చట్టాన్ని తిరగరాసిన పోరాటం

Eenadu icon
By Editorial Team Published : 15 Oct 2026 01:42 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

నిస్సహాయులమనీ ఒంటరిగా ఏమీ చేయలేమనీ... అనుకుంటాం. ముఖ్యంగా సీరియస్‌ నేరాలు, చట్టాల దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు వాటిని ఎదుర్కొనడం తమ వల్ల కాదనే భావిస్తారు. కానీ ఫ్రాంకా వయోలా అలా అనుకోలేదు. ఆమేమీ ఉన్నత విద్యావంతురాలో, సామాజిక ఉద్యమకారిణో కాదు. కేవలం పదిహేడేళ్ల బాలిక. అయినా సరే తన హక్కు కోసం సమాజానికి ఎదురు తిరిగింది. ఏకంగా చట్టాన్నే మార్పించింది!

దాదాపు అరవయ్యేళ్ల క్రితం సంగతి. ఇటలీలోని సిసిలీ ప్రాంతానికి చెందిన వయోలాకి దగ్గరి బంధువు ఫిలిపో మెలొడియాతో పెళ్లి నిశ్చయమైంది. అయితే మెలోడియా దొంగతనం నేరంమీద జైలుకు వెళ్లాడని తెలిసి అతణ్ని చేసుకోనని చెప్పేసింది వయోలా. దాంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసి మరో సంబంధాన్ని నిశ్చయించారు పెద్దలు. జైలు నుంచి వచ్చి రౌడీమూకతో కలిసి తిరుగుతున్న మెలొడియాకి వయోలాని వదులుకోవడం ఇష్టం లేకపోయింది. ఆమెను కిడ్నాప్‌ చేసి వారం రోజులు బంధించి అత్యాచారం చేశాడు. ఇప్పుడిక తనను పెళ్లి చేసుకోవడం తప్ప ఆమెకు గత్యంతరం లేదన్నాడు. ఇటలీలో అమల్లో ఉన్న ‘రిహాబిలిటేటింగ్‌ మ్యారేజ్‌’ చట్టం ప్రకారం- అత్యాచారం చేసిన వ్యక్తి ఆ మహిళను పెళ్లి చేసుకుంటే కేసు ఉండదు. అలా చేసుకోవడం ఇష్టం లేని మహిళ పరువు కోల్పోయిన స్త్రీ అన్న నింద మోస్తూ ఒంటరిగా బతకాలి. కాబట్టి మరోదారి లేక చాలామంది ఆ పెళ్లి చేసుకునేవారు. వయోలా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మెలొడియాను పెళ్లిచేసుకోనని చెప్పేసింది. కూతురికి అండగా నిలిచిన తండ్రి ఆమెతో కిడ్నాప్, అత్యాచారం కేసులు పెట్టించాడు. సిసిలీ సమాజం గగ్గోలు పెట్టింది. ఆమె కుటుంబాన్ని వెలివేసింది. రౌడీలు ఆమె కుటుంబ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. తోటల్ని తగలబెట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఎన్ని చేసినా వయోలా కుటుంబం బెదరలేదు. 

అంతకుముందే వయోలాతో పెళ్లి నిశ్చయమైన జియొసెప్పె రూసీ ఆమె ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని చూసి ముచ్చటపడ్డాడు. పెళ్లి చేసుకుని ఆమె పోరాటానికి మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటనలన్నీ పత్రికల నుంచి పార్లమెంటు దాకా చర్చనీయాంశాలయ్యాయి. మెలొడియా నేరం రుజువై పదకొండేళ్ల శిక్ష పడింది. వయోలా, రూసీ దంపతుల ధైర్యానికి మెచ్చి ఆ దేశాధ్యక్షుడు పెళ్లి కానుక పంపించారు. రవాణా శాఖమంత్రి నెలరోజుల పాటు ఇద్దరూ రైళ్లలో ఉచితంగా తిరిగే ఏర్పాటుచేశారు. పోప్‌ బహిరంగంగా అభినందించి, తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. వయోలా కేసు తర్వాత మరెవరూ ఆ దేశంలో రిహాబిలిటేటింగ్‌ మ్యారేజ్‌ చేసుకోలేదు. 1981లో ఆ చట్టం రద్దయింది. 2014లో దేశ అత్యున్నత అవార్డు ఇచ్చి వయోలాను సత్కరించింది ఇటలీ ప్రభుత్వం. ఆ సందర్భంగా మాట్లాడుతూ వయోలా... నేనేమీ హీరోను కాదు, సాహసం చేయాలనీ అనుకోలేదు, నా ఆత్మగౌరవానికి భంగం కలిగించే పని చేయదలచుకోలేదంతే... అని చెప్పింది. కాబట్టే... మొత్తంగా దేశాన్నే మార్చగలిగింది. వయోలా జీవితం ఆధారంగా ‘ద మోస్ట్‌ బ్యూటిఫుల్‌ వైఫ్‌’, ‘ద గర్ల్‌ ఫ్రమ్‌ టుమారో’ అనే రెండు సినిమాలు వచ్చాయి.

పట్టణీకరణ, పారిశ్రామికీ కరణలకు తోడు ఆధునిక సాంకేతికతల వినియోగం, డేటా సెంటర్ల వృద్ధి వంటి వాటివల్ల విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో పర్యావరణానికి హాని  కలిగించకుండా తక్కువ ఖర్చుతో లభించే సౌరశక్తి వైపు చాలా దేశాలు దృష్టి సారించాయి. చైనా ఈ విషయంలో శరవేగంగా దూసుకుపోతోంది. నిరుడు చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా స్థాపిత సౌర విద్యుత్‌ సామర్థ్యం 2,397 గిగావాట్లు. అందులో ఆయా దేశాల వాటా... (గిగావాట్లలో) 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


English Translation

Translation pending...