రివ్యూ: ప్రహార్.. కసబ్ ఉరిశిక్షకు నాలుగేళ్లు ఎందుకు పట్టింది?

- A
- A+
- A++
Prahaar Movie Review || చిత్రం: ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్; నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, లలిత్ ప్రభాకర్, జైదీప్ అహ్లావత్, వామికా గబ్బీ, ఆశిష్ విద్యార్థి, సికిందర్ ఖేర్, నాజర్ తదితరులు; రచన: సుమిత్ రాయ్; నిర్మాత: దినేశ్ విజన్, దర్శకత్వం: అవినాష్ అరుణ్; విడుదల: 16-10-2026

26/11 భారత దేశ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. ముంబయిపై ఉగ్రమూకలు దాడికి తెగబడి ఎంతో మంది అమాయకులను బలి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు/డాక్యుమెంటరీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదే ఇతివృత్తంగా రూపొందిన కోర్టు రూమ్ డ్రామానే ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’. 26/11 దాడుల కేసును కోర్టులో వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ పాత్రలో రాజ్ కుమార్ రావ్ ఎలా నటించారు?
కథేంటంటే..
Prahaar story || ఉజ్వల్ నికమ్ (రాజ్ కుమార్‌రావ్) ప్రముఖ న్యాయవాది. 1993 బాంబే బ్లాస్టింగ్ కేసు విచారణలో కీలక పాత్ర పోషించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. కట్ చేస్తే, 26/11 ముంబయి ఉగ్రదాడి ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమవగా, అజ్మల్ కసబ్ (లలిత్ ప్రభాకర్) ఒక్కడే సజీవంగా పట్టుబడతాడు. ఈ కేసు విచారణను మహారాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల్ నికమ్‌కు అప్పగిస్తుంది. కసబ్ తరపున వాదించడానికి ఏ న్యాయవాది ముందుకు రాడు. ఈ క్రమంలో అబ్బాస్ ఖాజ్మీ (సికందర్ ఖేర్) ఆ బాధ్యతను తీసుకుంటాడు. 2008లో ఉగ్రదాడి ఘటన జరిగితే, 2012లో కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెబుతుంది. బాధితులకు న్యాయం జరగడానికి నాలుగేళ్ల సమయం ఎందుకు పట్టింది?కసబ్ ఉగ్రవాదేనని నిరూపించడానికి ఉజ్వల్ నికమ్ ఎలాంటి ఆధారాలు సమర్పించారు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది చిత్ర కథ.
ఎలా ఉందంటే..
Prahaar movie review || ముంబయి మారణహోమంలో అజ్మల్ కసబ్ నిందితుడేనని అందరికీ తెలుసు. అందుకు ఆధారాలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ, నాలుగేళ్ల పాటు అతడి భద్రత, న్యాయపరమైన వ్యవహారాల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. ‘ప్రభుత్వానికి ఏం పనీ పాటా లేదు. వాడ్ని అనవసరం కూర్చోబెట్టి మేపుతోంది. కాల్చి అవతల పారేసేయొచ్చుగా’ అని చాలా మంది అనుకుని ఉంటారు. కోర్టులో వాదనల సందర్భంగా ఉజ్వల్ నికమ్ కూడా చాలా మంది అనుకున్న అభిప్రాయాన్నే చెబుతూ ‘నేటి సమాజం సత్వర న్యాయం (ఇన్స్టంట్ జస్టిస్) కోరుకుంటోంది. అలాంటి న్యాయం వల్ల బాధితులకు వెంటనే ఉపశమనం లభించవచ్చు. కానీ, ఆ కుట్ర వెనుక ఎన్నో విషయాలు బయటకు రాకుండా పోతాయి’ అంటారు.
ఉగ్రవాది అజ్మల్ కసబ్ పట్టుబడిన తర్వాత విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్నో విషయాలను ఆసక్తికరంగా న్యాయవాది ఉజ్వల్ నికమ్ దృష్టి కోణం నుంచి ‘ప్రహార్’ను అలరించేలా, భావోద్వేగాన్ని పంచేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు అవినాష్ అరుణ్ విజయం సాధించారు. అది మాత్రమే కాదు, అంతర్లీనంగా భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను స్పృశిస్తూ వాటిని ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. కేవలం కోర్టు రూమ్ డ్రామాగానే నడిపితే ఇదొక డాక్యుమెంటరీ అయ్యేది. అలాగని, ఉగ్రదాడి.. వారిపై భద్రత బలగాల ఆపరేషన్ చూపిస్తే యాక్షన్ థ్రిల్లర్ అయిపోతుంది. అవన్నీ చూసేశాం. కోర్టు విచారణ ప్రధానంగా చూపిస్తూనే ఉగ్రమూక సృష్టించిన నరమేధాన్ని సమపాళ్లలో మేళవిస్తూ అరుణ్ ఈ కథను ఒక ఎమోషనల్ కోర్టు డ్రామాగా ఆవిష్కరించారు.
