గుడిలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు.. అదే సమయంలో తుపాకీతో నిందితుడు

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: హిందూ మతంపై ద్వేషంతో కాల్పులు జరిపి పలువురిని హతమార్చాలని (Plot To Attack) ఓ అమెరికా టీనేజర్ ఇల్లినోయీలోని అరోరాలో ఉన్న హిందూ దేవాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో అతడి తుపాకీ పని చేయకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్లు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) తెలిపారు. యువకుడు తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించినప్పుడు.. తాను కుటుంబసభ్యులతో పూజలో ఉన్నట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులపై ద్వేషం, శ్వేతజాతి ఆధిపత్యం ఎంత ప్రమాదకరంగా మారాయనడానికి ఈ పరిస్థితులే నిదర్శనమన్నారు.
దేవాలయం (Hindu temple in USA)పై దాడి చేయడానికి పన్నిన కుట్రను అమెరికా చట్టసభ సభ్యులు (US lawmakers), నేతలు, పౌర సమాజ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దేశంలో రోజురోజుకు హిందువులపై పెరుగుతోన్న పక్షపాత ధోరణిని ఎదుర్కోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో భారతీయులపై వరుసగా జరుగుతోన్న దాడులు, కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పేర్కొన్నారు. దేశంలో మైనారిటీల ప్రార్థనా మందిరాల భద్రతను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
- అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే!
ఓ యువకుడు జాతి వివక్షతో ఇంతటి దారుణానికి యత్నించడం ఆందోళనకరమైన విషయమని న్యూయార్క్ సెనేటర్ చక్ షుమర్ పేర్కొన్నారు. అమెరికాలో వివక్షకు తావులేదన్నారు. జాతి, మతంతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ దేశంలో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండాలన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు సుజాన్ డెల్బెన్, భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్తో పాటు పలువురు ఈ దాడి యత్నాన్ని ఖండించారు.
రెండేళ్ల నుంచి దాడులకు ప్లాన్...
ఆలయంలో దాడులకు యత్నించిన అలెగ్జాండ్రోస్ పాపొరకీస్ అనే 19 ఏళ్ల టీనేజర్ రెండేళ్ల ముందు నుంచి హిందువులపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం అరోరాలోని హిందూ ఆలయాన్ని టార్గెట్ చేసుకొని అందులోకి ప్రవేశించాడు. అప్పుడు తుపాకిలో సమస్య తలెత్తడంతో ఏమీ చేయలేక వెనుదిరిగాడు.
► Read latest Nri Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మళ్లీ ఇక్కడ కనిపించొద్దు: యూకేలో భారత విద్యార్థులకు జాతివివక్ష వేధింపులు Indian Students in UK: యూకేలో భారత విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నారు. వెస్ట్‌మిడ్‌లాండ్ ప్రాంతంలో మెరిడెన్ పార్క్‌లో వారిని బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- అమెరికాలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఏపీ యువకుడి మృతి ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ ఏపీ యువకుడి కథ విషాదంగా ముగిసింది.
- రైఫిల్ జామ్ అవడంతో ఆగిన నరమేధం: అమెరికాలో ఆలయంపై దాడి కుట్రలో కీలక విషయాలు US Teen Shooting Case: అమెరికాలో ఇల్లినోయీలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- అమెరికాలో హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు కుట్ర.. యువకుడి అరెస్టు అమెరికా(USA)లో హిందూ ఆలయంపై సాముహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
- జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
- యూఏఈ లాటరీ.. భారతీయుడికి రూ.13 కోట్ల జాక్‌పాట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది.
- వలసదారులకు ట్రంప్ మరో షాక్.. ఆటోమేటిక్ వర్క్‌పర్మిట్ పొడిగింపు నిలిపివేత Automatic Work Permit Extensions: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రత్యేక వలసదారులకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్స్ పొడిగింపును నిలిపివేసింది.
- కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి చెందాడు. జిల్లాలోని తడ్కోల్ వాసి అఫ్జల్ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం రష్యా వెళ్లాడు.
- టైమ్స్‌స్క్వేర్‌లో ఘనంగా ‘దుర్గా ఉత్సవ్’ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్(Times Square)లో దుర్గామాత ఉత్సవం (Durga Utsav) కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL), వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) 2026 అక్టోబరు10న బర్న్‌హామ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించింది.
- గఫూర్ కుమారుడి మృతికి గ్లోబల్ ఎన్నారై తెదేపా చీఫ్ డాక్టర్ రాజా సంతాపం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.అబ్దుల్ గఫూర్ కుమారుడు కిరణ్ వెంకట పల్లా (42) అకాల మరణం పట్ల గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
- టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో టోక్యోలోని కోమత్సుగావా పార్కులో బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
- కెనడా మేయర్ బరిలో తెలుగు మహిళ.. బాలీవుడ్ పాటతో ఓట్ల వేట! కెనడాలోని మిస్సిస్సాగా మేయర్ బరిలో ఉన్న తెలుగు మహిళ దీపికా దామెర్ల చేస్తోన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ కుమారుడు అమెరికాలో మృతి చెందాడు.
- H1B నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా.. నిషేధానికి ప్రతిపాదన H1B నిబంధనలు ఉల్లంఘిస్తే 2.5 లక్షల డాలర్ల జరిమానా, పదేళ్ల నిషేధానికి ప్రతిపాదన చేస్తూ యూఎస్ఏ ప్రతినిధుల సభలో ఓ బిల్లు పెట్టారు.
- పాదచారుడితో వివాదం.. కెనడాలో భారత సంతతి మహిళ అరెస్టు ట్రాఫిక్ వివాదం ఓ భారత సంతతి (Indian Origin) మహిళ అరెస్టుకు దారితీసింది. కెనడా(Canada)లోని కాల్గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- డాలస్‌లో మహాత్ముడి మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు భారత జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు అమెరికాలోని డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా గాంధీ జయంతి సందర్భంగా శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- ఛార్లెట్‌లో తానా ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం అమెరికాలోని ఛార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతమైంది.
- అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఒలింపియాడ్.. నాలుగు స్వర్ణాలు, రజతం సాధించిన భారత్ అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ (IOAA)లో భారత విద్యార్థులు సత్తా చాటారు.
- ఒమన్ నుంచి యూఏఈలోకి చొరబాటు.. శిక్ష ముగిసినా జైలులోనే జగిత్యాల వాసి ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన జగిత్యాల వాసి ఏగుర్ల మల్లేశం పాస్‌పోర్ట్, వీసా లేకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోకి ప్రవేశించి జైలుపాలయ్యాడు.