‘రింగ్ రోడ్డు’ మాయలేడికి క్షమాభిక్ష తిరస్కారం

- A
- A+
- A++

ఈనాడు, బెంగళూరు: 2003లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘రింగ్ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడు డి.అరుణ్ వర్మతో పాటు మరో ఇద్దరు నిందితులకు క్షమాభిక్షకు సిఫార్సు చేయకూడదని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. కాబోయే భర్తను కుట్ర పన్ని హత్య చేయించిన శుభ, ఆమె ప్రియుడికి 2010లో రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షను రద్దు చేయాలని కోరుతూ వీరు సుప్రీం కోర్టుకు మనవి చేసుకోగా రాష్ట్ర గవర్నర్ విచక్షణకు సిఫార్సు చేశారు. గతేడాది జులైలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు మేరకు గవర్నర్ త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన మంత్రులు కాబోయే భర్తను క్రూరంగా హత్య చేయించిన శుభ అండ్ బృందానికి క్షమాభిక్ష తిరస్కరించేలా గవర్నర్‌కు సిఫార్సుకు చేయాలని తీర్మానించారు. ఇదే సమావేశంలో ‘స్టింగ్ ఆపరేషన్’పై విచారణ, రిజర్వేషన్ పరిమితి పెంపు, కరవు తదితర అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
యావజ్జీవమే సరి
2003 డిసెంబరు 1న బెంగళూరులో ఓ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న గిరీష్‌తో న్యాయ విద్య ఐదో సెమిస్టర్ చదువుతున్న శుభకు నిశ్చితార్థం జరిగింది. అప్పటికే తన సీనియరు అరుణ్ వర్మతో ప్రేమలో ఉన్న శుభకు తల్లిదండ్రులు కుదిర్చిన నిశ్చితార్థం భారంగా అనిపించింది. ఈ విషయాన్ని ప్రియుడితో పంచుకున్న శుభ..తమకు అడ్డుగా ఉన్న కాబోయే భర్తను చంపేయాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం జరిగిన రెండో రోజే కాబోయే భర్తను హోటల్లో భోజనం చేసేందుకు బయటకు రప్పించిన శుభ..తర్వాత హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద ఆకాశంలో తిరిగే విమానాలను చూసేందుకు కారు నుంచి దిగేలా చేసింది. ఇదే సమయంలో ప్రియుడు అరుణ్ వర్మ మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనం షాక్ అబ్సార్బర్తో గిరీశ్పై దాడి చేశారు. ఈ సమయంలో తలపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన గిరీశ్ మరుసటి రోజు మరణించారు. తనకు ఇష్టం లేని వివాహాన్ని తల్లిదండ్రులతో చెప్పలేక, ప్రియుడిని విడిచిపెట్టలేక ఇలాంటి చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో శుభ అంగీకరించింది. గిరీశ్ సోదరుడి ఫిర్యాదుతో సుదీర్ఘ విచారణ తర్వాత 2010లో హైకోర్టు శుభతో పాటు ప్రియుడు, మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సుప్రీం కోర్టు నుంచి బెయిల్ పొందిన శుభ అనంతరం క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకుంది. రాజ్యాంగంలోని 161 ఆర్టికల్ ప్రకారం యావజ్జీవ శిక్ష ఖరారైన వారికి క్షమాభిక్ష ఇచ్చే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందంటూ సుప్రీం కోర్టు తేల్చింది. సమాజం నివ్వెరపోయే పాపానికి ఒడిగట్టిన శుభకు యావజ్జీవమే సరి అని సర్కారు అభిప్రాయపడింది.
► Read latest Karnataka Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 07:45 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రాచనగరి రాజసం.. చూసొద్దాం ఆసాంతం [ 16-10-2026] ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే స్వదేశీ విదేశాలు వివిధ ప్రాంతాలు సందర్శించేందుకు ఈసారి జనరల్ పాస్ అమలులోకి తెచ్చారు.
- మైసూరులో నవమి కళ.. విజయనగర వెలవెల [ 16-10-2026] రాష్ట్రంలో దశమి ఉత్సవాలకు విజయనగరలోనే బీజం పడింది. అనంతర కాలంలో రాచనగరి మైసూరులో దసరా వేడుకలు మొదలయ్యాయి.
- టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి [ 16-10-2026] కోలారు తాలూకా నరసాపుర టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పని చేస్తున్న శ్రీమంతి (22) అనే యువతి బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాత్రి విధుల్లో ఉండగా తల తిరుగుతోందని బుధవారం రాత్రి 8 గంటలకు కంపెనీ ఆక్యూపేషనల్ హెల్త్ సెంటర్‌కి వెళ్లారు.
- ఉగ్రరూప కుమార [ 16-10-2026] హనీట్రాప్‌నకు సంబంధించి జరుగుతున్న ప్రచారం పేరిట తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
- రహదారి సురక్షతకు అగ్రాసనం [ 16-10-2026] రహదారి సురక్షతకు తాము పెద్ద పీట వేస్తున్నామని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. రహదారులపై సురక్షతను కాపాడడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, రోడ్డుపైకి వచ్చే ప్రతి ఒక్కరూ దానికి బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
- ‘ఓడిన చోటే గెలిచి నిలుద్దాం’ [ 16-10-2026] ఓడిన స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని కేపీసీసీ అధ్యక్షుడు బీకేహరిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్న స్థానాలు కోల్పోకుండా కాపాడుకోవాలని సూచించారు.
