
రియాద్ రక్తసిక్తం

- A
- A+
- A++
కైరో: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి దాడులతో దద్దరిల్లింది. దానిపై శనివారం జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్‌వాసి సహా మొత్తం 13 మంది మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిలో కనీసం 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులు తాము చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులేమీ ప్రకటించలేదు. అయితే సౌదీ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటామని.. వాటి ద్వారా ప్రయాణాలు చేయవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను వారు హెచ్చరించారు. దీంతో పలు విమానాశ్రయాలను సౌదీ మూసివేసింది. ఆదివారం కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌పైకి ఓ ప్రొజెక్టైల్ దూసుకొచ్చింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

- రియాద్ విమానాశ్రయ సముదాయంలోని 3, 4 టెర్మినళ్లను లక్ష్యంగా చేసుకుని శనివారం నాటి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీలు ఉన్నారు. మిగతా మృతులను భారత్, అమెరికా, పాలస్తీనా, ఈజిప్టు, జోర్డాన్, సిరియా, సూడాన్ పౌరులుగా గుర్తించారు.
- సౌదీకి అండగా హూతీలపై దాడులకు దిగే దిశగా తాము యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే.. హూతీలు బాబ్ ఎల్-మాండెబ్‌ను మూసివేయడం, పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా మరింత తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ముప్పుంది. హూతీలను ఆయుధంగా చేసుకుని సౌదీపై ఇరాన్ ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- రియాద్ విమానాశ్రయంపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలను వెంటనే ఆపేయాలని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో సూచించింది. గాయపడ్డ భారతీయులకు మెరుగైన చికిత్స అందేలా సౌదీ అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు భారత్ తెలిపింది.
సనాపై సౌదీ దాడులు
యెమెన్ రాజధాని సనాపై సౌదీ తాజాగా రెండు వైమానిక దాడులు చేసిందని హూతీలు ఆరోపించారు. ఈ దాడుల్లో ఓ చిన్నారి మృతిచెందినట్లు, మరో ఆరుగురు గాయపడినట్లు పేర్కొన్నారు. గత ఐదు వారాల్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన దాడుల్లో 91 మంది యెమెన్ వాసులు ప్రాణాలు కోల్పోయారని, 168 మంది గాయపడ్డారని హూతీలు వెల్లడించారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పడేనా ట్రంప్ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
- కోలుకుంటున్న పోప్ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు.
- ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే... ఎలాన్ మస్క్ కూడా ఉక్రెయిన్ను దెబ్బకొట్టారు.
- జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
- మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం పేర్కొంది.
- గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్ సెటిల్మెంట్’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
- ‘ఫ్లైదుబాయ్’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్ పైలట్ల అరెస్ట్ ‘ఫ్లైదుబాయ్’ విమానాన్ని హైజాక్ చేసి, కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
- 11 ఏళ్ల పగ! యెమెన్‌లోని అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా వేసుకున్న లెక్కలు తప్పాయా.. ఆ దేశం ఎరక్కపోయి ఇరుక్కుందా.. గల్ఫ్‌లో తమ దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మార్చాలనుకునే క్రమంలో యెమెన్‌పై తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా.. అంటే ప్రస్తుతం హూతీలు చేస్తున్న దాడులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
- రాయిలాంటిదనుకుంటే.. రాచకుటుంబ స్మారకమైంది కాలం కలిసొస్తే రాయి కూడా రత్నమవుతుందంటారు. లండన్‌లోని ఓ వ్యక్తి ఓ ఛారిటీ దుకాణంలో రూ.1,890 చెల్లించి తను ఒక ఉంగరం కొన్నాడు.
- హూతీల దెబ్బకు ప్యాలెస్‌లు మార్చుతున్న సౌదీ యువరాజు! దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎప్పుడు ఏ రాజభవనంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
- న్యూయార్క్ విమానాశ్రయంలో యూనస్‌కు ‘అవామీలీగ్’ అవహేళన షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరించిన మహమ్మద్ యూనస్ న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయంలో అవహేళనలు ఎదుర్కొన్నారు.
- అవినీతి ఆరోపణలతో… గ్రీసు దేశ అమెరికా రాయబారి రాజీనామా గ్రీసు దేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించిన కింబర్లీ గిల్‌ఫాయిల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
- సౌదీలో అప్రమత్తంగా ఉండండి సౌదీ అరేబియాలో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివాసం ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
- సంక్షిప్త వార్తలు (3) ఊపిరితిత్తుల్లో చిన్న కణితి ఉన్నట్లు తెలియడంతో శస్త్రచికిత్స నిమిత్తం పోప్ లియో-14 మంగళవారం రోమ్‌లోని జెమెలీ ఆసుపత్రిలో చేరారు.