- రివ్యూ: జైలర్2.. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ ఎలా ఉంది?
ముంబయి ఉగ్రదాడి ఘటనను ఫ్లాష్‌లా చూపిస్తూ నేరుగా కోర్టు విచారణకు తీసుకొచ్చేశాడు దర్శకుడు. కసబ్ తరపున వాదించే న్యాయవాది అబ్బాస్ ఖాజ్మీ సంధించే ప్రశ్నలు, తీసే లాజిక్‌లకు సరైన సమాధానాలు చెప్పలేక పోలీసులు, సాక్షులు నీళ్లు నమలడం వాదనల్లో అతడిదే పై చేయి అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మొదట్లో ఉజ్వల్ నికమ్ వెనుకబడినట్లు అనిపించినా, అసలు కథ ముందుందని సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది. పోలీసు కస్టడీలో ఉన్న కసబ్ ప్రవర్తన, వ్యవహారశైలి ఎలా ఉండేదో మనం అనేక కథనాలు చదివాం. అవన్నీ తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తాను మైనర్‌నని కాసేపు, పోలీసులు తనని హింసించి నిజం ఒప్పించారని మరికాసేపు, లేదు తాను అమితాబ్ బచ్చన్ ఇల్లు చూడటానికి వస్తే పోలీసులు పట్టుకుని ఉగ్రవాదనంటూ అరెస్ట్ చేశారని.. ఇలా కసబ్ ఆడిన నాటకాలన్నీ తెరపై చూపించారు. ప్రథమార్ధమంతా ఇదే తరహాలో సాగుతుంది.
ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా నడిపిస్తూనే ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఎలా ఎగదోస్తుంది? అక్కడి అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి వారిని జిహాదీలుగా ఎలా మారుస్తుంది? వంటి ఎన్నో వాస్తవాలను తెరపై ఆవిష్కరించారు. అదే సమయంలో కోర్టులో బాధితుల దృష్టి కోణం నుంచి భావోద్వేగాలను పంచే ప్రయత్నమూ చేశారు. ముఖ్యంగా చిన్నారి సాక్ష్యం చెప్పే సన్నివేశం కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే, కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. ఉజ్వల్ తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాత్రీ పగలూ తేడా లేకుండా ఈ కేసు విచారణకు కష్టపడినట్లు చూపించారు కానీ, కోర్టుకు అవసరమైన ఆధారాలు సేకరించడంలో ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి? అన్న అంశాల జోలికి పోలేదు. దీంతో కథ, కథనాలు ఫ్లాట్‌గా సాగుతాయి. ఎక్కడా థ్రిల్ పంచే సన్నివేశం కనిపించదు. ఉజ్వల్ కుటుంబం నేపథ్యంలో సాగే డ్రామాగా కూడా కాస్త సాగదీత వ్యవహారంలా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఉజ్వల్ నికమ్ పాత్రలో రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao) ఒదిగిపోయారు. ఆయన నటన ఆద్యంతం సటిల్డ్‌గా ఉంది. వాదనలు వినిపించే క్రమంలోనూ, బాధితుల ప్రతినిధిగా వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చే సమయంలో ఆయన ముఖంలో కనిపించే ఆర్ద్రత, హావభావాలతో కట్టిపడేశారు. ప్రత్యర్థి లాయర్‌గా సికందర్ ఖేర్ కూడా చక్కగా నటించారు. కోర్టులో బలమైన వాదన ఉంటుంది కానీ, కమర్షియల్ సినిమాల్లో చూపించినట్లు అరుపులు, కేకలు అస్సలు ఉండవు. ఉజ్వల్ భార్య పాత్రలో వామికా గబ్బీ, (Wamiqa Gabbi) కుమారుడు అకేంత్గా రిత్విక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అజ్మల్ కసబ్‌గా లలిత్ ప్రభాకర్ (Lalit Prabhakar) నటన సినిమాకు హైలైట్. విచారణకు ఒక్క తీరుగా ఆయన పలికించిన హావభావాలు బాగున్నాయి. పాక్ న్యాయవాదిగా జైదీప్ అహ్లావత్ మెరుస్తారు. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నేపథ్య సంగీతం కోర్టు, బాధితుల భావోద్వేగ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. దర్శకుడు అవినాష్ అరుణ్ కమర్షియల్ హంగులకు పోకుండా వాస్తవాలను ఉజ్వల్ నికమ్ దృష్టి కోణం నుంచి ఆవిష్కరించిన తీరు బాగుంది.
