జ్యేష్ఠం... శ్రేష్ఠం!

Eenadu icon
By Editorial Team Published : 16 Jun 2026 03:18 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం కాబట్టి ఇది జ్యేష్ఠమైంది. 

జ్యేష్ఠ శుక్లపాడ్యమి నాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీరవ్రతం చేస్తారు. అంటే గన్నేరుపూలతో అమ్మవారిని పూజిస్తారు. కొందరు భద్ర చతుష్టయ వ్రతం కూడా చేసుకుంటారు. విదియనాడు శ్రాద్ధకర్మలు ఆచరించి, పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజుకు ‘సోప పదము’ అన్న పేరూ ఉంది. ‘రంభాతృతీయ’గా పేర్కొనే తదియ రోజున రంభావ్రతం చేస్తారు. ‘రంభ’ అంటే ‘అరటి’. పార్వతీదేవి స్వర్ణప్రతిమను అరటి చెట్టుకింద ఉంచి, పూజించి, వస్త్రదానం చేయడం ఆనవాయితీ. శుద్ధచవితి పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన పర్వదినమని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ రోజున ‘శుక్లాదేవి’నీ పూజిస్తారు. శుద్ధపంచమి కూడా పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. శుద్ధషష్ఠి నాడు అరణ్యక గౌరీవ్రతం, వింధ్యవాసినీవ్రతం చేస్తారు. దీనికే ‘స్కందషష్ఠి’ అన్న పేరు కూడా ఉంది. సప్తమినాడు ద్వాదశీ సప్తమి వ్రతం, వరుణ పూజ చేస్తారన్నది చతుర్వర్గ చింతామణి కథనం. శుద్ధఅష్టమిని దుర్గాష్టమి, త్రిలోచనాష్టమి అని పిలుస్తారు. ఈ రోజున శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమినాడు ఉపవాసం ఉండి, బ్రహ్మణీ దేవిని పూజిస్తారు. దశమికి ‘దశపాపహర దశమి’ అన్న పేరూ ఉంది. పది పాపాలను పోగొట్టే గొప్ప పర్వదినమని దీనికి పేరు. ఇది గంగావతరణ పుణ్యదినమని స్మృతికౌస్తుభం చెబుతోంది. 

శుద్ధఏకాదశికి ‘నిర్జల ఏకాదశి’ అన్న పేరూ ఉంది. ఈ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఏమాత్రం ఆకలికి తట్టుకోలేని భీముడు పట్టుదలతో ఈ ఒక్కరోజున ఉపవాసం చేసి ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాస పుణ్యఫలితం పొందాడంటారు. చంపక ద్వాదశిగా ప్రసిద్ధి పొందిన జ్యేష్ఠ శుక్ల ద్వాదశినాడు త్రివిక్రమ మూర్తిని అర్చిస్తారు. ఆదిశంకరుల కైలాస యాత్ర ఈ రోజుననే జరిగిందంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వటసావిత్రీ వ్రతం ఆచరిస్తారు. వటవృక్షం శ్రీమహావిష్ణు స్వరూపం. యముడితో పోరాడి భర్త సత్యవంతుణ్ని సజీవంగా వెంట తీసుకొచ్చిన సావిత్రి ఈ రోజున పూజలందుకుంటుంది. ఈ పుణ్యదినాన్ని ‘ఏరువాక పున్నమి’గా రైతుల పండుగగా జరుపుకొంటారు. కృష్ణయజుర్వేదంలో ఈ పర్వదినం గురించి సవివరంగా ఉంది.

బహుళఅష్టమి రోజున త్రిలోచన పూజ, తిందుకాష్టమీవ్రతం, శీతలాష్టమి వ్రతం ఆచరిస్తారు. బహుళ ఏకాదశిని అపర ఏకాదశిగా, యోగిని ఏకాదశిగా పేర్కొంటారు. శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించిన బహుళ ద్వాదశి ‘కూర్మ జయంతి’గా ప్రసిద్ధి చెందింది. పౌర్ణమినాడు వటసావిత్రీ వ్రతం చేయలేనివారు అమావాస్య నాడైనా చేయవచ్చని వ్రతవిధానం చెబుతోంది. ఇన్ని పర్వదినాలు ఉండటం వల్లనే జ్యేష్ఠం అత్యంతŸ శ్రేష్ఠం అన్న మాట జన వ్యవహారంలో స్థిరపడింది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సులభ ముక్తి సాధనం రోగికి వైద్యులు ఇచ్చిన ఔషధం గురించి తెలిసినా తెలియకపోయినా, అది తీసుకున్న తరవాత అతడి అనారోగ్యం నయమవుతుంది.
  • మానవత్వమే... ఒక పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే పని ప్రారంభించారు. ఊడిపోతున్న రాతిగోడలను తొలగించసాగారు పనివాళ్లు. కానీ, నోట పురుగును కరచుకున్న ఒక బల్లి అక్కడక్కడే తిరుగుతూ వారి పనికి అడ్డం వస్తోంది. ఎన్నిసార్లు తరిమినా తిరిగి అక్కడికే వస్తోందది. విసిగిపోయిన పనివాళ్లు ఆలయ స్థపతికి విషయం చెప్పారు.
  • ఆ నాలుగూ... మానవ జీవితానికి మహర్షులు నాలుగు లక్ష్యాలను నిర్దేశించారు. అవే చతుర్విధ పురుషార్థాలుగా పేర్కొనే ధర్మార్థ కామ మోక్షాలు
  • కైవల్యానికి ఆఖరి మెట్టు మట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే, పరమాత్మ అంశ అయిన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోనే లీనమవుతుంది.
  • విజయ రహస్యం కష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు.
  • రణం... కారణం మనిషి జీవితం అనేక సంఘర్షణల సమాహారం. ఈ సంఘర్షణలనే మనం నిత్యజీవన సమరాలుగా వ్యవహరిస్తాం.
  • ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
  • దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
  • సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.
  • దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 
  • శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.