పుంగనూరు ఘటన.. మిథున్‌రెడ్డి 100 మందితో వచ్చారు: అన్నమయ్య ఎస్పీ

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 16 Oct 2026 19:20 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

పుంగనూరు: మున్సిపల్‌ ఎన్నికల (AndhraPradesh Local Body Elections) నామినేషన్‌ కేంద్రానికి ఎంపీ మిథున్‌రెడ్డి దాదాపు 100 మంది అనుచరులతో కలిసి వచ్చారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. ఇవాళ ఉదయం పుంగనూరులో చోటు చేసుకున్న ఉద్రిక్తతపై ఆయన స్పందించారు. నామినేషన్‌ వేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరికి మాత్రమే కేంద్రం వద్దకు అనుమతి ఉందని, వంద మీటర్ల దూరం నిబంధనలను కూడా మిథున్‌రెడ్డి ఉల్లంఘించి గేట్లను వాహనాలతో ఢీ కొట్టారని చెప్పారు. ఈ ఘటనపై తెదేపా అభ్యర్థులు, స్థానికులు నిరసన తెలిపారని, ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగితే పోలీసులు చెదరగొట్టారని మీడియాకు తెలిపారు.‘‘ నామినేషన్‌ కేంద్రంలోకి ఒక వాహనం అతివేగంగా వచ్చింది. నామినేషన్‌ కేంద్రంలోని అభ్యర్థులు, ప్రజలపైకి దూసుకెళ్లింది. కొందరికి గాయాలైతే ఆస్పత్రికి తరలించాం. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా శిక్షిస్తాం’’ అని ఎస్పీ హెచ్చరించారు.

రౌడీయిజం చేస్తామంటే.. చూస్తూ ఊరుకోం: మంత్రి డీఎస్‌బీవీ స్వామి

పుంగనూరు, తిరుపతి ఘటనల్లో వైకాపా తీరుపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించి.. గొడ్డలి పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. మిథున్‌రెడ్డి వందలాదిమందితో నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లడమేంటని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే.. చర్యలు తప్పవన్నారు. ఏ ఎన్నికలైనా కూటమి ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 18:49 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడికి ఐదేళ్ల జైలు శిక్ష [ 16-10-2026] మైనర్ బాలిక(16)పై లైంగిక దాడికి యత్నించిన యువకుడికి కడప కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2023 మే 3న కొండ ప్రాంతంలోకి మేకలను తీసుకుని వెళ్లింది.
  • బద్వేలులో మహిళ దారుణ హత్య [ 16-10-2026] కడప జిల్లా బద్వేలులోని సుమిత్రానగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సాయిబాబా అనే వ్యక్తి ఆమె గొంతు కోసి పారిపోయాడు.
  • ఎక్కాల్సిన రైలులో టికెట్‌ దొరికితే ఒట్టు [ 16-10-2026] చదువు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం జిల్లాకు చెందిన చాలా మంది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇటువంటి వారు దసరాకు వచ్చేందుకు.. వెళ్లేందుకు రైలు టికెట్లు లభించడం లేదు.
  • యువత చేతిలో నే‘తలరాత’ [ 16-10-2026] జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. తొలుత కడప నగర పాలక, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల, కమలాపురం పురపాలకల్లో పోరు సాగనుంది.
  • నాడు నల్లేరుపై నడక.. నేడు ఎదురీత [ 16-10-2026] పులివెందుల.. మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్థానంలో స్థానిక ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్‌ వెలువడడంతో మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
  • అక్రమానికి నీరు.. జనానికి కన్నీరు [ 16-10-2026] సకల ప్రాణికోటికి నీళ్లు కావాలి. అవి తాగేందుకు పనికొచ్చేవై ఉండాలి. ఇంతటి కీలకమైన నీరు సామాన్యుల గొంతులకు చేరకుండా కొందరు తోడేస్తున్నారు. తాగడానికి కాస్త శుభ్రమైన నీళ్ల కోసం జనం అల్లాడిపోతుంటే..
  • పాడి రైతుకు బాసట.. రాయితీలతో ఊరట [ 16-10-2026] పాడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆ మేరకు వారికి ఎంతో ఊరట కలిగించేలా పలు పథకాలు అమలు చేస్తోంది. ఇవి పశు పోషకుల ఆర్థికాభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నాయి.