- చదువుకని వెళ్లి తిరిగిరాని లోకాలకు [ 16-10-2026] చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన ఆ బాలుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పదో తరగతి చదువుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 16 ఏళ్ల బాలు కిరణ్‌రెడ్డి ట్యూషన్‌కు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనం వస్తున్న సమయంలో వెనుక వస్తున్న విద్యార్థినిని చూడ్డానికి ప్రయత్నించిన సమయంలో రోడ్డు డివైడర్‌పై ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ప్రమాద స్థలంలోనే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
- ‘మూడో సీఎం వచ్చినా ఆశ్చర్యం లేదు’ [ 16-10-2026] రాష్ట్రానికి ఏడాదిలోగా మూడో ముఖ్యమంత్రి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని భాజపా అధ్యక్షుడు బీవై విజయేంద్ర వ్యాఖ్యానించారు.
- హుబ్లీలో అక్టోబర్ 25న సండే ఆన్ సైక్లింగ్ [ 15-10-2026] శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పౌరుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ఫిట్ కర్ణాటక ఫర్ ఫిట్ ఇండియా’ ప్రచారంలో భాగంగా ఈనెల 25న హుబ్లీలో ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సినీనటి, ఫిట్ ఇండియా ఛాంపియన్ రాగిణి ద్వివేది తెలిపారు.
- చెరకు రైతుల ‘చలో హుబ్లీ’పాదయాత్ర [ 15-10-2026] రాష్ట్రంలో చెరకు మద్ధతు ధర పెంచాలని, ఇథనాల్‌ను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు ‘చలో హుబ్లీ’పాదయాత్ర చేపట్టారు.
- ‘సిద్ధు’కు ఆ‘పరేషాన్’ [ 15-10-2026] ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల గడుస్తున్నా పూర్వ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతగా వార్తలో కనిపించలేదు.
- పండగకు వస్తున్నా.. [ 15-10-2026] ఈ దసరాతో నగరంలో రద్దీ ప్రయాణానికి ఒక ముగింపు కార్డు పడనుంది. అలసట, అలుపు, ఎక్కువ ఖర్చు లేకుండా ఆఫీసు నుంచి నేరుగా మెట్రోకు అటు నుంచి ఇంటికి.
- వెనక్కు తగ్గని చెరకు రైతు [ 15-10-2026] చెరకుకు గిట్టుబాటు ధరను ప్రకటించాలని కోరుతూ సాగుదారులు చేస్తున్న ఆందోళన బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. బెళగావి, కలబురగి, ధార్వాడ, బాగలకోటె, విజయపుర జిల్లాల్లో పలు చోట్ల ఆందోళన తీవ్రమైంది.
- రాచనగరి.. సంబరాల భేరి! [ 15-10-2026] దసరా సమీపించే కొద్దీ రాచనగరి మైసూరు సంబరాల్లో మునిగి తేలుతోంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేకానేక పోటీలకు వేదికలు సిద్ధంకాగా.. కొన్ని పోటీలు తుది దశకు చేరుకుంటున్నాయి
- ‘చెక్’ పెట్టుబడులకు ఎర్రతివాచీ [ 15-10-2026] రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు చెక్ రిపబ్లిక్ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు
- అంబారీ బాధ్యత ‘ప్రశాంత’కే [ 15-10-2026] మైసూరు దసరా ఉత్సవాల్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అందులో చివరి ఘట్టం జంబూ సవారీ. ఇది చాలా ప్రత్యేకమైంది. గŸత పాతికేళ్లుగా జంబూసవారీలో పాల్గొంటూ, వరుసగా ఆరేళ్ల పాటు 750 కిలోల బంగారు అంబారీని, అందులో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని మోస్తున్న అభిమన్యు (60) నుంచి ఆ బాధ్యతలను ఈ ఏడాది తప్పించారు
- ఒకరి మరణం..ఇంకొకరికి జీవం [ 15-10-2026] లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా జీవించవచ్చు. ఇది అవయవ దానంతో సాధ్యపడుతుంది. ఇంకొకరు సంపూర్ణ జీవితం గడపడానికి కారణం కావచ్చు.
- రద్దీ నియంత్రణకు ముందడుగు [ 15-10-2026] పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందులో అతిముఖ్యమైంది సంచార సౌకర్యం. దీనికోసం ఇప్పటికే మెట్రో మార్గాలను, ఉపరితల వంతెనలను నిర్మిస్తున్నారు. ఈక్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ ఉపరితల వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది
- రాజధాని గొంతు తడారె [ 15-10-2026] రాజధాని అంతకంతకూ విస్తరిస్తోంది. తగినంత స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన మరీచికగా మారుతోంది. రహదారులు, మురుగునీటి కాలువల వ్యవస్థ ఎలా ఉన్నా.. తాగునీటి ఎద్దడి నిత్యం వెంటాడుతోంది.
- కాలిపోయిన రైలు బోగీలు [ 15-10-2026] రాజానుకుంటె రైల్వే యార్డు వద్ద నిలిపి ఉంచిన రైల్లో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం మంటలు చెలరేగినట్లు గుర్తించి, సిబ్బంది తక్షణమే అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు.
- బెయిలుపై విడుదలైన రెండు నెలల్లోనే హత్య [ 15-10-2026] నేరానికి పాల్పడి కారాగారానికి చేరి, బెయిలుపై రెండు నెలల కిందటే బయటకు వచ్చిన అమిత్ (27) అనే యువకుడు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.