మోగింది నగారా

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 15 Oct 2026 05:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది. మొత్తం మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం విడుదల చేసింది. 123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినా...వంద చోట్లే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలకు డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

  • మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నాలుగు నోటిఫికేషన్లు వేర్వేరుగా జారీ చేసింది. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ), విజయవాడ నగరపాలక సంస్థలకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగరపాలక సంస్థలతోపాటు.. 87 పురపాలక సంఘాలకు మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 28న పోలింగ్‌.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.  
  • 9,983 ఎంపీటీసీ, 662 జడ్పీటీసీ స్థానాలకు అక్టోబరు 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబరు 3న పోలింగ్, 5న ఫలితాలు వెల్లడవుతాయి.  
  • 13,185 గ్రామ పంచాయతీలకు నవంబరు 26, 29, డిసెంబరు 2న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోలింగ్‌ రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.  

16 నుంచి నామినేషన్ల స్వీకరణ

మున్సిపల్‌ ఎన్నికలకు శుక్రవారం నుంచి పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం ఇచ్చిన నోటిఫికేషన్‌పై మళ్లీ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా ఎన్నికల అధికారులు శుక్రవారం ఉదయం ఎన్నికల నోటీస్‌ జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 05:19 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్‌ లాస్‌ (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2021ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
  • చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
  • కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
  • జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
  • దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
  • 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
  • మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
  • జగన్‌ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
  • మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రజత్‌భార్గవ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
  • ప్రత్యేక నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు పిటిషన్‌పై వాదనలు పూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సాధారణ నామినేషన్‌ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
  • మహాచండీదేవిగా జగన్మాత దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ.. మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రామరి నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • సీతా స్వయంవర అలంకారంలో శ్రీవారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
  • న్యాయవాద వృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కోర్టులో ఎలా వ్యవహరించాలి, వాదనలు ఎలా చెప్పాలనే విషయాన్ని సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు.
  • ఓఎంసీ కేసులో విశ్రాంత ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో 6వ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అభియోగాలను నమోదు చేసింది.
  • ‘పోలవరం’ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది.  ప్రాజెక్టును ఈ బృందం సందర్శించడం ఇది ఎనిమిదోసారి. బృంద సభ్యులు రిచర్డ్‌ డొన్నెల్లీ, డేవిడ్‌ పాల్, డి సిస్కో, హించ్‌బెర్గర్‌లతో తొలుత పోలవరం అధికారులు, అథారిటీ అధికారులు సమావేశమయ్యారు.
  • పరిశ్రమల అవసరాలకు శిక్షణ.. ఉపాధికి చేయూత: మంత్రి లోకేశ్‌ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంపొందించడమే తమ ప్రాధాన్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
  • ఎర్రబస్సు రాదన్నారు.. అదే విమానాశ్రయంలో దిగారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌బస్‌ ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ గతంలో మాట్లాడారని అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
  • జడ్పీ ఛైర్మన్‌ రేసులో పరిటాల శ్రీరామ్‌ శ్రీసత్యసాయి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కూటమి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్‌ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయనను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
  • మూడున్నరేళ్లుగామొక్కవోని దీక్ష! ఇది విశాఖ ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలోని సీఎండీ ఛాంబర్‌. ఆ ప్రాంతమంతా ఇలా మొక్కలతో నిండిపోయి కనువిందు చేస్తోంది.

English Translation

Mogindi Nagara

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 15 Oct 2026 05:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Today, Amaravati: The town has rang for local body elections in the state. Notification for elections in 13 municipal bodies and 87 municipal societies was released on Wednesday. The Election Code of Conduct also came into force with immediate effect. Local body elections will be held in three phases. Polling for municipal elections will be conducted in a single phase. Polling for ZPTC and MPTC elections will also be held in a single phase. Gram Panchayat polling will be conducted in three phases. The State Election Commission released the schedule for this on Wednesday. Although reservation has been announced for 123 urban local bodies...notifications have been issued for conducting elections in hundreds of places. These include 13 Municipal Corporations and 87 Municipal Corporations. Elections to Srikakulam, Rajamahendravaram, Kakinada, Mangalagiri-Tadepalli Municipal Corporations and 19 Municipal Corporations are likely to be held in December. A separate notification will be released for them. 

  • The Election Commission has issued four different notifications regarding the municipal elections. Two separate notifications were issued to the Maha Visakhapatnam Municipal Corporation (GVMC) and Vijayawada Municipal Corporation. In addition to Vizianagaram, Eluru, Machilipatnam, Guntur, Ongole, Nellore, Tirupati, Chittoor, Kadapa, Kurnool, Anantapur Municipal Corporations, two more notifications have been issued to 87 Municipal Corporations. Nominations will be accepted from 16th. Polling on 28th. Counting of votes will be done on 30th. Results will be declared on the same day.  
  • Nominations for 9,983 MPTC and 662 ZPTC posts will start on October 21. The polling will be held on November 3 and the results will be declared on November 5.  
  • Polling for 13,185 gram panchayats will be held on November 26, 29 and December 2. In each phase, the votes will be counted and the results announced on the polling day itself.  

