రెండు వేళ్ల రహస్యం

Eenadu icon
By Editorial Team Published : 12 Oct 2026 01:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.

ఒకరోజు చిలిపికృష్ణుడు కుండ పగులగొట్టి, వెన్న తింటూ చుట్టుపక్కలున్న కోతులకు కూడా పంచాడు. అది చూసిన యశోదమ్మకు కోపం వచ్చింది. చేతిలో చిన్న కర్రతో కృష్ణుణ్ని పట్టుకోవడానికి పరుగెత్తింది. బాలకృష్ణుడు భయపడినట్లు నటిస్తూ పరుగులు తీశాడు. చివరికి అమ్మ చేతికి చిక్కాడు. అల్లరి చేయకుండా పిల్లాణ్ని ఇంట్లో ఉన్న రోలుకు కట్టేయాలనుకుంది యశోద. ఒక తాడు తెచ్చి బాలకృష్ణుడి నడుము చుట్టూ వేయబోతే అది రెండు వేళ్లంత తక్కువగా ఉంది. మరొక తాడు తెచ్చి మొదటిదానికి కలిపింది. అయినా మళ్లీ రెండు వేళ్లంత తక్కువే! ఇంట్లో ఉన్న తాళ్లన్నింటినీ తీసుకొచ్చి ఒకదానికొకటి కలిపినా అదే పరిస్థితి. గోపికలు కూడా తాళ్లు తెచ్చిచ్చారు. తాళ్లు పెరుగుతున్నాయి కానీ కొరత మాత్రం తీరడం లేదు. అలసటతో చెమటలు కారుతున్నా యశోదమ్మ ప్రయత్నాన్ని ఆపలేదు. తల్లి శ్రమను చూసిన కృష్ణుడు కరుణించాడు. అప్పుడు ఆ తాడు సరిపోయింది. అనంతమైన పరమాత్మ తల్లిప్రేమకు తలొంచాడు. ఈ కారణంగానే కృష్ణుడికి ‘దామోదరుడు’ అనే పేరు వచ్చింది.

ఇక్కడే ఆ రెండు వేళ్లలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కనిపిస్తుంది. భగవంతుణ్ని మన బుద్ధితో కొలవలేం. శక్తితో పూర్తిగా అందుకోలేం. కానీ ప్రేమతో పిలిస్తే, భక్తితో ప్రయత్నిస్తే ఆయన తనను తాను భక్తుడికి అందుబాటులోకి తెచ్చుకుంటాడు. ఆ రెండు వేళ్లను భక్తుడి ప్రయత్నం, భగవంతుడి కృపకు సంకేతాలుగా భావించే ఆధ్యాత్మిక వ్యాఖ్యానం కూడా ఉంది.

ఇదే భావాన్ని మరోకోణంలో చూస్తే ‘అహం’, ‘మమ’ అనే రెండు బంధాలు గుర్తుకొస్తాయి. ‘నేనే చేస్తున్నాను’ అనే అహంకారం ఒకటి, ‘ఇది నాది’ అనే మమకారం మరొకటి. ఈ రెండూ మనిషిని సంసారానికి కట్టిపడేసే అదృశ్య తాళ్లు. వాటిని వదిలిపెట్టకుండా భగవంతుణ్ని పొందాలని ప్రయత్నించడం అంటే రెండు వేళ్ల కొరత ఉన్న తాడుతో కృష్ణుణ్ని కట్టాలనుకోవడమే. యశోదమ్మ దగ్గర బిడ్డపై స్వచ్ఛమైన ప్రేమ తప్ప మరే స్వార్థమూ లేదు. ఆమె పట్టుదల, ప్రేమ, శ్రమను చూసిన కృష్ణుడు స్వయంగా బందీ అయ్యాడు. ఆ తరవాత అదే బంధిత కృష్ణుడు రోలును ఈడ్చుకుంటూ వెళ్లి రెండు అర్జున వృక్షాలను కూల్చి, శాపవశాత్తు చెట్లుగా ఉన్న కుబేరుడి కుమారులకు విముక్తిని ప్రసాదించాడు.

భగవంతుణ్ని బంధించగలిగిన తాడు అంటూ ఏదీ లేదు. మనలోని అహంకారాన్ని వదులుకుని బాహ్య సుఖాలపై మమకారాన్ని తగ్గించుకుని ప్రేమతో ఆయనను హృదయంలో నిలుపుకోవడమే నిజమైన బంధం. ఆశ్చర్యమేమిటంటే భగవంతుణ్ని బంధించిన ఆ భక్తి, చివరికి మనిషినే బంధాల నుంచి విముక్తుణ్ని చేస్తుంది. యశోదమ్మ కట్టిన తాడు కృష్ణుడి నడుమునే బంధించింది. ఆమె ప్రేమ మాత్రం అనంతుణ్నే బంధించింది. అదే ఈ రెండు వేళ్ల రహస్యం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
  • శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
  • విజయం దిశగా పయనం అమ్మ పండుగకు వేళయింది. ఈ అమ్మ - అందరి అమ్మల మూలపుటమ్మ, ఆమె అనుగ్రహాన్ని విరివిగా పంచే మహిమాన్విత మాసం- ఆశ్వయుజం.
  • నిత్య సంకల్పం నిత్యపూజతో సహా ఏ శుభకార్యం ప్రారంభించినా ‘ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం’ అని సంకల్పం చెబుతాం. ఇది మనిషి సంపూర్ణ జీవితాన్ని సాధించడానికి అవసరమైన నాలుగు సూత్రాలను రోజూ గుర్తుచేసే మహత్తర జీవనదృష్టి.
  • తస్మై శ్రీ తరువే నమః చెట్టులో పుట్టలో దైవత్వాన్ని దర్శించుకునే తత్వం భారతీయులది. వృక్ష మూలం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణువుకు, కొన భాగం సదాశివుడికి ఆలయాలని ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ’ అనే శ్లోకం వివరిస్తుంది.
  • ప్రకృతి - పురుషుడు సృష్టికర్త కూడా తోడుగా శక్తి లేనిదే సృష్టి చేయలేడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు తమ ‘సౌందర్యలహరి’ మొదటి శ్లోకంలోనే... శివుడైనా శక్తి చెంతనున్నప్పుడే సృష్టిని కొనసాగించగలడని, ఆ శక్తి లేకపోతే చలించడానికి కూడా ఆయనకు సాధ్యం కాదనే పరమ సత్యాన్ని చాటారు.
  • పతనానికి తొలి మెట్టు మనసులో మొదలయ్యే చిన్న కాలుష్యం అసూయ. అది పైకి కనిపించదు కానీ లోపలి నుంచి మనిషిని తొలిచేస్తుంది. ఒకరి ఆనందాన్ని చూసి సంతోషించలేకపోవడం, ఒకరి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడమే అసూయ.
  • గురుకృప త్రిమూర్తుల తత్వ స్వరూపుడు గురువు. ఈశ్వరుడికీ గురువుకూ మూర్తి భేదమే కానీ ఆత్మ ఒక్కటే. సద్గురువుల విశ్వాసాలు, విధానాలు, బోధనలు వేరైనా వారి లక్ష్యం లోకకల్యాణమే. ప్రజలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించడమే వారి ధ్యేయం.
  • మౌన స్నేహితుడు ముండకోపనిషత్తులోని ఒక అద్భుతమైన మంత్రం మన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
  • గమ్యం ఒకటే! ‘ఆధ్యాత్మికత’ అన్నది ఎంతో విశాలమైన భావన. దాన్ని ఒక నిర్వచనానికి, నిర్దిష్ట ఆచారాలకు, సంప్రదాయాలకు మాత్రమే పరిమితం చేయలేం. మౌలికంగా చూస్తే.. ఆధ్యాత్మిక ప్రయాణం వ్యక్తిగతమైనది. అందుకే, స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకోవడం కీలకం. 
  • వేలాడుతున్న మనిషి పెద్దలు చెప్పిన కొన్ని పిట్టకథలు లోతైన తాత్వికసత్యాలను సులువుగా అర్థమయ్యేట్టు చేస్తాయి. 
  • అహింసా పరమో ధర్మః ‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరో దమః/ అహింసా పరమం దాన మహింసా పరమం తపః’ అంటుంది మహాభారతం. అహింసే పరమధర్మమని, దానికి మించిన తపస్సు లేదని చెబుతుంది.
  • విచక్షణ విచక్షణ అనేది తెలివికి సంబంధించింది మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక శక్తి…. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ వివేకం అవసరం.
  • మెఱమెచ్చులు లోకుల మెప్పు పొందడానికి ప్రతివారు ప్రయత్నిస్తారు. మెఱమెచ్చు(మితిమీరిన పొగడ్త)లకు మురిసిపోనివారు తక్కువ. స్వలాభం కోసం స్తుతించేవారిని ముద్దుచేసేవారు కొందరైతే- తమకు తాముగానే డాబులకు పోయేవారు మరికొందరు!
  • జడ భరతుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటే సరిపోదు. మనసులోని కోరికలను, మమకారాన్ని కూడా జయించాలి.  భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి చివరికి రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తుంటాడు.
  • గ్రంథగ్రంథులు నవనీతం అంటే వెన్న. ఇది సామాన్యమైన అర్థం. దాన్ని ఏ భాగవత గ్రంథానికో విశేషణంగా చేర్చి ‘భాగవత నవనీతం’ అన్నప్పుడు- నవ అంటే ‘తాజాగా’ నీతం అంటే ‘భూమికి తెచ్చిన అమృతం’ అనే విశేషార్థం స్ఫురిస్తుంది.
  • విజయతీరాలు జీవితంలో విజయం అనేది ఆకస్మికంగా వరించే అదృష్టం కాదు. అది మనం అనునిత్యం తీసుకునే నిర్ణయాల ప్రతిఫలం.
  • జితేంద్రియులు సుఖదుఃఖాలు అస్థిరాలు. వాటి గురించి వ్యథ చెందడం వ్యర్థం. విషయవాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారే జితేంద్రియులు. అంటే, ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం.
  • పరమ హితులు సకల జీవుల ఆనందమే ధ్యేయంగా సాగేది ప్రకృతి చైతన్యం. దాంతో మనిషి సమన్వయం సాధించినప్పుడే సంతోషకరమైన సార్థకజీవనం సాధ్యమవుతుంది.
  • యద్భావం తద్భవతి భారతీయ సనాతన ధర్మంలోని అత్యంత శక్తిమంతమైన, ఆచరణీయమైన సూత్రాలలో ‘యద్భావం తద్భవతి’ ఒకటి.

English Translation

Translation pending...