  • అనుమతి గోరంత.. తవ్వేది కొండంతా [ 16-10-2026] ప్రకృతి సిద్ధమైన కొండలు కనుమరుగు అవుతున్నాయి. పలువురు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని వై.కోడూరు గ్రామ సమీపంలో సర్వే నంబర్‌ 756లో దాదాపు 343 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది.
  • అవినీతికి పాల్పడిన సీనియర్‌ అసిస్టెంట్‌పై చర్యలు [ 16-10-2026] కడప అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాల వ్యవహారంలో నాటి సీనియర్‌ అసిస్టెంట్‌ ఆవుల రంగనాథ్‌బాబుపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆయనకు చెల్లించే మూడు వార్షిక వేతన ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • పరామర్శించి వస్తుండగా కబళించిన ప్రమాదం [ 16-10-2026] ఇటీవల రాజమహేంద్రవరంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన చెన్నారెడ్డి కుటుంబాన్ని లింగాలకుంటలో పరామర్శించి తిరిగి అట్లూరుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఆదెన యశోద (57) మృతి చెందారు.
  • కోడలు, మనవడు వేధిస్తున్నారని ఫిర్యాదు [ 16-10-2026] నలుగురు కుమారులను పెంచి పోషించి పెద్ద చేశారు. వివాహాలు చేశారు. వృద్ధాప్యం వచ్చే సరికి పట్టించుకోవడం లేదని..
  • పెళ్లి పేరిట మోసం.. యువకుడి అరెస్ట్‌ [ 16-10-2026] పెళ్లి పేరిట యువతిని మోసం చేసిన ఘటనలో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ తెలిపారు. ఆయన వివరాల మేరకు..
  • దివ్య వృక్షం.. భవ్య రూపం [ 16-10-2026] తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. గజరాజులు ముందు నడవగా మంగళవాయిద్యాలు, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది.
  • ఆమె ఓటే.. శాసనం [ 16-10-2026] పురపాలిక ఎన్నికల నగారా మోగింది. ఆశావహులు సీట్ల కోసం వేట సాగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
  • సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా [ 16-10-2026] జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు తప్పదని ఎస్పీ ధీరజ్‌ హెచ్చరించారు.
  • బీరు సీసాతో దాడి చేసి.. గొంతు కోసి [ 16-10-2026] ఏడు నెలలుగా దూరంగా ఉన్న భర్త ఇంటికి వెళ్లి మాట్లాడటంతో ఆ భార్య ఆనందించింది. మాయమాటలు చెప్పి నమ్మించడంతో పిలిచిన చోటుకు వచ్చింది. అదే ఆమె చేసిన తప్పయింది.
  • పిడుగుపాటుకు గురై మహిళా కూలీ మృతి [ 15-10-2026] కడప జిల్లా బి.కోడూరు మండల పరిధిలోని గుంతపల్లికి చెందిన ఓ మహిళ పిడుగుపాటుకు గురై మృతిచెందింది.
  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలో 5 అత్యంత సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు ఎస్సై హనుమంతు తెలిపారు.
  • ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి [ 15-10-2026] అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జడ్పీ సీఈవో)  లక్ష్మీపతి గురువారం పరిశీలించారు.
  • ధరల నియంత్రణకు అధికారుల తనిఖీలు [ 15-10-2026] ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ దుకాణాలు, గోదాములను తనిఖీ చేసినట్లు డీఎస్వో రెడ్డి చంద్రిక, లీగల్‌ మెట్రాలజీ అధికారి మహ్మద్ గౌస్, ఫుడ్‌ సేఫ్టీ అధికారిణి హిమబిందు పేర్కొన్నారు.
  • భారీగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.. నిందితుల అరెస్ట్‌ [ 15-10-2026] వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో రూ.8.56 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నలుగురు నిందితులను జమ్మలమడుగు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
  • మదనపల్లిలో దారుణం.. భార్యను బీరు బాటిల్‌తో కొట్టి హత్య [ 15-10-2026] మదనపల్లిలోని ఓ లాడ్జిలో దారుణం చోటుచేసుకుంది.
