భారతీయ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు..!

Eenadu icon
By Business News Team Updated : 16 Oct 2026 13:06 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ కంపెనీల ఏఐ ఏజెంట్లు (AI agents) అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు ఇటీవల ఆందోళన కలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు భారతీయ సంస్థల (Indian Firms) కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడినట్లు భారత సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ హెచ్చరించింది. వ్యక్తిగత డేటా, రహస్య సమాచారం, ఇతర కీలక రికార్డులను యాక్సెస్‌ చేసినట్లు వెల్లడించింది. పరిశోధనల మూల్యాంకనం వేళ ఈ ఏజెంట్లు తమ పరిధి దాటినట్లు ఆ సంస్థ తెలిపింది.

తాము రెండు రకాల ఉల్లంఘనలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ (CERT-In) పేర్కొంది. మొదటిది.. ఏఐ మోడళ్లకు సంబంధించనదని.. మూల్యాంకనం, పరిశోధన సమయంలో ఏఐ మోడల్ ప్రొవైడర్ల నుంచి సిస్టమ్‌లలోకి ప్రవేశించడమని తెలిపింది. రెండోది సైబర్‌ దాడులకు చెందినదని.. అధికారిక ప్రవేశం పొందడానికి సైబర్‌ నేరగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఓపెన్-సోర్స్ ఏజెంటిక్ ఏఐ సాధనాలను ఉపయోగించడం అని చెప్పింది. ప్రభావిత సంస్థల సున్నితమైన డేటాను ఏఐ ఏజెంట్లు (AI agents) యాక్సెస్ చేయగలిగాయని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ యాక్సెస్ పొందడానికి వీలు కల్పించే క్రెడెన్షియల్స్, కనెక్షన్ సెట్టింగ్‌లను సంపాదించడానికి ఏజెంట్లు సైబర్‌ సెక్యూరిటీ బలహీనతలను ఉపయోగించుకున్నట్లు పేర్కొంది. ఈ అనధికార ప్రవేశాలను ప్రభావిత సంస్థలు గుర్తించలేకపోయాయని తెలిపింది. అయితే, ఏ సంస్థలు ప్రభావితమయ్యాయనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. 

  • పోటీకి భయపడేది లేదు: మస్క్‌కు రిలయన్స్‌ కౌంటర్‌

హ్యాంకింగ్‌ను నివారించడానికి తగిన ప్రయత్నాలు చేయని బాధిత కంపెనీలపైనే పలుమార్లు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బలహీనమైన పాస్‌ వర్డ్‌లు, ఇతర సమాచార భద్రతా సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని డెవలపర్లు, కంపెనీలకు సెర్ట్-ఇన్ సూచించింది. అంతే కాకుండా టెక్‌ సంస్థలు తమ ఏఐ ఏజెంట్లపై పరిశోధనలు చేసే సమయంలో అవి థర్డ్-పార్టీ సిస్టమ్‌లను చేరుకోకుండా నిరోధించే ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. జులైలో 700 మోసపూరిత ఓపెన్‌ ఏఐ (Open AI) ఏజెంట్లు ‘హగ్గింగ్ ఫేస్‌’ సంస్థను హ్యాక్ చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లను సైతం యాక్సెస్ చేయడానికి ఏఐ ఏజెంట్లు ప్రయత్నించాయి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 13:03 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పోటీకి భయపడేది లేదు: మస్క్‌కు రిలయన్స్‌ కౌంటర్‌ Musk-Reliance: భారత్‌లో స్టార్‌లింక్‌ రాకను కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని, భారత ప్రధాని ముఖేశ్‌ అంబానీ అంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
  • టెస్లా ఎగురుతోంది.. మస్క్‌ కంపెనీ నుంచి ‘ఫ్లయింగ్‌ కారు’ Elon Musk: వినూత్న ఆవిష్కరణలతో కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి ఆటోమొబైల్‌ కంపెనీలు. ఇందులో ఒకటే ‘ఎగిరే కారు’.
  • 2030 కల్లా 6జీ తెస్తాం 6జీ సాంకేతికతపై జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌) పనిచేస్తోందని, 2030 సంవత్సరంతో మొదలయ్యే దశాబ్దంలో వాణిజ్యపరంగా ఆ సేవలను ఆవిష్కరిస్తామని కంపెనీ ఎండీ ఆకాశ్‌ అంబానీ  పేర్కొన్నారు.
  • విప్రో లాభం రూ.3,200.60 కోట్లు ‘మేం పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాలనివ్వడం ప్రారంభించాయి. అవి కొత్త మార్కెట్లలో విజయం సాధించడానికి, కొత్త క్లయింట్లను చేర్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న సంబంధాలను  మెరుగుపరచుకోవడానికి ఉపయోగ పడుతున్నాయి.’ 
  • టెక్‌ మహీంద్రా 1:1 బోనస్‌ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జులై- సెప్టెంబరు త్రైమాసికానికి రూ.1,585.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
  • సూచీలకు కొనుగోళ్ల పండగ మదుపర్ల కొనుగోళ్ల జోరుతో దేశీయ సూచీలు గురువారం దుమ్మురేపాయి. బ్యాంకులు, ఐటీ, రిలయన్స్‌ షేర్లు లాభాలతో కళకళలాడాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ మూడు వారాల గరిష్ఠానికి చేరాయి.
  • కార్ల సరఫరాలు 30.7% పెరిగాయ్‌ ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు 13,60,687 ప్రయాణికుల వాహనాలు (పీవీ - కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) సరఫరా అయినట్లు వాహన తయారీదార్ల సంఖ్య సియామ్‌ గురువారం వెల్లడించింది.
  • డ్రోగో ఏరోస్పేస్‌కు మరో గుర్తింపు స్వదేశీ డ్రోన్‌ తయారీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన జేకే250ఈ డ్రోన్‌కు, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) టైప్‌ సర్టిఫికేషన్‌ లభించింది.
  • నెస్లే ఇండియా లాభంలో 36.3% వృద్ధి దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ నెస్లే ఇండియా, జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.1,026.77 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.743.17 కోట్ల కంటే ఇది 36.32% అధికం.
  • హెరిటేజ్‌ లాభం రూ.30.85 కోట్లు పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.30.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2025-26 ఇదే కాల లాభం రూ.50.99 కోట్లతో పోలిస్తే ఇది 39% తక్కువ.
  • బీన్యూ మొబైల్స్‌ ప్రత్యేక ధరలు దసరా ఆఫర్లలో భాగంగా మొబైల్స్, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు ప్రత్యేక ధరల్లో విక్రయిస్తున్నట్లు బీన్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు.
  • సోనోవిజన్‌ దసరా ఆఫర్లు దసరా సేల్‌లో తాము ఇస్తున్న ఆఫర్లకు అదనంగా, ప్రతి కొనుగోలుదారుకు కచ్చితంగా   5.75% ప్రయోజనం కలిగేలా స్క్రాచ్‌కార్డ్‌ స్కీము ఉపయోగ పడుతోందని సోనోవిజన్‌  మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పి.భాస్కరమూర్తి తెలిపారు.
  • టోకు ద్రవ్యోల్బణం 12% దాటొచ్చు: ఇండ్‌-రా ఈ ఏడాది అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12%, రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 6% మించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది.
  • సిట్రోయెన్, జీప్‌ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకొస్తాం ఫాస్ట్‌లేన్‌- 2030 ప్రణాళిక కింద రాబోయే మూడేళ్లలో సిట్రోయెన్, జీప్‌ బ్రాండ్లలో 12 మోడళ్లు తీసుకు రానున్నట్లు స్టెల్లాంటిస్‌ ఇండియా తెలిపింది.
  • సెప్టెంబరులో వాణిజ్య లోటు 30.21 బి.డా. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రసాయనాల ఎగుమతుల్లో నమోదైన ఆరోగ్యకర వృద్ధి కారణంగా, సెప్టెంబరులో మన దేశ వస్తు ఎగుమతులు 23.04% పెరిగాయి.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ సీఎన్‌జీ వెర్షన్‌ మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ సీఎన్‌జీ వెర్షన్‌ను ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ జెడ్‌ఎన్‌జీ పేరుతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).
  • బలమైన మేధో సంపత్తితోనే మీడియాలో తదుపరి దశ వృద్ధి బలమైన మేధో సంపత్తి, ఆదాయ నమూనాలు, క్రమం తప్పని పెట్టుబడులు, క్రాస్‌ మార్కెట్‌ వీక్షకులు/పాఠకులను చేరడం ద్వారా మీడియా-వినోద రంగంలో తదుపరి దశ వృద్ధి సాధ్యమవుతుందని సమాచార, ప్రసారాల మంత్రిత్వ కార్యదర్శి చంచల్‌ కుమార్‌ పేర్కొన్నారు.
  • ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13% పెరిగాయ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27)లో అక్టోబరు 14 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13.21% పెరిగి రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ లక్ష్యంలో ఇది దాదాపు 50 శాతానికి సమానం.
  • రూ.28,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్లో మార్పుల్లేవ్‌: టాటా రెన్యూవబుల్‌ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదాలు తమ వ్యాపార విస్తరణపై ఎటువంటి ప్రభావం చూపబోవని టాటా గ్రూప్‌ సంస్థ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్పష్టం చేసింది.
  • మెహ్లి మిస్త్రీ అర్హతపై ప్రశ్నించిన టాటా ట్రస్ట్స్‌ టాటా ట్రస్ట్స్‌ పరిధిలోని రెండు స్వచ్ఛంద సంస్థలు సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (ఎస్‌డీటీటీ), బాయి హీరాబాయి జంషెడ్‌జీ టాటా నవ్‌సారి ఛారిటబుల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మెహ్లి మిస్త్రీకి ఉన్న లోకస్‌ స్టాండి (చట్టపరమైన అర్హత)ని టాటా ట్రస్ట్‌లు గురువారం ఛారిటీ కమిషనర్‌ కార్యాలయం ముందు ప్రశ్నించాయి.