
మోగింది నగారా

- A
- A+
- A++
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది. మొత్తం మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. 123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినా...వంద చోట్లే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలకు డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల కానుంది.
- మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నాలుగు నోటిఫికేషన్లు వేర్వేరుగా జారీ చేసింది. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ), విజయవాడ నగరపాలక సంస్థలకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగరపాలక సంస్థలతోపాటు.. 87 పురపాలక సంఘాలకు మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 28న పోలింగ్.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
- 9,983 ఎంపీటీసీ, 662 జడ్పీటీసీ స్థానాలకు అక్టోబరు 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబరు 3న పోలింగ్, 5న ఫలితాలు వెల్లడవుతాయి.
- 13,185 గ్రామ పంచాయతీలకు నవంబరు 26, 29, డిసెంబరు 2న పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోలింగ్ రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
16 నుంచి నామినేషన్ల స్వీకరణ
మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం నుంచి పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఇచ్చిన నోటిఫికేషన్‌పై మళ్లీ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా ఎన్నికల అధికారులు శుక్రవారం ఉదయం ఎన్నికల నోటీస్ జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు.

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
- చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
- దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
- మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
- జగన్ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
- మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రజత్‌భార్గవ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
- ప్రత్యేక నామినేషన్ కేంద్రం ఏర్పాటు పిటిషన్‌పై వాదనలు పూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సాధారణ నామినేషన్ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
- మహాచండీదేవిగా జగన్మాత దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ.. మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రామరి నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- సీతా స్వయంవర అలంకారంలో శ్రీవారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
- న్యాయవాద వృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కోర్టులో ఎలా వ్యవహరించాలి, వాదనలు ఎలా చెప్పాలనే విషయాన్ని సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు.
- ఓఎంసీ కేసులో విశ్రాంత ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో 6వ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అభియోగాలను నమోదు చేసింది.
- ‘పోలవరం’ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. ప్రాజెక్టును ఈ బృందం సందర్శించడం ఇది ఎనిమిదోసారి. బృంద సభ్యులు రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్, డి సిస్కో, హించ్‌బెర్గర్‌లతో తొలుత పోలవరం అధికారులు, అథారిటీ అధికారులు సమావేశమయ్యారు.
- పరిశ్రమల అవసరాలకు శిక్షణ.. ఉపాధికి చేయూత: మంత్రి లోకేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంపొందించడమే తమ ప్రాధాన్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
- ఎర్రబస్సు రాదన్నారు.. అదే విమానాశ్రయంలో దిగారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌బస్ ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో మాట్లాడారని అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
- జడ్పీ ఛైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్ శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ కూటమి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయనను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
- మూడున్నరేళ్లుగామొక్కవోని దీక్ష! ఇది విశాఖ ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీఎండీ ఛాంబర్. ఆ ప్రాంతమంతా ఇలా మొక్కలతో నిండిపోయి కనువిందు చేస్తోంది.