  • మగువ.. నువ్వే ఏలిక.. నిర్ణేత [ 15-10-2026] స్థానిక సంగ్రామానికి తెర లేచింది. ఎన్నికల సంఘం ప్రకటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పుర పోరుకు సమయం కూడా లేకపోవడంతో గెలుపు గుర్రాల కోసం నేతలు అన్వేషిస్తున్నారు.
  • చెత్త కాదు.. రూ. 1,68,31,384 సంపద [ 15-10-2026] గ్రామాల పరిశుభ్రతతో పాటు వ్యర్థానికి అర్ధం చెప్పేలా స్వచ్ఛ రథాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. సంక్రాంతి నాటి నుంచి ఇవి పల్లెల్లో వ్యర్థాలను స్వీకరిస్తూ..
  • ఎన్నికల రణం.. పోలీసింగ్‌ సిద్ధం [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగింది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది.
  • కాసుల కక్కుర్తి.. పోగుబంధం బలి [ 15-10-2026] సిద్దవటం మండలం మాధవరం-1, ఉప్పరపల్లె, మాధవరం-1, 2, 3 గ్రామాల్లో చేనేత కార్మికులు ఎక్కువ. మాధవరం-1, ఉప్పరపల్లె గ్రామాల్లో కొందరు దళారుల అవతారమెత్తి లబ్ధిదారుల ఎంపికను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
  • మోగిన సై‘రన్‌’ [ 15-10-2026] స్థానిక సంస్థల సమరానికి సైరన్‌ మోగింది. వరుసగా సాగే మున్సిపల్, జడ్పీ, పంచాయతీ పోరు ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు అధికారులనూ పరుగులు తీయిస్తోంది. ఏడు వారాల వ్యవధిలో పురపాలక, పరిషత్తు, పంచాయతీల్లో వెనువెంటనే ఎదుర్కోవాల్సి రావడం అగ్ని పరీక్షగా మారింది.
  • బడికి డుమ్మా.. కుదరదు కన్నా! [ 15-10-2026] ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరంలో పిల్లల హాజరు 75 శాతానికి తగ్గకుండా మార్పులు తెచ్చింది.
  • కాఫీ పొడి పొట్లాల మాటున ఎర్రచందనం అక్రమ రవాణా [ 15-10-2026] కంటెయినర్‌లో కాఫీ పొడి పొట్లాల మాటున ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముఠాపై వైఎస్సార్‌ కడప జిల్లా పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.81.34 లక్షలు విలువైన 70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
  • పేటీఎం ఏజెంట్‌ పేరిట రూ.లక్షలు మోసం [ 15-10-2026] చిరు వ్యాపారులకు పేటీఎం ఇన్‌స్టాల్‌ చేస్తానని చెప్పి వారి చరవాణి ద్వారా రూ.14.50 లక్షలు కాజేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే..
  • నోరు తెరిచిన మూడో మలుపు [ 15-10-2026] పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులోని మూడో మలుపు అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పటికి 40 మందిని మింగిన ఈ మలుపులో రాకపోకలు సాగించాలంటేనే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు.
  • ఎవరో పుర పీఠాధిపతి [ 15-10-2026] పురపాలక ఛైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్న ఆ నలుగురు మీకు తెలుసా? వారిలో ఎవరు విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు? వార్డుల పునర్విభజనతో మీరు ఉంటున్న ప్రాంతం ఏ వార్డు పరిధిలోకి వస్తుంది.
  • రిజర్వేషన్‌ ఖరారు.. ఎన్నికల వేడి షురూ! [ 15-10-2026] జిల్లా గ్రామీణ రాజకీయాల్లో కదలిక వచ్చింది. రాబోయే పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల సమరానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.
  • జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు [ 15-10-2026] జిల్లాలోని 39 మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీపీల స్థానాల రిజర్వేషన్లను అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులు ముమ్మర కసరత్తు చేశారు.
  • యువతా.. ‘కొలువు’దీరుతారా! [ 15-10-2026] నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరోమారు తీపి కబురు చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ - 2025 పేరుతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది.