5 ఐపీఓలు.. రూ.1,600 కోట్ల సమీకరణ లక్ష్యం

- A
- A+
- A++

ఈనెల 12-19 తేదీల్లో మొత్తం 5 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,600 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
- అగ్నిమాపక పరికరాలు, వ్యవస్థలను తయారు చేసే హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ ఐపీఓ ఈనెల 13-15 తేదీల్లో జరగనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.258-271. ఒక లాట్లో 55 షేర్లు ఉంటాయి. రూ.712 కోట్ల ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది.
- వ్యాపార సంస్థలకు పరిష్కారాలను అందించే ఫ్యూజన్ సీఎక్స్, రూ.702 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈనెల 14- 16 తేదీల్లో ఐపీఓకు వస్తోంది. ధరల శ్రేణి రూ.275 -289. ఒక లాట్లో 51 షేర్లు ఉంటాయి.
- గుండె, రక్తనాళాలకు సంబంధించిన వైద్య చికిత్సల్లో ఉపయోగించే పరికరాలను తయారు చేసే సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఇష్యూ ఈనెల 15-19 తేదీల్లో జరగనుంది. ధరల శ్రేణిని ఇంకా ప్రకటించలేదు. మొత్తం 2.76 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు.
ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై:రవితా ఇంజినీరింగ్ సర్వీసెస్ రూ.116 కోట్ల ఇష్యూ ఈనెల 13-15 తేదీల్లో జరగనుంది. ధరల శ్రేణి రూ.105-112. వైభవ్ వ్యాపార్ రూ.42.10 కోట్ల ఐపీఓ ఈనెల 13-15 తేదీల్లో జరగనుంది. ధరల శ్రేణి రూ.51-54.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది.
- మూలధన లాభాల పన్నుపై చర్చకు సిద్ధం స్వల్ప-దీర్ఘకాల మూలధన లాభాలపై విధిస్తున్న పన్ను తొలగింపునకు సంబంధించి, రాబోయే బడ్జెట్ సంప్రదింపుల్లో సలహాలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- బలంగా పుంజుకున్న సూచీలు ఐటీ షేర్లు పరుగులు తీయడంతో, సోమవారం చవిచూసిన భారీ నష్టాల నుంచి సూచీలు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రూపాయి కోలుకోవడం, మూలధన లాభాల పన్నుపై సూచనలు పరిశీలిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.
- చిప్ సరఫరాలో కీలకం అవుతాం మనదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకం కానున్నాయని.. దేశంలో ప్రతిభావంతుల లభ్యత, భారీ దేశీయ మార్కెట్, అంతర్జాతీయ భాగస్వామ్యాల రీత్యా ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య కేంద్రంగా మన దేశం అవతరిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
- విపణిలోకి సైకిల్ బ్రాండ్ నూతన ఉత్పత్తులు పూజా సామగ్రి, అగరుబత్తీల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తీ, మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో సంస్థ ఎండీ, సీఈఓ అర్జున్ రంగా వీటిని విపణిలోకి విడుదల చేశారు.
- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎంజీ విండ్సర్ ఇండల్జ్ కారును మంగళవారం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ విడుదల చేసింది. దీని ధర రూ.17.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు, పూర్తి ఛార్జింగ్‌తో 332 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
- రూ.20.23 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల ఆమోదం కోసం సిఫారసు రహదార్లు, రైల్వేలు సహా వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు రూ.20.23 లక్షల కోట్ల విలువైన 400కు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీఎం గతిశక్తి కార్యక్రమం కింద ఆమోదం కోసం నెట్వర్క్ ప్లానింగ్ గ్రూపు (ఎన్పీజీ) సిఫారసు చేసింది.
- 17 వరకు సౌదీకి భారత విమానాలు రద్దు సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఈనెల 17 వరకు రద్దు చేస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి.
- ఎల్ఐసీ నుంచి కొత్తగా 3 పాలసీలు బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, కుటుంబ ఆరోగ్య రక్షణ, క్యాన్సర్ చికిత్స సమయంలో ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకాల ప్రధాన లక్ష్యం.
- ఏఐ హార్డ్‌వేర్ తయారీకి జాబిల్ - అదానీ సంయుక్త సంస్థ మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్ పరికరాల తయారీ ప్లాంటును 50:50 భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అమెరికా సంస్థ జాబిల్, గౌతమ్ అదానీ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయించాయి.
- 2026-27లో భారత్ వృద్ధి 7%: ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జులైలో అంచనా వేసిన 6.4% కంటే ఇది 0.6% అధికం కావడం గమనార్హం.
- సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదు అమెరికాలో తమ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ కోసం స్పాన్సర్ చేయకుండా అమెరికా తాత్కాలికంగా విధించిన ఆంక్షల వల్ల, సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని విప్రో స్పష్టం చేసింది.
- ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు సిటీతో రూ.3,200 కోట్లకు ఇండిగో ఒప్పందం దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, 8 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు నిమిత్తం అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీతో 328 మి. డాలర్ల (సుమారు రూ.3200 కోట్లు) రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది.
- ఇన్ఫీ ఆదాయాల్లో సగం ఏఐ సేవలే అందిస్తాయ్ ఇన్ఫోసిస్ ఆదాయాల్లో ఏఐ (కృత్రిమమేధ) సేవల వాటా గత త్రైమాసికంలో 8 శాతానికి పైగా నమోదైందని.. జూన్ త్రైమాసికం కంటే రెండంకెల వృద్ధిని ఇది సాధించిందని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు.
- సంక్షిప్త వార్తలు (8) కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల ఖర్చులు భారీగా పెరగడం, సాఫ్ట్వేర్ రంగ భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనడం లాంటి కారణాలను చూపుతూ వార్షిక వేతన పెంపులను నిలిపేసి, మార్కెటింగ్ వ్యయాలను జోహో కార్పొరేషన్ తగ్గించుకుందని..