక గాథ. 
ఆత్మ నివేదనం అంటే అడవులకు వెళ్లడం కాదు. సంసారంలో ఉంటూనే ప్రతి పనినీ భగవంతుడికి అర్పించడం; ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం; సకల జీవులలోనూ దైవాన్ని దర్శించడం; మనకు అత్యంత ప్రియమైన దానిపైనా హక్కు భావాన్ని వదిలివేయడం. అలాంటి భక్తుడి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడని భగవద్గీతలోని ఈ శ్లోకం చెబుతుంది.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ।।

కైవల్యానికి ఆఖరి మెట్టయిన ఆత్మ నివేదనం సాధకుణ్ని జనన-మరణ చక్రం నుంచి విముక్తి చేసి, శాశ్వత ఆనందమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తమను తాము శూన్యం చేసుకునే వారికే భగవంతుడు సంపూర్ణంగా దర్శనమిస్తాడు. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మానవత్వమే... ఒక పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే పని ప్రారంభించారు. ఊడిపోతున్న రాతిగోడలను తొలగించసాగారు పనివాళ్లు. కానీ, నోట పురుగును కరచుకున్న ఒక బల్లి అక్కడక్కడే తిరుగుతూ వారి పనికి అడ్డం వస్తోంది. ఎన్నిసార్లు తరిమినా తిరిగి అక్కడికే వస్తోందది. విసిగిపోయిన పనివాళ్లు ఆలయ స్థపతికి విషయం చెప్పారు.
  • ఆ నాలుగూ... మానవ జీవితానికి మహర్షులు నాలుగు లక్ష్యాలను నిర్దేశించారు. అవే చతుర్విధ పురుషార్థాలుగా పేర్కొనే ధర్మార్థ కామ మోక్షాలు
  • జ్యేష్ఠం... శ్రేష్ఠం! సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది.
  • విజయ రహస్యం కష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు.
  • రణం... కారణం మనిషి జీవితం అనేక సంఘర్షణల సమాహారం. ఈ సంఘర్షణలనే మనం నిత్యజీవన సమరాలుగా వ్యవహరిస్తాం.
  • ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
  • దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
  • సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.
  • దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 
  • శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.
  • తాపత్రయం! ‘ఎందుకీ తాపత్రయం?’ అనే ప్రశ్న తరచూ వింటూ ఉంటాం. అసలు ‘తాపత్రయం’ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మోక్షం గురించి తెలియాలి.