తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఐపీఎస్‌లు

Eenadu icon
By Telangana News Desk Published : 16 Oct 2026 04:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఏఐ ఆధారిత నేరాలు, సైబర్‌ ముప్పు, డార్క్‌నెట్, బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత రూపంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా యువ ఐపీఎస్‌ అధికారుల్ని తీర్చిదిద్దుతున్నట్లు జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సుజిత్‌ పాండే తెలిపారు. ఈ నెల 17న 78వ ఆర్‌ఆర్‌(రెగ్యులర్‌ రిక్రూట్‌) బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల దీక్షాంత్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

‘మారుతున్న నేరాల సరళికి అనుగుణంగా ఐపీఎస్‌ల శిక్షణ సిలబస్‌లో మార్పులు చేశాం. పీబీఏ(ప్రోగ్రెసివ్‌ స్కిల్‌ బెంచ్‌ మార్క్‌ అసెస్‌మెంట్‌), క్యూబీఏ(క్వాలిఫైయింగ్‌ బెంచ్‌మార్క్‌ అసెస్‌మెంట్‌) విధానంతో అభ్యర్థుల శక్తిసామర్థ్యాలను అంచనా వేస్తున్నాం. సైబర్, ఆర్థిక మోసాలపై ప్రత్యేక కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నాం. 78వ ఆర్‌ఆర్‌ బ్యాచ్‌లో మొత్తం 151 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 135 మంది ఐపీఎస్‌లు కాగా 16 మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన అధికారులు ఉన్నారు. మొత్తం 37 మంది మహిళా అధికారులున్నారు. తెలుగు రాష్ట్రాలకు 10 మంది ఎంపికయ్యారు. దీక్షాంత్‌ పరేడ్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ హాజరవుతారు’ అని తెలిపారు. శిక్షణలో ఉన్న మహిళా అధికారికి లైంగిక వేధింపుల కేసు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ ఘటన నేను బాధ్యతలు తీసుకోవడానికి ముందు జరిగింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు విశాఖ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున దానిపై వ్యాఖ్యానించలేను’ అని పేర్కొన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సాగు.. తాగునీటికి కటకట ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
  • కేసీఆర్‌ ఫాంహౌస్‌కు ఆ వెసులుబాటు ఎందుకు? రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాటు కేసీఆర్‌కు ఎందుకు? కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి.. అక్కడి నుంచి ఆయన ఫాంహౌస్‌లోకి సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
  • యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ సీఈపై వేటు విద్యుదుత్పత్తి, సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
  • ఇంటర్‌ విద్యార్థులకు ‘నకిలీ’ తిప్పలు రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వేల మంది ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రతి సంవత్సరం అఫిలియేషన్‌(అనుబంధ అనుమతి) సమస్య వెంటాడుతూనే ఉంది.
  • విదేశీ బొగ్గు దిగుమతిలో భారీ కుంభకోణం విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.
  • కేటీఆర్‌ లేఖపై ఏ విచారణకైనా సిద్ధం యాదాద్రి పవర్‌ ప్లాంటుకు విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించి 2016లోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్‌ విదేశీ బొగ్గు గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (20) పువ్వులనే దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప పండగ బతుకమ్మని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.
  • ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు.
  • ఎల్‌నినో కోరలు చాచింది.. విద్యుత్తు వృథాకు బ్రేకులు వేద్దాం! ఎల్‌నినో తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ప్రభావం క్రమంగా ఒక్కో రంగంపై కనిపించడం మొదలైంది.
  • మ్యూల్‌ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్‌ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
  • మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్‌ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ పేర్కొన్నారు.
  • మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణం మద్రాస్‌ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
  • రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
  • స్పర్శ్‌ హాస్పీస్‌ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్‌ హాస్పీస్‌’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
  • మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్‌-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
  • ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండుతో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
  • మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్‌ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • జాతీయ ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ ప్రాజెక్టుల ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.

English Translation

10 IPS for Telugu states

Eenadu icon
By Telangana News Desk Published : 16 Oct 2026 04:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Eenadu, Hyderabad: AI based Sujith Pandey, Director, National Police Academy, said that young IPS officers are being trained to face challenges in the form of crime, cyber threats, darknet and blockchain technology. Deekshant parade of 78th RR (Regular Recruit) batch IPS officers is being organized on 17th of this month. He disclosed the details in a press conference on Thursday.