- బలాలు
- + రాజ్‌కుమార్‌రావ్ నటన
- + కోర్టు సన్నివేశాలు
- + ప్రథమార్ధం, క్లైమాక్స్
- బలహీనతలు
- - బోరింగ్ ఫ్యామిలీ డ్రామా
- - నిడివి
- చివరిగా: ‘ప్రహార్’.. 26/11 ఉగ్రదాడి.. ప్రేక్షకులు చూడని సరికొత్త కోణం
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా..! విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన తాజా చిత్రం ‘రణబాలి’ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..
- రివ్యూ: క్రేజీ కళ్యాణం.. అనుపమ కొత్త చిత్రం వినోదాన్ని పంచిందా? అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ ఎలా ఉంది? ఎలాంటి నవ్వులు పంచింది?
- రివ్యూ: జైలర్2.. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ ఎలా ఉంది? రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్ ఫిల్మ్ ‘జైలర్2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్లికాని ప్రసాదు: ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రివ్యూ ఇంటిల్లిపాది ఆస్వాదించేగలిగే కంటెంట్‌తో ప్రేక్షకులకు చేరువైంది ఈటీవీ విన్. ఈ సంస్థ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించారు.
- రివ్యూ: హనుమాన్ అంశ్.. తెలుగువారినీ అలరిస్తుందా? బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి భక్తి భావాన్ని నింపింది?
- రివ్యూ: ఖలీఫా: ది రూలర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన ‘ఖలీఫా: ది రూరల్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్.. శ్రీవిష్ణు ఎంటర్టైనర్ మెప్పించిందా? శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- అమ్మాయి ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య.. నేరం ఎవరిది?: ‘పూజా మేరీ జాన్’ రివ్యూ తాను ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమకు ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే, ఆ యువతి నేరస్థురాలవుతుందా?ఈ విషయాన్ని చర్చిస్తూ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan).
- రివ్యూ: #లవ్.. ఆ 60 రోజుల డేటింగ్లో ఏం జరిగింది? మోడ్రన్ రిలేషన్షిప్స్ నేపథ్యంలో ‘#లవ్’ (#Love) వెబ్ సిరీస్ విడుదలైంది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) నిర్మాణంలో, ‘మారి’, ‘మారి 2’ చిత్రాల దర్శకుడు బాలాజీ మోహన్ (Balaji Mohan) దీన్ని తెరకెక్కించారు.
- రివ్యూ: ది ఇండియా స్టోరీ.. ఆ పాప హత్యకు కారణం ఎవరు? కాజల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాజల్ పోరాటం ఎవరిపై చేసింది?
- రివ్యూ: తెల్లకాగితం.. రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? హర్ష్ రోషన్ కథానాయకుడిగా నటించిన ‘తెల్లకాగితం’ బలమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: సిగ్మా.. దర్శకుడిగా సీఎం విజయ్ కుమారుడి ఫస్ట్ మూవీ ఎలా ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: దృశ్యం: ది కన్‌క్లూజన్.. సమీర్ చావుకు హిందీలోనైనా ముగింపు పలికారా? అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఫహద్ ఫాంటసీ ఫిల్మ్ మెప్పించిందా? మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: డోరతీ.. వార్తల్లో నిలిచిన కీర్తి సురేశ్ కొత్త మూవీ ఎలా ఉంది? కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ‘డోరతీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- మూగ యువతి కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారితే: ‘బేబీ డూ డై డూ’ రివ్యూ ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రధారిగా నటించిన ‘బేబీ డూ డై డూ’ రివ్యూ.
- రివ్యూ: ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్.. ఫాంటసీ థ్రిల్లర్ మెప్పించిందా? సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ది వన్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: అనుమాన పక్షి.. రాగ్ మయూర్ మూవీ వినోదాన్ని పంచిందా? రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘అనుమాన పక్షి’. ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: ‘ది ప్యారడైజ్’.. నాని యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- ఫస్ట్ నైట్ రోజే వధువు ‘సారీ బ్రో..’ అంటే! ‘మొద రాత్రి’ రివ్యూ ‘మొద రాత్రి’ రివ్యూ. ఈరోజుల్లో ఒకరిని ప్రేమించి, ఆ విషయం తల్లితండ్రులకు చెప్పలేక అయిష్టంగానే మరొకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతున్నదే. అలాంటి ఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది.