రూ. 285 కోట్ల ఆదాయం.. మాకు దమ్మిడీ రాదు: విండీస్ బోర్డు సీఈవో

Eenadu icon
By Sports News Team Updated : 16 Oct 2026 15:16 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

India vs West Indies! ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ జరుగుతోంది. టీమ్‌ఇండియాతో సిరీస్ అంటే బోర్డులకు కాసుల పంటే. కానీ, ఇప్పుడు అనుసరిస్తోన్న రెవెన్యూ మోడల్‌ కారణంగా తమకు ఎలాంటి ఆదాయం రాదని విండీస్‌ క్రికెట్ బోర్డు సీఈవో డెహ్రింగ్‌ తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా దాదాపు 20 నుంచి 30 మిలియన్ డాలర్ల (రూ. 190 కోట్ల నుంచి రూ. 285 కోట్ల వరకూ) ఆదాయం వస్తుందని వెల్లడించారు. అయినా, ఆ ఆదాయంలో తమకు ఎలాంటి వాటా రాబోదని తెలిపారు. దానికి కారణం 1997లో తీసుకొచ్చిన విధానమని.. దాని వల్ల విండీస్‌ క్రికెట్‌కు తీవ్ర నష్టం కలిగిందని చెప్పారు. ఈ విధానంలో ఆతిథ్య జట్టుకే వంద శాతం రెవెన్యూ వెళ్తుంది.

  • అలా మద్యం మానేశా.. అది నాకు పునర్జన్మే: చాహల్

‘‘ఇప్పుడు మా జట్టు భారత పర్యటనలో ఉంది. ఆటపరంగా అంతా బాగుంది. ఈ పర్యటన ద్వారా రూ. 285 కోట్ల రెవెన్యూ జనరేట్‌ అవుతుంది. కానీ, మాకు నయాపైసా చేతికి రాదు. దీనికి కారణం 1997లో తీసుకొచ్చిన విధానమే. ఆర్థిక నమూనాను మార్చాలని అప్పుడు ఐసీసీ సభ్య దేశాలు ఓటు వేసినప్పుడు నేను అక్కడ ఉండటం అదృష్టమో.. దురదృష్టమో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకూ విండీస్‌ జట్టు హాట్ ఫేవరెట్‌గా ఉండేది. మిగతా దేశాలు మా టీమ్‌తో సిరీస్‌లు ఆడేందుకు ఆసక్తి చూపించేవి. తమ దేశాల్లో పర్యటించాలని కోరేవి. అప్పుడు మాకు లభించే ఆదాయం.. మా దగ్గర ఓ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడం కంటే ఎక్కువే ఉండేది. కొత్త విధానం కోసం నిర్ణయించిన ఓటింగ్‌లోనూ మేం అనుకూలంగా వేయలేదు. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపిస్తుందని అప్పుడే చెప్పా. అన్నట్టుగానే.. మా జట్టు పతనం మొదలైంది. ఆర్థికంగానూ చాలా కష్టాలు ఎదుర్కొన్నాం’’ అని సీఈవో తెలిపారు.

విధానం మారాలి..

‘‘నేను భారత్‌ను ( Team India) తప్పుబట్టడం లేదు. ఇక్కడ 150 కోట్ల జనాభా ఉంది. క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక్కడ వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. అదే మా దేశంలో మేం సిరీస్‌కు హోస్ట్‌గా ఉన్నా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆంటిగ్వాలో వచ్చే ఆదాయం ఎంత? అదే ముంబయి లేదా బెంగళూరుతోపాటు ఇతర భారత మైదానాల్లో వచ్చే రెవెన్యూను పోల్చడం కూడా సరికాదు. అందుకే, ఆదాయం పంపిణీ విధానం మారితే మా బోర్డుకూ ఉపయోగం’’ అని డెహ్రింగ్‌ స్పష్టం చేశారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 14:18 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బెంగళూరులోనే భువీ పునరాగమనం.. భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం ఇంకాస్త ముందుగానే జరగనుంది. ఇప్పటికే కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతడిని.. విండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కూ బీసీసీఐ తీసుకుంది.
  • పిచ్‌లు బౌలర్లకు సహకరించేలా చూడండి..: మాజీ చీఫ్‌ సెలక్టర్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలం కాకుండా.. బౌలర్లకూ పిచ్‌ నుంచి సహకారం లభించేలా చూడాలని బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యానించారు.
  • అలా మద్యం మానేశా.. అది నాకు పునర్జన్మే: చాహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాహల్.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.
  • భారత్ - జింబాబ్వే టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు స్పెషల్ ఆఫర్ జింబాబ్వేతో భారత మహిళా జట్టు మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది.
  • బంతి బావురుమంటోంది! వన్డేలో 350 పైచిలుకు లక్ష్యం సరిపోలేదు. టీ20లో 250 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. భారత బౌలర్లను చూడగానే ప్రత్యర్థి బ్యాటర్లు పూనకాలొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. అవతలి జట్టు కెప్టెన్‌ అయితే కెరీర్లో ఎన్నడూ లేనంతగా చెలరేగుతున్నాడు.
  • బౌలర్లనేమీ అనలేం.. బ్యాటర్లదే బాధ్యత భారత బ్యాటర్లు ఛేదనలో మరింత బాధ్యతగా ఆడాలని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ సూచించాడు. వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమ్‌ఇండియా 24 పరుగుల తేడాతో పరాజయంపాలైన నేపథ్యంలో ఆయన ఇలా అన్నాడు.
  • స్మృతి సారథ్యంలో.. భారత మహిళల క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతోంది. పదేళ్ల పాటు జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన హర్మన్‌ప్రీత్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌గా నియమితురాలైన స్మృతి మంధాన.. తొలి సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో ఆమె జట్టును ఎలా నడిపిస్తుందన్నది ఆసక్తికరం.
  • మీ విజయం యావద్భారతానికి గర్వకారణం ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల్ని దక్కించుకునే దిశగా భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
  • అంతర్జాతీయ క్రికెట్‌కు పూనమ్‌ రౌత్‌ గుడ్‌బై భారత సీనియర్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల ఈ ముంబయి ప్లేయర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. పూనమ్‌ 2009-21 మధ్య 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
  • జగ్‌శేర్‌కు పతకం ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్‌ జగ్‌శేర్‌ సింగ్‌ సత్తాచాటాడు. అతడు సెమీఫైనల్లో అడుగుపెట్టి, భారత్‌కు పతకం ఖాయం చేశాడు.
  • చీఫ్స్‌.. 5 ఓటముల తర్వాత ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో వరుస పరాజయాలు చవిచూస్తున్న చోళా చీఫ్స్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. గురువారం ఆ జట్టు 2-0తో పృథ్వీరాజ్‌ యోధాస్‌పై షూటాఫ్‌లో నెగ్గింది.
  • క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ భారత డబుల్స్‌ స్టార్లు పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ.. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
  • విశ్వజీత్‌కు రజతం భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్‌ విశ్వజీత్‌ మోరె అదరగొట్టాడు. అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు రజతం చేజిక్కించుకున్నాడు. ఈ టోర్నీలో వెండి పతకం గెలిచిన భారత తొలి రెజ్లర్‌గా ఘనత సాధించాడు.
  • సంక్షిప్త వార్తలు (3) ప్రపంచ నం.2 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) షాంఘై మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అతడు 6-4, 6-4తో అలెక్స్‌ డి మినార్‌(ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
  • 15 ఏళ్ల వయసులోనే పతకాలు సాధించడం గర్వకారణం: మోదీ రాబోయే కాలంలో మరింతమంది కొత్త క్రీడాకారులు సిద్ధమవుతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
  • యశస్వి.. అలాంటివి వద్దు: మాజీ చీఫ్‌ సెలక్టర్ కీలక సూచన యశస్వి జైస్వాల్ కొత్తగా వికెట్ కీపర్ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసమే ప్రాక్టీస్ కూడా చేసేస్తున్నాడు.
  • ఆసియా గేమ్స్‌ పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని ఆసియా క్రీడల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు.
  • కివీస్‌తో వన్డే సిరీస్‌.. బుమ్రాకి రెస్ట్? కారణమిదేనా? కివీస్‌ పర్యటనలో భారత్ ఐదు వన్డేల సిరీస్‌ కూడా ఆడనుంది. కానీ, ఆ సిరీస్‌ నుంచి బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
  • గత 25 ఏళ్లుగా నీ అసిస్టెంట్‌నే కదా!: యువరాజ్‌ సింగ్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా గంగూలీ.. అతడికి అసిస్టెంట్‌గా యువరాజ్ సింగ్ వచ్చాడు.
  • ఈ జట్టుతో వరల్డ్ కప్‌ను నెగ్గడం కష్టమే: భారత మాజీ క్రికెటర్‌ విండీస్‌ బ్యాటర్లను అడ్డుకోవడంలో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఉప్పల్‌ మ్యాచ్‌లోనూ విండీస్‌ విజయం సాధించింది.