గగనతలంలో మెచ్చిన ఆహారం..

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 16 Oct 2026 18:29 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

రైలు, దూర ప్రయాణాల్లో అమ్మ చేసిన పులిహోర.. చపాతిలో చికెన్‌ కర్రీని వేసుకుని తింటుంటాం. విమాన ప్రయాణాల్లో వీటిని తీసుకెళ్లే వీలుండదు. వారు ముందుగా నిర్ణయించి అందజేసిన దాన్నే తినాలి. అందుకే మారుతున్న ట్రెండ్, ప్రయాణికుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా విమానయాన సంస్థలు ప్రత్యేక డైట్‌ మెనూలను అందుబాటులోకి తెచ్చాయి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారి నుంచి ఫిట్‌నెస్‌ ప్రేమికుల వరకు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ) నిబంధనల ప్రకారం ఆయా విమానయాన సంస్థలు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి.

ప్రధాన డైట్‌లు.. ఐఏటీఏ కోడ్‌లు

  • విమానయాన రంగంలో ప్రత్యేక ఆహారాలను గుర్తుపట్టేందుకు నిర్దిష్టమైన అంతర్జాతీయ కోడ్‌లను ఉపయోగిస్తారు.
  • డయాబెటిక్‌ మీల్‌(డీబీఎంఎల్‌): మధుమేహ బాధితుల కోసం రూపొందించిన ఈ ఆహారంలో శుద్ధిచేసిన చక్కెర, ప్రాసెస్‌ చేసిన పిండి పదార్థాలు ఉండవు. అధిక ఫైబర్‌తో కూడిన ఆహారం, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, తక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని వడ్డిస్తారు.
  • లో-సోడియం/బీపీ మీల్‌ (ఎల్‌ఎస్‌ఎంఎల్‌): అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి తక్కువ ఉప్పుతో చేసిన ఆహారాన్ని అందిస్తారు. రుచి కోసం ఉప్పు బదులుగా సహజసిద్ధమైన మూలికలు, నిమ్మరసం ఉపయోగిస్తారు.
  • గ్లూటెన్‌ ఫ్రీ మీల్‌(జీఎఫ్‌ఎంఎల్‌): గ్లూటెన్‌ అలెర్జీ లేదా సెలియాక్‌ వ్యాధి ఉన్నవారి కోసం గోధుమలు, మైదా, బార్లీ లేకుండా వరి, జొన్నలు, తాజా పండ్లు, కూరగాయలతో ఈ మెనూ సిద్ధం చేస్తారు.
  • హై-ప్రొటీన్‌ అండ్‌ ఆసియన్‌ వెజిటేరియన్‌ (ఏవీఎంఎల్‌/వీజీఎంఎల్‌): ఫిట్‌నెస్‌ ప్రేమికుల కోసం పనీర్, పప్పుధాన్యాలు, నట్స్, స్ప్రౌట్స్‌తో కూడిన ప్రొటీన్‌ ఆహారాన్ని అందిస్తారు.
  • జైన్‌ అండ్‌ లో-క్యాలరీ మీల్స్‌ (వీజేఎంఎల్‌/ఎల్‌సీఎంఎల్‌): భూమి లోపల పండే దుంపకూరలు, ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసే జైన్‌ మీల్స్, బరువు తగ్గాలనుకునే వారి కోసం తక్కువ క్యాలరీలు ఉండే లో-కొలెస్ట్రాల్‌ మీల్స్‌ ఇస్తారు.
  • ఇవే కాదు.. వెజిటేరియన్‌ లాక్టో ఓవో మీల్‌(వీఎల్‌ఎంఎల్‌), కోషర్‌ మీల్‌(కేఎస్‌ఎంఎల్‌), చైల్డ్‌ మీల్‌ (సీహెచ్‌ఎంఎల్‌) ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి.
  • అంతర్జాతీయ సుదూర విమానాలు: ఎమిరేట్స్, ఎయిర్‌ ఇండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వంటి సంస్థలు ఉచితంగా 20కి పైగా ప్రత్యేక డైట్‌ ఆప్షన్లు అందిస్తున్నాయి. ప్రయాణానికి కనీసం 24-48 గంటల ముందే వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • డొమెస్టిక్‌ అండ్‌ లో-కాస్ట్‌ ఎయిర్‌లైన్స్‌: ఇండిగో, ఆకాశ ఎయిర్‌ వంటి స్వదేశీ విమాన సర్వీసుల్లో ముందస్తు చెల్లింపు(ప్రీ బుక్డ్‌ పెయిడ్‌ మీల్స్‌) ద్వారా ప్రొటీన్‌ రిచ్‌ సలాడ్లు, ఫ్రూట్‌ బౌల్స్, డిటాక్స్‌ జ్యూస్‌లు, షుగర్‌-ఫ్రీ ఓట్స్‌ కుకీస్‌ పొందే అవకాశం ఉంటుంది.
  • బిజినెస్‌ అండ్‌ ఫస్ట్‌ క్లాస్‌: ప్రీమియం క్లాస్‌లలో ప్రయాణించే వారి వ్యక్తిగత డైట్‌ ప్లాన్‌కు తగ్గట్టుగా మీల్స్‌ సిద్ధం చేసి ఇస్తారు.

విమాన టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే సెలెక్ట్‌ మీల్‌ ఆప్షన్‌ ద్వారా లేదా బుకింగ్‌ పూర్తయిన తర్వాత విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లోని మేనేజ్‌ మై బుకింగ్‌ సెక్షన్‌ ద్వారా ఉచితంగా లేదా నిర్ణీత రుసుం చెల్లించి నచ్చిన డైట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, విమానం బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

పెద్ద ఊరట:విమానాల్లో నచ్చిన ఆహారం ఎంచుకునే అవకాశం ఉండటం పెద్ద ఊరట. వ్యాపారరీత్యా నేను తరచూ ఆస్ట్రేలియా వెళ్లి రావాల్సి వస్తుంది. ఈ సదుపాయం వల్ల విమాన ప్రయాణంలో నచ్చిన మెనూ ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది.

మా స్వస్థలం గుంటూరు. లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నా. ఇకపై గుంటూరు నుంచి లండన్‌ వచ్చే ప్రతిసారి విమానంలో నచ్చిన ఆహారం ఎంచుకోవచ్చు. ఎవరికి.. ఎలాంటి భోజనం కావాలో ముందే స్పష్టత ఉండటం వల్ల ఆహారం వృథా తగ్గుతుంది.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 18:03 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పిడుగులా.. అలా.. అలా..! మొబైల్‌ ఫోన్‌.. ఆధునిక తరం ల్యాప్‌టాప్‌ తదితర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఛార్జింగ్‌ పెట్టాలంటే యూఎస్‌సీ సీ కేబుల్‌ ఉందా? అని అడుగుతాం.
  • సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
  • పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్‌ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్‌ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
  • ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.
  • ప్రగతి సారథులు మహిళలే ‘స్వయం సహాయక సంఘాలు ఊహించని రీతిలో విస్తరించాయి. గ్రామీణ జీవన విధానాన్ని సమూలంగా మారుస్తూ, దేశ సమగ్రాభివృద్ధికి వెలకట్టలేని సేవలందిస్తున్నాయి.
  • నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే.. ఆ కుటుంబం పైకొస్తుంది.. స్త్రీలు అభివృద్ధి చెందితే.. దేశం పురోగమిస్తుంది.
  • రాష్ట్రపతికి మంగళగిరి చేనేత చీర,ఏటికొప్పాక కళాకృతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
  • చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
  • కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.
  • సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
  • అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.
  • ఆకాంక్షలు, విజయాలకు చిరునామా ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది.
  • బ్యాంకింగ్‌ వ్యవస్థకు వెన్నెముక గ్రామీణ మహిళలు గ్రామీణ మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు.
  • స్త్రీ శక్తితోనే సర్వతోముఖాభివృద్ధి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజసిద్ధ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వస్తువులను సరస్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.
  • శ్రీవారి వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం...
  • విదేశీ నిపుణులకు ‘డయాఫ్రం వాల్‌ డాక్యుమెంట్‌’ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి ప్యానళ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై 36 పుస్తకాలతో సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను విదేశీ నిపుణుల బృందానికి అధికారులు గురువారం సమర్పించారు.
  • మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ బైక్‌ ర్యాలీ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకునేలా తలపెట్టిన ‘జాతీయ ద్విచక్ర వాహనాల ర్యాలీని (నేషనల్‌ మోటర్‌ సైకిల్‌ ర్యాలీ) డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
  • శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • స్కందమాతగా భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.