విజయ రహస్యం

Eenadu icon
By Editorial Team Published : 14 Jun 2026 02:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు. అలా ఉండిపోతే ఈ సృష్టి ఇలా ఉండేదే కాదేమో! గాలికి మేఘాలు కొట్టుకుపోయినట్టు కష్టాలు మెల్లగా తొలగిపోతుంటాయి. కాకపోతే, వచ్చిన కష్టం కనుమరుగయ్యే వరకూ మనం సహనంతో ఉండాలి. 

స్త్రీ గర్భం దాల్చింది మొదలు ప్రసవం అయ్యేవరకు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రసవాన్ని పునర్జన్మ అన్నారు పెద్దలు. తన ప్రతి కదలికలోనూ గర్భంలోని శిశువును దృష్టిలో పెట్టుకుంటుంది. ఒకటా రెండా- తొమ్మిది నెలలు ఆ స్త్రీమూర్తి ఓపిక పడుతుంది. పండంటి శిశువుకు జన్మనిస్తుంది. ఇది ఒక్క స్త్రీ మూర్తికే సాధ్యమైన సహనం. అందుకే ఆమెను భూమాతతో పోల్చారు.

గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఒకరోజులో కలిగింది కాదు. సుమారు ఆరు సంవత్సరాలు ఏకాగ్రతతో ధ్యానం చేశాడు. నిద్రాహారాలు మానేసి కఠోర ధ్యానంలో మునిగిపోయాడు. కందమూలాలు, తృణధాన్యాలే అప్పుడు ఆయన ఆహారం. ఒక్కోసారి గుప్పెడు నువ్వు గింజలతో సరిపెట్టుకున్నాడు. అపారమైన సహనంతో ధ్యానం కొనసాగించాడు. చివరికి జ్ఞానోదయం పొంది లోకానికి వెలుగును పంచాడు. 

ఇరవై ఏడేళ్లు ‘డి’ గ్రేడు జైలు జీవితం అనుభవించడమంటే మాటలు కాదు. ఆ తరగతి జైళ్లలో తక్కువ ఆహారం, అరకొర దుస్తులూ, ఇరుకు గది మాత్రమే ఇస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఆర్నెల్లకు ఒక ఉత్తరం మాత్రమే అందుకోవచ్చు. అలా   నెల్సన్‌ మండేలా ఇరవై ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ సహనం ఆయనను దక్షిణాఫ్రికా ప్రజలకు ప్రియతమ అధ్యక్షుణ్ని చేసింది. ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం’ పుస్తక రచయితగా మార్చింది.

అంత అందం సీతాకోకచిలుకకు ఊరికే రాలేదు. తన పుట్టుక వెనుక ఎంతో సహనం ఉంది. గుడ్డు లార్వా అవుతుంది. తరవాత అది ప్యూపాగా మారుతుంది. అప్పుడు అందమైన రెక్కలతో సీతాకోకచిలుక మనకు దర్శనం ఇస్తుంది. ఒక జన్మ కోసం నాలుగుసార్లు పుడుతుంది సీతాకోకచిలుక. కష్టాలను అధిగమించడానికే కాదు, విజయం సాధించడానికి కూడా సహనం చాలా అవసరం. విత్తనం మట్టిపొరల్లో చాలా కాలం వేచి ఉంటుంది. వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తి మానై పూలూ ఫలాలతో వర్ధిల్లుతుంది. ఏ విజయమూ వడ్డించిన విస్తరి కాదు. ఒకరోజులో వచ్చి పడేదీ కాదు. ప్రతి విజేత వెనుక వారి అనంత సహనశక్తి దాగి ఉంటుంది. కార్యసాధనలో అవరోధాలు సహజం. తుది విజయానికి సహనమే తిరుగులేని సాధనం. మహాత్ములైనా, మామూలు మనుషులైనా - ఎవరికైనా సరే కష్టాలు వస్తాయి. కాస్త ఓపిక పడితే అవి మనల్ని మరింత ధైర్యవంతులుగానూ, బలవంతులుగానూ చేస్తాయి. కాబట్టి జీవితంలో ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదు. దాన్నే విజయానికి చోదక శక్తిగా మలచుకోవాలి. సహనం వహించడం అంటే కేవలం వేచిచూడటం కాదు, వేచి ఉండే సమయంలో మంచి వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం అన్న బుద్ధుడి మాటలను జ్ఞప్తికి ఉంచుకోవాలి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మానవత్వమే... ఒక పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే పని ప్రారంభించారు. ఊడిపోతున్న రాతిగోడలను తొలగించసాగారు పనివాళ్లు. కానీ, నోట పురుగును కరచుకున్న ఒక బల్లి అక్కడక్కడే తిరుగుతూ వారి పనికి అడ్డం వస్తోంది. ఎన్నిసార్లు తరిమినా తిరిగి అక్కడికే వస్తోందది. విసిగిపోయిన పనివాళ్లు ఆలయ స్థపతికి విషయం చెప్పారు.
  • ఆ నాలుగూ... మానవ జీవితానికి మహర్షులు నాలుగు లక్ష్యాలను నిర్దేశించారు. అవే చతుర్విధ పురుషార్థాలుగా పేర్కొనే ధర్మార్థ కామ మోక్షాలు
  • జ్యేష్ఠం... శ్రేష్ఠం! సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది.
  • కైవల్యానికి ఆఖరి మెట్టు మట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే, పరమాత్మ అంశ అయిన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోనే లీనమవుతుంది.
  • రణం... కారణం మనిషి జీవితం అనేక సంఘర్షణల సమాహారం. ఈ సంఘర్షణలనే మనం నిత్యజీవన సమరాలుగా వ్యవహరిస్తాం.
  • ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
  • దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
  • సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.
  • దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 
  • శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.
  • తాపత్రయం! ‘ఎందుకీ తాపత్రయం?’ అనే ప్రశ్న తరచూ వింటూ ఉంటాం. అసలు ‘తాపత్రయం’ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మోక్షం గురించి తెలియాలి.