'We have made changes in the training syllabus of IPS in accordance with the changing pattern of crimes. We are assessing the capabilities of the candidates with PBA (Progressive Skill Benchmark Assessment) and QBA (Qualifying Benchmark Assessment) system. We provide training through special courses on cyber and financial frauds. A total of 151 people completed the training in the 78th RR batch. Among them, 135 are IPS and 16 are officers from Nepal, Bhutan and Maldives. There are total 37 women officers. 10 people have been selected for Telugu states. Union Home Secretary Govind Mohan will attend the Deekshanth Parade, he said. When reporters mentioned about the case of sexual harassment of a female officer in training.. 'That incident happened before I took charge. As the investigation of the case is currently under the auspices of the Visakhapatnam Committee, I cannot comment on it. src="https://assets.eenadu.net/article_img/gh151026main-2d.webp" alt="" class="img-fluid rounded">

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Cultivation. The government is preparing an action plan to deal with the conditions created in the state due to the influence of El Nino.
  • Why this flexibility for KCR Farmhouse? Why does KCR have special arrangements and facilities that are not available to four crore people in the state? Digging a canal from Kondapochamma Reservoir to Panchpandavula Pond.. CM Revanth Reddy accused that he diverted the irrigation water to the farmhouse from there. The government has taken action in accordance with Chief Minister Revanth Reddy's warning that negligence in electricity generation and supply will not go unnoticed. Thousands of inter students studying in private junior colleges in the state and their parents are haunted by the problem of affiliation every year.
  • A huge scam in foreign coal import. The Executive President of India KTR accused the state government of conspiring a huge scam of Rs.3 thousand crores under the guise of importing foreign coal.
  • Prepare for any inquiry on KTR's letter In 2016, the KCR government signed an agreement regarding the import of foreign coal for the Yadadri Power Plant. It is ironic that KTR is now writing a letter about foreign coal.
  • News in Brief (20) Governor Shiv Pratap Shukla said that Bathukamma is a great festival where flowers are worshiped as divine form.
  • Obesity. Obesity is a big problem from children to adults. It's not all that people do to reduce this.
  • El Nino has spread its teeth.. Let's put brakes on the wastage of electricity! With the intensity of El Nino, the effect of deficit rainfall in Telugu states is gradually starting to be felt in each sector. "It is enough to open a bank account and give us the details. A young man from Suryapet district was hoping for the tricks of cyber criminals who said that there will be no rain every month.
  • We can know where the fraud is.. Six senior lawyers are standing on the same side and ready to argue, we can know where the fraud is. This is not a big problem," said the lawyers for the petitioners. Supreme Court judge Justice Sundaresh said.
  • We will be shining.. We will die in 3 weeks.. Like polished emeralds.. Head and abdomen green in color.. This beautiful looking insect with shining wings is known as 'Binganna', gold bug or jeeranga bug by the villagers.
  • Justice Vinod Kumar sworn in as High Court Judge Justice Tadakamalla Vinodkumar, who was transferred from the Madras High Court to Telangana, took oath as a High Court judge on Wednesday.
  • Bathukamma, a festival that upholds the self-respect of women: Minister Seethakka Minister Seethakka stated that Bathukamma is a festival that upholds the self-esteem of Telangana women.
  • The aim is to make the state compete with the world. Deputy Chief Minister Bhatti Vikramarka said that by 2047, efforts will be made to achieve a three trillion dollar economy in the state and make Telangana compete with the world in development.
  • Sparsh Hospice is a source of pride for the state: Ponguleti State Revenue Minister Ponguleti Srinivasa Reddy said that Khajaguda 'Sparsh Hospice' which stands by the patients at the most critical stage of life is a pride of Telangana.
  • Do not create water disputes between Mahabubnagar-Nalgonda districts. Legislative Council Chairman Gutta Sukhender Reddy said that it is not appropriate for the Irrigation Department officials and some public representatives to act in such a way as to create water disputes between Mahabubnagar-Nalgonda districts. Discoms are focusing on transformer failures with huge increase in power demand.
  • Consistency in our industrial processes. CM Revanth Reddy called upon young entrepreneurs and investors to come forward to achieve the goal of Telangana Rising. Students of the state have excelled in the Inspire competitions of science projects organized at the national level.