కూర్చున్నా నిద్ర వస్తుందా?

కొందరు మహిళలు పగటి వేళల్లో తరచూ ఆవులిస్తుంటారు. ముఖ్యంగా నలభై, యాభై దాటాక చదువుతున్నా పనిచేస్తున్నా తెలియకుండానే కళ్లు మూతలు పడుతుంటాయి. ఆపడం ఓ పట్టాన సాధ్యం కాదు. దాంతో కాఫీ, టీలను ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

Eenadu icon
By Vasundhara Team Published : 12 Oct 2026 01:01 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

కొందరు మహిళలు పగటి వేళల్లో తరచూ ఆవులిస్తుంటారు. ముఖ్యంగా నలభై, యాభై దాటాక చదువుతున్నా పనిచేస్తున్నా తెలియకుండానే కళ్లు మూతలు పడుతుంటాయి. ఆపడం ఓ పట్టాన సాధ్యం కాదు. దాంతో కాఫీ, టీలను ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముందు ఈ పగటి నిద్రకు కారణమేంటో గుర్తించాలి. నిజానికి ఇదేమంత భయపడాల్సిన సమస్య కాదు. ఆ వయసులో ఇది సహజమే. పెరి మెనోపాజ్, మెనోపాజ్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, మెలటోనిన్‌ హార్మోన్లు తగ్గడంతో రాత్రివేళ తరచూ మెలకువ వచ్చేస్తుంటుంది. దీనికితోడు వేడి ఆవిర్లు, శ్వాస అందకపోవడం వంటివీ ఉంటుంటాయి.

అందువల్లే పగటివేళ అలసటగా అనిపించడం, ఆవులించడం జరుగుతుంది. విటమిన్‌ బి12, డి, ఐరన్‌ లోపం, థైరాయిడ్‌ సమస్యలున్నా ఇలా జరగొచ్చు. కుటుంబ బాధ్యతలు, కెరియర్‌లో ఒత్తిడి కూడా నిద్రలేమికి దారితీస్తుంటాయి. కాబట్టి ముందు కారణాన్ని గుర్తించాలి. తరచూ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సిందే!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :