జ్ఞాన ప్రదాయిని

Eenadu icon
By Editorial Team Published : 16 Oct 2026 01:52 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

సరస్వతీదేవి బ్రహ్మశక్తి- సృష్టికి జ్ఞానాన్ని, వాక్కుకు అర్థాన్ని, మానవ బుద్ధికి వివేకాన్ని ప్రసాదించే చైతన్యశక్తి. సద్బుద్ధి అనే జ్ఞానదీపాన్ని వెలిగించే జగన్మాత ఆవిర్భవించిన శుభసమయమే దసరా నవరాత్రులలో మూలా నక్షత్ర విశిష్టత. ‘మూల’ అంటే సమస్త విశ్వానికి ఆధారం. జ్ఞానానికి మూలమైన శబ్దబ్రహ్మ రూపిణిని ఆవాహన చేయడానికి ఈ నక్షత్రం అత్యంత ప్రశస్తమైనది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని పొందడానికి ఈ నక్షత్రంలోనే దేవిని ఉపాసించాడని పురాణకథనం.

సమస్త కళలకు మూలమూర్తి... సరస్వతీదేవి. రుగ్వేదం ‘అంబితమే నదీతమే దేవితమే సరస్వతి’ అని ఆమెకు ప్రణమిల్లింది. తల్లులలో, నదులలో, దేవతలలో దివ్యమైనదని అర్థం. జీవుడిలో ప్రాణచైతన్యానికి, జ్ఞానధారకు, వాక్‌ ప్రవాహానికి సరస్వతీ స్వరూపమే ఆధారం. రుగ్వేదంలోని ప్రసిద్ధ ‘వాక్‌సూక్తం’లో ఆత్మచైతన్య రూపంలో సకల జీవులలోనూ, సమస్త దేవతలలోనూ నేనున్నానని వాగ్దేవతే స్వయంగా పేర్కొంది. లౌకిక విజ్ఞానాన్ని అందించడంతో పాటు, అంతరంగంలో నిద్రాణమై ఉన్న సత్య, చైతన్య, వివేకాలను మేల్కొలిపే మహాశక్తే ఈ ‘వాక్‌’.

దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, లలితా సహస్రనామాలలో పేర్కొన్న సరస్వతీ దేవి నామధేయాల్లో గొప్ప అంతరార్థాలున్నాయి. ‘శారద’గా ఆమె అజ్ఞాన తాపహారిణి. ‘భారతి’గా సకల వేద విజ్ఞానవిద్యా ప్రదాయిని. సత్యం, సుందరం, సాధు శబ్దమయమైన వాక్‌ సమర్థతను ‘వల్లకి’, ‘సుముఖి’ నామాలు అనుగ్రహిస్తున్నాయి. సత్వగుణ సమన్విత ఆధ్యాత్మిక నిర్మలత్వాన్ని ‘మహాశ్వేత’, ‘శ్వేతాంబర’ భావనలు ప్రతిపాదిస్తున్నాయి. సృష్టి సంకల్పానికి మూలమైన బ్రాహ్మీ శక్తిగా ‘హరిప్రియ’, ‘విరించిప్రియ’ రూపాలు దర్శనమిస్తున్నాయి.  మానవ చేతనలో విచక్షణా జ్ఞానాన్ని మేల్కొలిపే గొప్ప సంబోధనలుగా ‘భాస్వతి’, ‘ప్రజ్ఞాపారమిత’ నామాలు విరాజిల్లుతున్నాయి.

సరస్వతీదేవి బాహ్య అలంకారిక స్వరూపం మానవ చిత్తవృత్తులను పారమార్థిక స్థితికి నడిపించే నిగూఢ సంకేత సమాహారం. మనిషి సంసారమనే లౌకిక అజ్ఞాన పంకంలో జీవిస్తున్నప్పటికీ, అహంకార మోహ వికారాలకు అతీతంగా మెలగాలనే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతాన్నిస్తుంది దేవి ఆసీనురాలైన ‘శ్వేత కమలం’. విచ్చుకున్న కలువరేకులు విజ్ఞానం విస్తరించడాన్ని, చైతన్యాన్ని సూచిస్తాయి. జగజ్జనని ధరించిన ‘పుస్తకం’- లౌకిక, పారమార్థిక జ్ఞాన భాండాగారాన్ని ప్రతిబింబిస్తుండగా, ‘జపమాల’ అంతర్ముఖ ప్రయాణానికి, సాధకుడి చిత్త ఏకాగ్రతకు, ఆత్మసాక్షాత్కార సాధనకు మార్గనిర్దేశం చేస్తుంది. అసత్యాన్ని పరిత్యజించి, సత్యమైన జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించాలని హంస తత్వం గుర్తుచేస్తుంది.

జీవుణ్ని అజ్ఞాన బంధాల నుంచి, సంసార తాపాల నుంచి శాశ్వతంగా విముక్తుణ్ని చేసేదే నిజమైన విద్య. హనుమంతుడి అనన్య వ్యాకరణ నైపుణ్యాన్ని శ్రీరాముడు ప్రశంసించడం వెనుక, యక్షప్రశ్నల ద్వారా ధర్మరాజు పొందిన జ్ఞానపరీక్ష వెనుక ఉన్న అంతరార్థం- విద్య శీలసంపదతో, ధర్మబద్ధమైన వివేకంతో కూడిన చైతన్య సాధన అని నిరూపించడమే. దసరా నవరాత్రుల శుభవేళ- మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటూ అందరికీ జ్ఞాన వెలుగులను పంచేందుకు పునరంకితం కావడమే జగన్మాతకు మనమిచ్చే నిజమైన నీరాజనం!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శ్రీమంతుడు జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.
  • మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
  • శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
  • రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
  • విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
  • నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
  • తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
  • ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
  • పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
  • గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
  • మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
  • గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం. 
  • వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి. 
  • అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
  • విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
  • మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
  • జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి.  భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
  • గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
  • విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.
  • జితేంద్రియులు సుఖదుఃఖాలు అస్థిరాలు. వాటి గురించి వ్యథ చెందడం వ్యర్థం. విషయవాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారే జితేంద్రియులు. అంటే, ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం.