ఆ నాలుగూ...

- A
- A+
- A++

మానవ జీవితానికి మహర్షులు నాలుగు లక్ష్యాలను నిర్దేశించారు. అవే చతుర్విధ పురుషార్థాలుగా పేర్కొనే ధర్మార్థ కామ మోక్షాలు. మొదటి మూడూ శరీరానికి సంబంధించినవి. సుఖ సంతోష కారకాలైన అవి మనిషిని బంధాల్లో బందీ చేయకుండా మోక్షానికి దారి చూపాలి. మోక్షం ఆత్మపరమైంది, ఆనంద ప్రదాయకం. మనిషికి తొలుత కోరికలు తీరాలి. అవి తీరాలంటే అర్థం(ధనం) కావాలి. దాన్ని ఆర్జించేందుకు న్యాయబద్ధమైన వృత్తిని చేపట్టాలి. ధర్మం అనే శబ్దానికి కర్తవ్యం, విధి అనే నిర్వచనాలున్నాయి. చేపట్టిన వృత్తికి న్యాయం చేయడం, లోకశ్రేయస్సుకు పాటుపడటమే ధర్మం. స్వధర్మాచరణతో ప్రపంచ ప్రయోజనం కోసం పరిశ్రమించేవారికి ఆ ధర్మమే రక్షణగా నిలుస్తుంది. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. మనిషి తన హక్కుగా, ఎంచుకున్న పనిని నిర్వర్తిస్తూ, ధనాన్ని సంపాదిస్తూ, కోరికలు తీర్చుకుంటూ సంతోషంగా జీవించడాన్ని సనాతన ధర్మం సమర్థించింది. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకునే తన వృత్తిని అంకితభావంతో చేస్తూ, తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తూ, ఆదర్శ గృహస్థుగా జీవించాడు. బ్రహ్మజ్ఞానాన్ని సాధించాడు.
పురుషార్థాల్లో రెండోది... జీవితావసరాలకు కావాల్సిన సంపద. బతుకుదెరువుకు సక్రమమార్గంలో ధనార్జన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఈ విషయంలో జనకుడిలాంటి వారే ఆదర్శం. పైకి మహారాజు అయినా లోన సన్యాసిగా జీవించాడు ఆయన. సంపద దానం, భోగం, నాశం... రూపాల్లో వినియోగమవుతుందని, ఎవరైతే ఇతరులకు దానం చేయరో, తాము అనుభవించరో అలాంటి వారి ధనానికి నాశనం తప్పదని సుభాషితం చెబుతోంది. అందుకే రామకృష్ణ పరమహంస ‘ధనాన్ని బానిసగా చేసుకుని జీవించే వ్యక్తే ధార్మికుడు. సద్వినియోగం చేయనివారి సంపద దుష్టుల పరమవుతుంది’ అన్నారు. చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు, అత్యాశతో ఆర్జించి భోషాణాల్లో దాచిన సిరి అనతికాలంలోనే అన్యాక్రాంతమవుతుంది.
మూడోది కామం. ‘ధర్మానికి లోబడి ఉండే కామాన్ని నేనే’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. కన్నూ మిన్నూ కానకుండా కామానికి వశులైతే వినాశం తప్పదనడానికి రావణాసురుడే నిదర్శనం. ధర్మమార్గంలో తీర్చుకునే కోరికల ఫలితంగా మనిషిలో కొన్నాళ్లకు వైరాగ్యభావనలు కలుగుతాయి. ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడు ఆ మార్గంలో పయనించి పురుషోత్తముడిగా పూజలందుకున్నాడు. ఆఖరి పురుషార్థం మోక్షం. అంటే మోహక్షయం. మోక్షాన్ని కోరుకునే గృహస్థులు తొలుత మూడు పురుషార్థాల్ని నెరవేర్చాలి. సద్గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి.
అహంకారాన్ని వదిలేయడమే నిజమైన మోక్షం. ఓ భక్తుడు రమణ మహర్షిని ‘భగవాన్ నేను ముక్తి పొందేదెప్పుడు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు రమణులు ‘ముందు ‘నేను’ నుంచి ముక్తిపొందు. తరవాత ముక్తి దానంతటదే వస్తుంది’ అన్నారు. మోక్షం ఎక్కడో పై లోకంలో లభించదు. జీవన్ముక్తులం కావాలి. అదే హైందవ ధర్మం ప్రబోధించేది. అన్ని బంధాల మధ్య ఉంటూ కూడా ఏకాంతవాసిగా ఉండగలిగితే అదే మోక్షం. అలాగే భగవంతుడికి శరణాగతులైన భక్తులు నిత్యముక్తులు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సులభ ముక్తి సాధనం రోగికి వైద్యులు ఇచ్చిన ఔషధం గురించి తెలిసినా తెలియకపోయినా, అది తీసుకున్న తరవాత అతడి అనారోగ్యం నయమవుతుంది.
- మానవత్వమే... ఒక పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే పని ప్రారంభించారు. ఊడిపోతున్న రాతిగోడలను తొలగించసాగారు పనివాళ్లు. కానీ, నోట పురుగును కరచుకున్న ఒక బల్లి అక్కడక్కడే తిరుగుతూ వారి పనికి అడ్డం వస్తోంది. ఎన్నిసార్లు తరిమినా తిరిగి అక్కడికే వస్తోందది. విసిగిపోయిన పనివాళ్లు ఆలయ స్థపతికి విషయం చెప్పారు.
- జ్యేష్ఠం... శ్రేష్ఠం! సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది.
- కైవల్యానికి ఆఖరి మెట్టు మట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే, పరమాత్మ అంశ అయిన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోనే లీనమవుతుంది.
- విజయ రహస్యం కష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు.
- రణం... కారణం మనిషి జీవితం అనేక సంఘర్షణల సమాహారం. ఈ సంఘర్షణలనే మనం నిత్యజీవన సమరాలుగా వ్యవహరిస్తాం.
- ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
- దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
- సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.
- దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు.
- శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే.
- శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
- సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
- తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
- సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
- తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
- గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
- పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
- వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
- బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.