Receipt of nominations from 16

Nominations for the municipal elections will be received from Friday in the offices of Pura, Municipal Corporations and Nagar Panchayat. Based on the notification given by the State Election Commission on Wednesday, the election authorities will again issue election notices by municipalities and corporations on Friday morning and start the process. href="https://www.eenadu.net/andhra-pradesh" target="_blank" rel="noopener">Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 05:19 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • We cannot stay the elections in those 23 places. The Supreme Court has issued a notice to the state government in the petitions filed challenging the AP Municipal Laws (Amendment) Act 2021 made by the Vaikapa government in 2021, including the nearby villages in the 23 municipal, municipal bodies and city panchayats of the state. Meet competition "Discussions between Telugu Desam and Janasena in local body elections have been successful. There are no mistakes between us The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Janasena is likely to contest in four municipal bodies, 20 to 24 municipal societies and three to four city panchayats.
  • Vangaveeti Radhakrishna joins Janasena. Former Vijayawada MLA Vangaveeti Radhakrishna has joined Janasena. He, who was in TEDP till now, joined the alliance.
  • No Deuce, caste certificates within 24 hours of application. State Election Commissioner Anilchandra Punetha has made it clear that elections are being held simultaneously with the intention of not having administrative difficulties.
  • Elections in 13 city governing bodies. Elections will be held for a total of 3,942 wards in 13 city governing bodies and 87 municipal societies in the state. The fate of mayors, chairpersons, corporators and ward members will be decided by 1.03 crore voters in urban local bodies.
  • President visits Mahachandi Devi President Draupadimurmu on Wednesday participated in the Sharannavaratri celebrations at Vijayawada Indrakiladri. Visited Durgamma in the form of Mahachandi Devi.
  • Daily investigation in Jagan cases. A crucial development has taken place in the CBI court in the illegal assets case of Vaikapa chief Jagan. The CBI court has decided to conduct daily investigation in the cases registered by the Enforcement Directorate (ED) regarding Jagan's illegal assets. Retired IAS officer Rajat Bhargava attended the Enforcement Directorate (ED) hearing on Wednesday in connection with the Rs 1,000-crore liquor scam case during the Vaikapa government. Arguments ended in the High Court on Wednesday on the lawsuit filed by Vaikapa State General Secretary Lella Appireddy to issue instructions to set up a special center at the District Election Officer in each district in addition to the normal nomination centers to file nominations during the elections of ZPTC, MPTC and Municipalities.
  • Jaganmata Durgamma as Mahachandi Devi. As part of the Dussehra Sharannavaratri celebrations, Jaganmata Durgamma appeared to the devotees in the form of Mahachandi Devi on the Indrakiladri of Vijayawada on Wednesday on the fourth day. Devi Sarannavaratri festival is being held in Srishaila Mahakshetra of Nandyala district with grandeur. On Wednesday, Bhramaramba Devi appeared to the devotees in Kushmanda Durga Alankaram. As part of the Tirumala Srivari Navratri Brahmotsavam, Srimalayappa Swami along with Sridevi and Bhudevi appeared on the Mutyapupandiri vehicle on the third day on Wednesday night as part of Tirumala Srivari Navratri Brahmotsavam. High Court Judges advised the young lawyers to observe the proceedings in the court with a close eye. They want to learn from seniors how to behave in court and how to present arguments.
  • Retired IAS Srilakshmi has been charged in the OMC case. The CBI court on Wednesday filed charges against the 6th accused in the Obulapuram Mining (OMC) case, retired IAS officer Y. Sreelakshmi, Secretary of the Industries Department. A team of foreign experts visited the Polavaram project on Wednesday.  This is the eighth time the team is visiting the project. Team members Richard Donnelly, David Paul, D Cisco, Hinchberger first met Polavaram officials and authority officials.
  • Training for the needs of industries.. Help for employment: Minister Lokesh Education and IT Minister Lokesh said in a statement that their priority is to develop skills to provide job opportunities to the youth of the state. Landed at the same airport Vizianagaram MP Kalishetti Appalanayudu stated that former Chief Minister Jagan had previously talked about how Airbus would come to Bhogapuram where there was no red bus, and he was welcomed by a special flight to the same airport. Paritala Sriram's name came to the fore as the candidate of the Sri Sathya Sai Zilla Parishad Chairman alliance. There is a strong campaign in the political circles that the TDP leadership wants to keep him in the ring as the post of ZP chairman has been allotted to the general. This is the CMD Chamber in APEPDCL office, Visakha. The whole area is full of plants and it is pleasing to the eye.