శ్రీమంతుడు

Eenadu icon
By Editorial Team Published : 15 Oct 2026 01:39 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.

లంకలో రావణుడి ఎదురుగా ఉన్న సీతమ్మ చేతిలోని గరికపోచ గొప్ప తత్వాన్ని చెబుతుంది. అది ఆమె సంకల్పబలానికి ప్రతీక. ధైర్యాన్ని, ధర్మనిబద్ధతను చాటి చెప్పడానికి స్థిర చిత్తం ఒకటి చాలు.. రామ నామాన్ని ఆత్మసౌభాగ్యంగా భావించింది సీతమ్మ. ధర్మాన్ని మించిన సంపద వేరొకటి లేదన్నట్టు జీవించింది. ఇదే తృప్తికి పరాకాష్ఠ.

తృప్తి చెందని మనిషికి ఎన్ని ద్వీపాలు ఇచ్చినా సరిపోవని సామెత. అసంతృప్తి పోలికలతో మొదలవుతుంది. ఒక గీత గీసినప్పుడు పక్కన పెద్ద గీత, చిన్న గీత... ఏది గీసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. ఈర్ష్య, అసూయ, పోలిక .... ఇవే మనిషి దుఃఖానికి మూల కారణాలు. పచ్చడి మెతుకులకు నోచుకోనివారు కూడా ఎందరో ఉన్నారీ లోకంలో. అలాంటివారికి వీలైనంత సాయం చేస్తూ, మనకున్నదాంతో సంతృప్తి చెందితే, అదే జ్ఞానదృష్టికి తొలి మెట్టు. లేనిదాని కోసం అర్రులు చాస్తూ ఎండమావుల వెంట పరుగులు తీస్తే జీవితం నిత్య అసంతృప్తితో చాలా భారంగా గడుస్తుంది.

ఒక వ్యక్తి వంట చెరకు కోసం చెట్టెక్కాడు. ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. గొడ్డలి దూరంగా పడిపోయింది. తన దురదృష్టాన్ని నిందించుకుంటున్న అతణ్ని ఒక ముని చూసి ‘నీకన్నా అదృష్టవంతుడు ఎవరూ లేరు నాయనా! అటుచూడు’ అన్నాడు. ఆ చెట్టుపైన పిడుగు పడింది. ప్రతి సంఘటనకూ కార్య- కారణ సంబంధం ఉంటుందన్న ప్రకృతి మర్మం అతనికి అర్థమైంది. ఎవరికి ఏమివ్వాలో జగన్నాటక సూత్రధారికి తెలుసని అందుకే అంటారు.

మనకు కనిపించని కొన్ని వాస్తవాలు మన చుట్టూనే ఉంటాయి. ఒక తత్వవేత్త ‘మూడో నేత్రం మన ప్రతి చర్యను గమనిస్తుంది’ అన్నప్పుడు శిష్యుడు ఆశ్చర్యపోయి ‘అదెక్కడుంది?’ అన్నాడు. ‘గాలి కనిపించట్లేదని, లేదంటావా? నువ్వు పీల్చే ఊపిరి ఎక్కడి నుంచి వస్తోంది?’ అని ప్రశ్నించాడు తత్వవేత్త. అలాగే మనం ఇతరులకు ఇచ్చిందే తిరిగి మన దగ్గరికి వస్తుంది. అంతరాత్మను శుద్ధిగా ఉంచుకోవడమే మనకు మనం చేసుకునే సాయం. పరిశుద్ధమైన హృదయంతో చేసే పనులు వ్యక్తి అభ్యున్నతికి, సంఘశ్రేయానికి బాటలు పరుస్తాయి. అలా జీవించే వ్యక్తే నిజమైన ‘శ్రీమంతుడు’. ఆయన ధనంతో కాదు; ధర్మంతో జీవిస్తాడు. సమాజానికి ఓ మార్గదర్శిగా నిలుస్తాడు. సంపద లేకున్నా, సంయమనం, సత్ప్రవర్తన, తృప్తి అనే నిజమైన నిధుల్ని సంతరించుకున్నవాడే శ్రీమంతుడు. ధనాన్ని కాక, ధర్మాన్ని సంపాదించినవారే స్థితిమంతులు. అలాంటి ధర్మాత్ములు పెరగాలి. వారి వల్లే సమాజం వృద్ధి చెందుతుంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
  • శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
  • రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
  • విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
  • నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
  • తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
  • ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
  • పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
  • గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
  • మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
  • గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం. 
  • వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి. 
  • అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
  • విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
  • మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
  • జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి.  భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
  • గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
  • విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.
  • జితేంద్రియులు సుఖదుఃఖాలు అస్థిరాలు. వాటి గురించి వ్యథ చెందడం వ్యర్థం. విషయవాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారే జితేంద్రియులు. అంటే, ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం.
  • పరమ హితులు సకల జీవుల ఆనందమే ధ్యేయంగా సాగేది ప్రకృతి చైతన్యం. దాంతో మనిషి సమన్వయం సాధించినప్పుడే సంతోషకరమైన సార్థకజీవనం సాధ్యమవుతుంది.

English Translation

Translation pending...